Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

ఏపీ, తెలంగాణలకు సాయం చేసేందుకు ముందుకు వచ్చిన సోనూసూద్

మంచినీరు, ఆహారం, మెడికల్ కిట్స్, తాత్కాలిక షెడ్స్ ఏర్పాటు చేసేందుకు కృషి
తెలుగు రాష్ట్రాలు వరదలతో యుద్ధం చేస్తున్నాయని ఎక్స్ వేదికగా సోనూ సూద్ ట్వీట్


భారీ వర్షాలు, వరదలతో ఉభయ తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. వరదల కారణంగా భారీ ఆర్థిక నష్టం సంభవించింది. ఎంతోమంది వరదల్లో చిక్కుకుపోయారు. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడటం కోసం, వారికి నిత్యావసరాలు అందించేందుకు ప్రముఖులు పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ నటుడు సోనూసూద్ తెలుగు రాష్ట్రాలకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. మంచినీరు, ఆహారం, మెడికల్ కిట్స్ అందివ్వడంతో పాటు తాత్కాలిక షెడ్స్ ఏర్పాటు చేసేందుకు తన బృందం కృషి చేస్తుందన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు వర్షాలు, వరదలతో యుద్ధం చేస్తున్నాయని, ఇలాంటి అవసరమైన సమయంలో వారికి అండగా ఉంటామని సోనూసూద్ పేర్కొన్నారు. ప్రజలు తమ తమ సహాయ అభ్యర్థనలను పంపించేందుకు సోనూసూద్‌కు చెందిన చారిటీ ఫౌండేషన్ ఈ-మెయిల్‌ను ఇచ్చారు. తద్వారా ఆయన సహాయం చేయడంతో పాటు తన చారిటీ ద్వారా వనరులను సమకూర్చే ప్రయత్నం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img