ఈ నెల 27 నుంచి మూడు రోజుల పాటు తాజ్‌మహల్‌లోకి పర్యాటకులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు పురావస్తుశాఖ వెల్లడిరచింది. ఐదవ మొఘల్ చక్రవర్తి షాజహాన్ ‘ఉర్స్’ సందర్భంగా ఫిబ్రవరి 27 నుంచి మార్చి 1వతేదీ వరకు తాజ్‌మహల్‌లోకి పర్యాటకులకు ఉచిత ప్రవేశం కల్పించనున్నారు.మొఘల్ చక్రవర్తి వర్ధంతి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఈ మినహాయింపు ఇస్తున్నట్లు పురావస్తుశాఖ సూపరింటెండిరగ్ ఆర్కియాలజిస్ట్ రాజ్ కుమార్ పటేల్ తెలిపారు. ఫిబ్రవరి 27, 28 మార్చి 1 తేదీల్లో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు తాజ్‌మహల్‌లోకి పర్యాటకులకు ఉచిత ప్రవేశం ఉంటుందని తెలిపారు.