Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 15, 2024
Sunday, September 15, 2024

ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారానికి నిరసనగా.. రేపు 24 గంటలపాటు వైద్య సేవలు నిలిపివేత

పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలోని కోల్‌కతాలో గల ఆర్‌జీ కార్‌ వైద్యశాలలో 31 ఏళ్ల జూనియర్‌ వైద్యురాలి అత్యాచార, హత్య ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. దేశంలోని అన్ని నగరాల్లో వైద్యులు నిరసన తెలుపుతున్నారు. విధులను బహిష్కరించిన బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు.ఇందులో భాగంగా ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారానికి నిరసనగా రేపు దేశవ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ప్రకటించింది. 17వ తేదీ శనివారం ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ ఆదివారం ఉదయం 6 గంటల వరకూ 24 గంటల పాటూ వైద్య సేవలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. అయితే అత్యవసర వైద్య సేవలకు మినహాయింపు ఉంటుందని తెలిపింది. ఈ మేరకు గురువారం అర్ధరాత్రి ప్రకటన విడుదల చేసింది.

స్తంభించిన వైద్య సేవలు..

జూనియర్‌ డాక్టర్‌ హత్యాచారం కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. గత ఏడు రోజుల నుంచి ఆరోగ్య సేవలు స్తంభించగా, తమ సహచర విద్యార్థినికి న్యాయం చేయాలంటూ జూనియర్‌ డాక్టర్లు ఆందోళన కొనసాగిస్తున్నారు. చాలా ప్రభుత్వ దవాఖానలలో ఇప్పటికే ఔట్‌ పేషంట్‌, అత్యవసర సేవలు నిలిచిపోవడంతో సేవలందక రోగులు అల్లాడుతున్నారు. కాగా, దవాఖానను గురువారం సందర్శించిన గవర్నర్‌ బోస్‌ ఆందోళన చేస్తున్న జూనియర్‌ డాక్టర్లతో మాట్లాడారు.

ఆర్‌జీ దవాఖానలో అర్ధరాత్రి దుండగుల విధ్వంసం

మరోవైపు జూనియర్‌ డాక్టర్‌ హత్యాచార ఘటనపై అర్ధరాత్రి పశ్చిమబెంగాల్‌ అట్టుడికింది. స్వాతంత్య్రం వచ్చిన అర్ధరాత్రి మహిళల స్వాతంత్య్రం కోసం్ణ అంటూ నిర్వహించిన ఆందోళన హింసాత్మకంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల మహిళలు అర్ధరాత్రి నిరసన వ్యక్తం చేశారు. నిరసనకారులుగా పేర్కొంటూ సుమారు 40 మంది గుంపు గురువారం అర్ధరాత్రి ఆర్‌జీ కార్‌ హాస్పిటల్‌లోకి చొరబడి విధ్వంసం సృష్టించారు. దవాఖాన ప్రాంగణంలోకి చేరుకున్న ఆందోళనకారులు ఎమర్జెన్సీ విభాగాన్ని, నర్సింగ్‌ స్టేషన్‌, మందుల స్టోర్‌, సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. అక్కడ విధి నిర్వహణలో ఉన్న పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఆందోళనకారులను అదుపుచేయడానికి పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. విధులలో ఉన్న తమకు రక్షణ కల్పించాలంటూ నర్సులు ఆందోళన చేశారు. తాము చేస్తున్న ఆందోళనను నైతికంగా దెబ్బతీయడానికే దవాఖానపై దాడి చేశారని, అయితే న్యాయం కోసం తమ ఆందోళన కొనసాగుతుందని డాక్టర్లు స్పష్టం చేశారు.

రాష్ట్రంలో అశాంతిని సృష్టించడానికే : మమత

రాష్ట్రంలో అశాంతిని సృష్టించడానికి సీపీఐ(ఎం), బీజేపీ ఈ విధ్వంసానికి పాల్పడ్డాయని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. తాను ఈ విషయంలో విద్యార్థులు, ఆందోళన చేస్తున్న డాక్టర్లను తప్పుబట్టడం లేదని అన్నారు. ఆర్‌జీ కార్‌ దవాఖానలో విధ్వంసం సృష్టించింది బయటివారేనని ఆమె అన్నారు. బాధిత మహిళా డాక్టర్‌కు న్యాయం జరగాలంటూ శుక్రవారం తాను వీధుల్లోకి రానున్నట్టు ఆమె ప్రకటించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img