: ఎడిటర్స్ గిల్డ్
పెగాసస్ స్పైవేర్ వ్యవహారంపై సిట్ ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ చేపట్టాలని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా (ఈజీఐ) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీని కోసం ఎడిటర్స్ గిల్డ్ రిట్ పిటిషన్ దాఖలు వేసింది. పెగాసస్ స్పైవేర్‌తో దేశంలోని జర్నలిస్టులు, రాజకీయవేత్తలు, సామాజిక కార్యకర్తల ఫోన్లను హ్యాక్ చేసినట్లు ఓ కథనం జాతీయ, అంతర్జాతీయ మీడియాలో వచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై పార్లమెంట్‌లోనూ విపక్ష సభ్యులు ఆందోళన చేస్తున్నాయి. స్పైవేర్‌తో ఏయే కంపెనీలతో కేంద్రం ఒప్పందం కుదుర్చుకుందో, ఎవరెవరిపైన దీన్ని వాడారో చెప్పాలని ఎడిటర్స్ గిల్డ్ తన పిల్‌లో కోరింది. ఆగస్టు 5వ తేదీన ఈ అంశంపై చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం చారణ చేపట్టనున్నది.