Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Saturday, September 21, 2024
Saturday, September 21, 2024

హసీనా లండన్‌యానం కష్టమే!

రక్షణ పొందిన మొదటి దేశంలోనే ఆశ్రయం: బ్రిటన్‌ హోం శాఖ
తాత్కాలిక ఆతిథ్యానికే భారత్‌ మొగ్గు

ఢాకా: రాజకీయ శరణార్థిగా బ్రిటన్‌ వెళ్లేందుకు బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా ప్రయత్నాలు ఫలించడం లేదన్న సంకేతాలు వెలువడ్డాయి. ముందు రక్షణ పొందిన దేశంలో ఉండటమే మేలు అంటూ బ్రిటన్‌ పరోక్షంగా భారత్‌లో ఆశ్రయం పొందాలని ఆమెకు సూచించింది. భారత్‌ కూడా నేరుగా ఆశ్రయం కల్పిస్తామని ఇప్పటివరకు ప్రకటించలేదు. వేచిచూద్దామనే ధోరణిని అనుసరిస్తోంది. భారత్‌ ప్రస్తుతం దౌత్యపరమైన గందోళ గోళ పరిస్థితుల్లో ఉన్నది. బంగ్లాదేశ్‌ పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని, సరైన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటామని విదేశాంగ మంత్రి జైశంకర్‌ వెల్లడిరచారు. తన భవిష్యత్‌ ప్రణాళికలపై మాట్లాడేందుకు షేక్‌ హసీనాకు భారత్‌ ఇచ్చిందని సమాచారం. అంటే హసీనాకు సహకరిస్తోంది కానీ 1970 తరహాలో శాశ్వత అతిథిగా అంగీకరించబోదన్న సంకేతాలు అందుతున్నాయి. బంగ్లాదేశ్‌ పరిస్థితులు క్షీణించిన సమయం నుంచి ఆమె లండన్‌కు వెళ్తారన్న ఊహాగానాలు ఉన్నాయి. హసీనా సోదరి రెహానా బ్రిటన్‌ పౌరురాలు కాగా ఆమె కుమార్తె తులిప్‌ సిద్దీఖీ లేబర్‌ పార్టీ ఎంపీ కావడంతో బ్రిటన్‌లో ఆశ్రయం పొందాలని బంగ్లాదేశ్‌ ప్రధాని భావించారు. ప్రస్తుతానికి బ్రిటన్‌లో లేబర్‌ పార్టీ అధికారంలో ఉన్నది. అయితే తమ దేశానికి తాత్కాలిక శరణార్థిగా రావాలంటే వలస చట్టాలు ఒప్పుకోవని బ్రిటన్‌ హోంశాఖ అధికారి వెల్లడిర చారు. ఆశ్రయం కోరే వారికి రక్షణ కల్పించేం దుకు గర్వపడే రికార్డు మా సొంతమే అయినా తాతాల్కిక శరణార్థులకు ఆశ్రయం కల్పించలేమని పేర్కొన్నారు. ‘అంతర్జాతీయ రక్షణ అవసరమైన వారు… ముందుగా ఆశ్రయం పొందిన ‘సురక్షిత’ దేశంలోనే ఉండాలి. రక్షణ పొందేందుకు వేగవంతమైన మార్గమదే’నని బ్రిటన్‌ హోంశాఖ అధికార ప్రతినిధి వెల్లడిరచారు. అంటే భారత్‌లో ఆశ్రయం పొందమని షేక్‌ హసీనాకు బ్రిటన్‌ చెప్పకనే చెప్పింది. ఇదిలావుంటే ఆశ్రయం కల్పించాలన్న షేక్‌ హసీనా దరఖాస్తు పరిశీలనలో ఉన్నట్లు కొన్ని వర్గాలు పేర్కొన్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img