అన్నాడీఎంకే ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఎస్పీ వేలుమణి అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్నారు. వివిధ పథకాల కింద అమలు చేయాల్సిన పనుల్లో వేలుమణి రూ.1,500 కోట్ల అవినీతికి పాల్పడినట్లు కోయంబత్తూరు ఆర్థిక నేర విభాగం పోలీసులకు మంగళవారం ఫిర్యాదు అందింది. డీఎంకే సభ్యుడు, సినీ నిర్మాత ‘రేస్‌కోర్స్’ రఘునాథ్ కోవై ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.‘గత అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో కోవై కార్పొరేషన్‌తో పాటు పక్కనున్న మున్సిపాలిటీల్లో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయి. మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి, కొందరు శాసనసభ్యులు కలిసి ప్రజాధనాన్ని స్వాహా చేశారు.’ అని రఘునాథ్ కోవై ఆరోపించారు. వేలుమణిపై అవినీతి నిరోధకశాఖ ద్వారా చట్టపరమైన చర్య తీసుకోవాలని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.