విశాలాంధ్ర బ్యూరో- నెల్లూరు : గ్రామీణ చేతి పంపుల మెకానిక్ వర్కర్ల యూనియన్ జిల్లా జనరల్ బాడీ సమావేశం నెల్లూరులోని ఏఐటియుసి కార్యాలయంలో జరిగింది ఈ సమావేశానికి ఏఐటియుసి జిల్లా కార్యదర్శి శంకర్ కిషోర్ ముఖ్యఅతిథిగా హాజరైనారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేతిపపు మెకానిక్ వర్కర్లకు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి పంపులు రిపేరు చేయటానికి వెళ్లేందుకు అదనముగా వారికి ఒక హెల్పర్ ని ఏర్పాటు చేయాలని అదేవిధంగా వారికి కనీస వేతనం 26 వేల రూపాయలను మంజూరు చేస్తూ ప్రభుత్వం తక్షణం కొన్ని నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు గతంలో వీరి సమస్యలపై పలుసార్లు పోరాటం చేసిన గత ప్రభుత్వం స్పందించలేదని కూటమి ప్రభుత్వం ఏర్పడినది కనుక ఈ ప్రభుత్వమే వీరి సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తూ వీరికి అవసరమైనటువంటి వనరులను కేటాయించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఇటీవల యూనియన్ ని చీల్చేందుకు ప్రయత్నించిన మల్లికార్జున్, రామయ్య లను యూనియన్ నుండి తొలగించుతూ సమావేశం తీర్మానం చేసింది అనంతరం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది గౌరవాధ్యక్షులుగా ఏఐటిసి జిల్లా కార్యదర్శి శంకర్ కిషోర్ అధ్యక్షులుగా దాసరి కృష్ణ ప్రధాన కార్యదర్శిగా రాగి శ్రీనివాసులు కోశాధికారిగా డి హజరత్ బాబు లను ఎన్నుకున్నారు అదేవిధంగా కమిటీ ఇద్దరు ఉపాధ్యక్షులను ఇద్దరు సహాయ కార్యదర్శిలను మరో ముగ్గురు కమిటీని సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. నూతనంగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం తమ సమస్యలను తక్షణం పరిష్కరించాలని లేనిపక్షంలోరాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటితమయూనియన్ పెద్ద ఎత్తున పోరాటం చేసిన కూడా సబ్సిద్ధమవుతుందని వారుఈసందర్భంగాప్రభుత్వానికి విన్నవించారు.