బుద్ధదేవ్, మరో ఇద్దరు
కోల్‌కతా: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాలను ముగ్గురు ప్రముఖులు తిరస్కరించారు. పద్మ భూషణ్ అవార్డును మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య, పద్మశ్రీ అవార్డును ప్రముఖ గాయని సంధ్య ముఖర్జీ(90) నిరాకరిస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా ప్రముఖ తబలా వాద్యకారుడు పండిట్ అనింద్య ఛటర్జీ(67) కూడా తనకు పద్మశ్రీ పురస్కారం వద్దని తెలిపారు. వీరందరూ పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన వారు. తనకు పద్మశ్రీ వచ్చినట్లు మంగళవారమే దిల్లీ నుంచి ఫోన్ వచ్చిందని చెప్పిన అనింధ్య.. కెరీర్ ప్రస్తుత దశలో పద్మశ్రీ అందుకోవడానికి సిద్ధంగా లేనని వెల్లడిరచారు. పదేళ్ల క్రితమే తన జూనియర్లకు ఈ పురస్కారం వచ్చిందని, అప్పుడే తనకూ ఇచ్చి ఉంటే ఆనందంగా స్వీకరించేవాడినని అనింద్య పేర్కొన్నారు.