కొల్లం (కేరళ) : పామును వినియోగించి భార్యను హత్య చేయించిన కేసులో భర్తకు యావజ్జీవకారాగార శిక్ష పడిరది. అక్టోబరు 11న భర్తకు కోర్టు జైలు శిక్ష విధించింది. 25 ఏళ్ల తన భార్య ఉత్రపై సూరజ్ ఎస్ కుమార్ హత్య, విషప్రయోగం, సాక్ష్యాల ధ్వంసం, హత్యాయత్నం వంటి నేరాలకు పాల్పడిన అభియోగాలపై అతడికి ఈ శిక్షను ఖరారుచేసింది. అడిషనల్ సెషన్స్ జడ్జి`6 మనోజ్ ఎం శిక్షను ప్రకటించారు. దీనిపై మాట్లాడుతూ ఈ కేసు చాలా అరుదైనదని, కానీ నిందితుడి వయసు 28 సంవత్సరాలను దృష్టిలో ఉంచుకుని మరణ శిక్ష బదులు, యావజ్జీవకారాగార శిక్ష విధించినట్టు ఆయన తెలిపారు. ఈ శిక్షపై న్యాయవాది మట్లాడుతూ హత్యాయత్నం చేసిందుకు కుమార్‌కు కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించిందని, విషప్రయోగానికి పాల్పడినందుకు 10 ఏళ్లు, సాక్షాలను ధ్వంసం చేసిన కేసులో 7 ఏళ్లు శిక్షను ఖరారు చేసిందన్నారు. అంతేకాకుండా రూ.5.85 లక్షలు జరిమానా కూడా విధించిందన్నారు. గతేడాది మేలో భార్య ఉత్ర నిద్రిస్తున్న సమయంలో పాముకాటుతో సూరజ్ కుమార్ ఆమెను మట్టుబెట్టిన సంగతి తెలిసిందే.