Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 15, 2024
Sunday, September 15, 2024

యూపీఎస్‌ బూటకం

. ఎన్‌పీఎస్‌కు కొనసాగింపుగానే రూపకల్పన
. పాత పింఛన్‌ పథకం పునరుద్ధరించాల్సిందే
. కేంద్రానికి ఏఐటీయూసీ డిమాండ్‌

న్యూదిల్లీ: పాత పింఛన్‌ పథకాన్ని పునరుద్ధరించాల్సిందేనని ఏఐటీయూసీ ప్రధానకార్యదర్శి అమర్‌జిత్‌ కౌర్‌ డిమాండ్‌ చేశారు. కొత్త పింఛన్‌ విధానం (ఎన్‌పీఎస్‌)కు కొనసాగింపునగానే ఏకీకృత పింఛన్‌ పథకం (యూపీఎస్‌)ను మోదీ ప్రభుత్వం రూపొందించిందని విమర్శించారు. యూపీఎస్‌లోనూ తమ వేతనాల్లో నుంచి 10శాతాన్ని ప్రభుత్వ ఉద్యోగాలు చెల్లించాలని, ఈ పథకం అమలైతే అనేక ఉల్లంఘనలు తప్పవని అమర్‌జిత్‌ కౌర్‌ ఆదివారం ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు. నాన్‌`కాంట్రిబ్యూటరీ పాత పింఛన్‌ పథకాన్ని పునరుద్ధరించాలని ఏఐటీయూసీ తరపున కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. అందుకోసం పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు. పింఛన్‌ హక్కు కోసం ఉద్యమాన్ని కొనసాగించాలని కేంద్రరాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పిలుపు నిచ్చారు. ప్రాంతాలు, పథకాల పేర్లు మార్చడం తప్ప మోదీ ప్రభుత్వానికి ప్రజల ప్రయోజనాలు పట్టవని తాజా కేబినెట్‌ నిర్ణయాలతో మరోమారు రుజువు అయిం దని అమర్‌జిత్‌ కౌర్‌ వ్యాఖ్యానించారు. యూపీఎస్‌... కేంద్రరాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సంతృప్తినివ్వలేదని, ఇది ఎన్‌పీఎస్‌ పొడిగింపుగానే ఉంది తప్ప పాత పింఛన్‌ పథకం వలే ప్రయోజనాలు కల్పించలేదని అభిప్రాయపడ్డారు. పదేళ్లుగా ఉన్న పూర్తి పింఛన్‌ కాలాన్ని 25ఏళ్లకు పెంచడం దుర్మార్గమన్నారు. కనీస పింఛన్‌ రూ.10వేలు కాగా కనీస కుటుంబ ఫించన్‌ రూ.6వేలకు తగ్గించారన్నారు. ‘పాత పథకంలో పింఛన్‌దారులకు ప్రయోజనాలు ఉన్నాయి. ముందస్తుగా 40శాతం ఫించన్‌ తీసుకొని దానిని 15ఏళ్ల తర్వాత పునరుద్ధరించుకోవచ్చు. 80ఏళ్లు పైబడిన వారు 20శాతం అదనపు పింఛన్‌ పొందగలరు. ఆపై ప్రతి ఐదేళ్లకు పింఛన్‌ పెరుగుతంది. యూపీఎస్‌లో మార్కెటింగ్‌ జూదం కొనసాగుతుంది. ఇప్పటికే ఆరు లక్షల కోట్లుగా ఉన్న ఎన్‌పీఎస్‌ నిధిని దారాదత్తం చేసుకోవడమే కేంద్రప్రభుత్వ తాపత్రేయం’ అని అమర్‌జిత్‌ కౌర్‌ వ్యాఖ్యానించారు. వృద్ధాప్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ కల్పించే చిత్తశుద్ధి మోదీ ప్రభుత్వానికి నిజంగా ఉంటే కాంట్రిబ్యూషన్‌ను 28.5శాతానికి పెంచివుండాల్సిందన్నారు. అంటే 18.5శాతం ప్రభుత్వ తోడ్పాటు (యూపీఎస్‌లో ప్రకటించినట్లు) G 10శాతం ఉద్యోగుల తోడ్పాటు ఉండాలని… గిమిక్కులు మాని ప్రయోజనాలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. పాత పింఛన్‌ పథకానికి యూపీఎస్‌ సాటిరాదని చెప్పారు. ఎన్‌పీఎస్‌ రద్దు… పాత పింఛన్‌ పథకం పునరుద్ధరణకు పోరు కొనసాగించేందుకు ఏఐటీయూసీ కట్టుబడి ఉందని, ప్రాథమిక హక్కుగా పింఛన్‌ హక్కు సాధన కోసం ప్రభుత్వ ఉద్యోగులు చేసే పోరాటాలకు గతంలో వలే ఏఐటీయూసీ తరపున సంపూర్ణ మద్దతిస్తామని అమర్‌జిత్‌ కౌర్‌ వెల్లడిరచారు. పింఛన్‌ కోసం 20ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగుల పోరాటం సాగుతోందని గుర్తుచేశారు. ఐక్య ఉద్యమాల ద్వారా ఉద్యోగులు ఒత్తిడి పెంచిన క్రమంలో ఎన్‌పీఎస్‌ మెరుగుదలకు సిఫార్సులు చేసేలా ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్‌ నేతృత్వ ఉన్నతస్థాయి కమిటీని కేంద్రం ఏర్పాటు చేసిందని తెలిపారు. సంస్కరణలు జరిగినా పాత పింఛన్‌ పథకానికి కొత్త పథకం సాటి రాదు కాబట్టే పాత పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తున్నట్లు తెలిపారు. సోమనాథన్‌ కమిటీ సిఫార్సుల మేరకు కేంద్ర కేబినెట్‌ యూపీఎస్‌కు ఆమోదం తెలిపిందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img