పార్లమెంటు గౌరవాన్ని మంట కలుపుతున్నారని కేంద్ర మంత్రి, బీజేపీ నేత ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్లమెంటును చేపల బజారుగా మార్చొద్దని కోరారు. జూలై 19న పార్లమెంటు వర్షాకాలం సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి పెగాసస్ స్పైవేర్ ప్రాజెక్టుపై విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రతిపక్షాల నిరసనల మధ్య ప్రభుత్వ బిల్లులు ఆమోదం పొందుతున్నాయి. దీనిపై ఒబ్రెయిన్ ఇటీవల ఇచ్చిన ఓ ట్వీట్‌లో మోదీ సర్కారు తీరును ఎండగట్టారు. ఒక్కొక్క బిల్లును సగటున ఏడు నిమిషాల్లోనే ఆమోదించుకుంటున్నారని దుయ్యబట్టారు. చట్టాలను ఆమోదించుకుంటున్నారా? పప్రి చాట్ తయారు చేస్తున్నారా? అని ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు. ఈ నేపథ్యంలో ముక్తార్ అబ్బాస్ నఖ్వీ స్పందిస్తూ, డెరెక్ ఒబ్రెయిన్‌కు పప్రి చాట్ ఇష్టపడకపోతే చేపల కూర తినొచ్చని ఆయనకు సలహా ఇచ్చారు. పార్లమెంటును చేపల బజారుగా మార్చకూడదని హితవు పలికారు.