Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Monday, September 9, 2024
Monday, September 9, 2024

సీఎం యోగి ర్యాలీ జరిగే మైదానంలోకి పశువులు..

రైతుల వినూత్న నిరసన
పశువుల వల్ల కలిగే ఇబ్బందులను ప్రభుత్వానికి ఎత్తిచూపేందుకు యుపిలోని బారాబంకిలో రైతులు వినూత్నంగా నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ర్యాలీ జరిగే మైదానంలోకి వందలాది పశువులను విడిచిపెట్టారు. దీనికి సంబంధించిన ఫోటోను రైతు నేత రమణదీప్‌ సింగ్‌ మాన్‌ పోస్ట్‌ చేశారు. విచ్చల విడిగా తిరుగుతున్న పశువులను అడ్డుకునేందుకు మార్గం కనిపించడం లేదని ట్విటర్‌లో పేర్కొన్నారు. పశువులు విచ్చలవిడిగా తిరుగుతూ పంటలను నాశనం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్లుగా యుపీ ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించలేకపోయిందని, కనీసం ర్యాలీకి ముందైనా ఆ పశువుల సమస్యను పరిష్కరిస్తారో చూడాలని ఆయన ట్వీట్‌ చేశారు. యూపీలో పశువుల సమస్యను పరిష్కరిస్తామని గతవారం హామీ ఇచ్చిన క్లిప్‌ని కూడా పంచుకున్నారు. విచ్చలవిడిగా తిరుగుతున్న పశువులను నియంత్రించేందుకు, వాటిని సంరక్షించేందుకు మార్చి 10 అనంతరం కొత్త వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఉడిగిపోయిన పశువుల పేడ ద్వారా కూడా ఆదాయం వచ్చేలా వ్యవస్థ రూపొందించబడుతుందని ఆయన హామీ ఇచ్చారు. గత ఐదేళ్లుగా యోగి ప్రభుత్వం ఈ సమస్యను పట్టించుకోలేదని కాంగ్రెస్‌ విమర్శించింది. ఎన్నికల ముందు యోగి, మోదీలకు ఈ విషయం గుర్తుకు వచ్చిందని ఎద్దేవా చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img