రూ.78 వేల మార్కు దాటిన వైనం
న్యూదిల్లీ: బంగారం ధరకు రెక్కలు వచ్చాయి. పది గ్రామాలు రూ.78వేల మార్కును దాటింది. దేశ రాజధాని దిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మరో రూ.400 పెరిగి రూ.78,250కి పెరిగింది. అంతర్జాతీయంగా పసిడికి డిమాండ్, దేశీయంగా వర్తకుల కొనుగోళ్ల క్రమంలో ధర పెరిగినట్లు మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. బుధవారం రూ.77,850 ఉన్న ధర గురువారానికి రూ.78,250కు చేరినట్లు ఆలిండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. మరోవైపు వెండికీ డిమాండ్ ఉంది. కిలో ధర రూ.94వేల మార్కును చేరుకుంది. ధరలో పెంపుదల వెయ్యి రూపాయల మేర ఉంది. అంతర్జాతీయ కమొడిటీ ఎక్స్ఛేంజీలో ఔన్సు బంగారం 2701 డాలర్లు పలుకుతోంది.
ద్రవ్యోల్బణం కట్టడికి వడ్డీ రేట్లు పెంచుకుంటూ వచ్చిన కేంద్ర బ్యాంకులు ఇప్పుడు వృద్ధికి ఊతం ఇచ్చేందుకు వడ్డీ రేట్లు తగ్గిస్తున్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్త కూడా బంగారం ధర పెంపునకు దోహదమైంది. ఈ కారణాలతో డిమాండ్ ఏర్పడిరదని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌లో సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ వెల్లడిరచారు. డాలరు ధర క్షీణించడం కూడా మరొక కారణమన్నారు.