పార్టీ నాయకుడు ఎస్.సి.మిశ్రా
లక్నో : ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి పోటీ చేయబోరని పార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్.సి.మిశ్రా మంగళవారం ఇక్కడ తెలిపారు. ఫిబ్రవరి 10 నుంచి ఏడు దశల్లో జరిగే ఈ ఎన్నికల్లో తాను కూడా పోటీ చేయడం లేదని మిశ్రా చెప్పారు. ఉత్తరప్రదేశ్‌తో పాటు పంజాబ్, ఉత్తరాఖండ్‌తో సహా అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నందున, బీఎస్‌పీ అధ్యక్షుడు ఎన్నికల్లో పోటీ చేయరని, పార్టీ అభ్యర్థుల విజయం కోసం పని చేస్తారని ఆయన వివరించారు. కాగా ప్రస్తుతం మాయావతి ఎంపీ లేదా శాసనసభ్యురాలు కాదు. మిశ్రా రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.