Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

22న దేశవ్యాప్త ఆందోళన

కాంగ్రెస్‌ పిలుపు
సెబీ అధినేత్రి రాజీనామా, అదానీపై జేపీసీ విచారణకు డిమాండ్‌

న్యూదిల్లీ: సెబీ చైర్‌పర్సన్‌ మాధవి బచ్‌, ఆమె భర్తకు అదానీ సంస్థలో వాటాలు ఉన్నట్లు హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ విడుదల చేసిన నివేదిక రాజకీయ దుమారం రేపింది. దీంతో సెబీ అధినేత్రి రాజీనామా, అదానీ వ్యవహారంలో సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)తో విచారణ కోసం కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తోంది. ఇదే డిమాండ్‌తో ఈనెల 22న దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. దిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రశాఖాధ్యక్షులతో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే మంగళవారం జరిపిన సమావేశం అనంతరం దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిస్తూ అధికారిక ప్రకటనను కాంగ్రెస్‌ విడుదల చేసింది. సమావేశంలో అసెంబ్లీ ఎన్నికలు, సంస్థాగత వ్యవహారాలు, జాతీయ అంశాలు, ఎన్నికల సన్నద్ధతపై చర్చించారు. అనంతరం ఖడ్గే ‘ఎక్స్‌’లో స్పందిస్తూ ఈనెల 22న దేశవ్యాప్త ఆందోళనలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. హిండెన్‌బర్గ్‌ బయట పెట్టిన సెబీ, అదానీ బంధంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. స్టాక్‌మార్కెట్‌ చిరు పెట్టుబడిదారుల డబ్బుకు రక్షణ ఉండాలన్నారు. మోదీ ప్రభుత్వం తక్షణమే సెబీ చైర్‌పర్సన్‌ను పదవీ బాధ్యతల నుంచి తప్పించాలని, జేపీసీని ఏర్పాటు చేసి అదానీ సంస్థలపై విచారణ జరిపించాలని ఖడ్గే డిమాండ్‌ చేశారు. ‘నిరుద్యోగం, అధిక ధరలు, పొదుపు క్షీణత వంటి సమస్యలపై దృష్టిని కేంద్రీకరించాం. పేద, మధ్య తరగతికి మోసం జరిగింది. మా ప్రచారోద్యమంలో కులగణన డిమాండ్‌ ప్రధానం. రాజ్యాంగంపై బీజేపీ వరుస దాడులనూ తిప్పికొడతాం. రైతులకు ఎంఎస్పీ చట్టం కోసం కాంగ్రెస్‌ పోరాడుతోంది. అగ్నిపథ్‌ పథకాన్ని రద్దుకు డిమాండ్‌ చేస్తోంది’ అని మల్లికార్జున ఖడ్గే వెల్లడిరచారు. దేశంలో రైలు ప్రమాదాలు పెరగడంతో కోట్లాది మంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రకృతి విపత్తులు పెరగడం, మౌలిక వసతులు క్షీణించడం ఆందోళన కలిగిస్తున్నట్లు ఖడ్గే పేర్కొన్నారు. తమ అన్ని డిమాండ్ల సాధన కోసం ఈనెల 22న దేశవ్యాప్త ఆందోళన చేపట్టాలని కాంగ్రెస్‌ నిర్ణయించిందని పార్టీ అధ్యక్షుడు తెలిపారు. సమావేశం అనంతరం పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ విలేకరులతో మాట్లాడుతూ 22వ తేదీన దేశవ్యాప్త ఆందోళన చేపట్టాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించిందని అన్నారు. అదానీ వ్యవహారంలో జేపీసీ విచారణ, సెబీ చీఫ్‌ రాజీనామా డిమాండ్‌తో ఆందోళనబాట పట్టబోతోన్నట్లు తెలిపారు. ఈ ఆందోళనను జయప్రదం చేయాలని కాంగ్రెస్‌ వర్గాలకు సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img