నవజోత్ సింగ్ సిద్దూకు కాంగ్రెస్ అధిష్ఠానం కీలక బాధ్యతలు అప్పజెప్పింది.ముఖ్యమంత్రిగా కెప్టెన్ అమరీందర్ సింగ్ కొనసాగుతారని, అయితే పీసీసీ అధ్యక్షుడిగా నవజోత్ సింగ్ సిద్దూ బాధ్యతలు చేపడతారని పంజాబ్ కాంగ్రెస్ ఇన్‌చార్జీ హరీశ్ రావత్ ప్రకటించారు. రెండు రోజుల్లో అధికారికంగా ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తామని తెలిపారు. వీరితో పాటు మరో ఇద్దరిని వర్కింగ్ ప్రెసిండెంట్లుగా కూడా అధిష్ఠానం నియమించనుంది. కొన్ని రోజులుగా సీఎం అమరీందర్ సింగ్, అసంతృప్త నేత సిద్దూ మధ్య విభేదాలు తార స్థాయికి చేరుకున్నాయి. ఒకరిపై ఒకరు బహిరంగంగానే విమర్శలు చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు చోటుచేసుకున్న ఈ పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారాయి. ఈ నేపథ్యంలో పంజాబ్ కాంగ్రెస్‌లో నెలకొన్న ప్రతిష్టంభనకు మరో రెండు, మూడు రోజుల్లో తెరపడనుందని రావత్ పేర్కొన్నారు. అమరీందర్ సారథ్యంలోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ముందుకు వెళతామని జాతీయమీడియాతో వెల్లడిరచారు.