ఇంట్రానాసల్ టీకా..బూస్టర్‌గా ఇచ్చేందుకు ట్రయల్స్‌కు అనుమతి
వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారత్ బయోటెక్ కంపెనీ మరో ముందడుగు వేసింది. ఈ సంస్థకు చెందిన ఇంట్రా నాసల్ కొవిడ్ మందును బూస్టర్ డోసుగా ఇచ్చేందుకు కావాల్సిన ట్రయల్స్ నిర్వహించేందుకు డగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది. ఈ ఫ్రజ్3 బూస్టర్ డోస్‌లో భాగంగా చుక్కల మందు టీకాకు డీసీజీఐ నిపుణుల కమిటీ సూత్రప్రాయంగా ఆమోదం ఇచ్చింది. ఈ అనుమతులు పొందిన మొదటి వ్యాక్సిన్ ఇదే కావడం విశేషం. ఇదిలా ఉంటే ఫేస్3 బూస్టర్ డోస్ కోసం దరఖాస్తు చేసుకున్న రెండో కంపెనీగా భారత్ బయోటిక్ నిలిచింది. ఇప్పటికే రెండు డోస్‌ల కోవ్యాక్సిన్, కోవిషీల్డ్ తీసుకున్న వారికి బూస్టర్ డోస్ కింద ఈ చుక్కల మందు అనువైందని భారత్ బయోటిక్ పేర్కొంది.