కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరిగింది. ఆందోళన చేస్తున్న వైద్యులను విధులకు హాజరుకావాలని సీజేఐ ఆదేశాలు జారీ చేశారు. డ్యూటీ చేస్తూనే ఆందోళన చేస్తున్నామని వైద్యుల సంఘాలు తెలిపాయి. విధులకు హాజరైనప్పటికీ క్యాజువల్ లీవ్ కట్ చేసి వేధిస్తున్నారని ట్రైనీ డాక్టర్లు సుప్రీంకోర్టుకు వెల్లడించారు. మొదట విధులకు హాజరుకావాలని సీజేఐ సూచించారు. నేషనల్ టాస్క్‌ఫోర్స్‌లో రెసిడెంట్ డాక్టర్లను కూడా చేర్చాలని ట్రైనీ డాక్టర్లు పేర్కొన్నారు. రెసిడెంట్ డాక్టర్ల సమస్యలను ఎన్‌టీఎఫ్ వింటుందని సీజేఐ భరోసా ఇచ్చారు. కమిటీలో భాగస్వాములుగా ఉండడానికి, కమిటీ ఎదుట వాదన చెప్పడానికి తేడా ఉంటుందని న్యాయవాదులు వెల్లడించారు. కోల్‌కతా డాక్టర్ హత్యాచారం కేసులో సుప్రీంకోర్టుకు సీబీఐ సంచలన రిపోర్ట్‌ను వెలువరించింది.