విశాలాంధ్రబ్యూరో నెల్లూరు:నేడు విజయవాడలో జరిగే భూ బాధితుల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని సిపిఐ జిల్లాకార్యదర్శి దామా అంకయ్య పిలుపునిచ్చారు.సిపిఐ కార్యాలయంలోభూ బాధితుల సదస్సు వాల్ పోస్టర్ విడుదల చేశారు.ఈ సందర్భంగా సిపిఐ జిల్లాకార్యదర్శి దామాఅంయ్య మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం హయాంలో అధికారం అడ్డుపెట్టుకొని అనేక మంది ఎమ్మెల్యేలు,మంత్రులు,కార్పొరేటర్లు వివిధస్థాయిలోఉన్నటువంటి వైసిపినాయకులు పేదల భూములనులాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. ఆ విషయాలు బయట పడతాయని చిత్తూరు జిల్లాలో భూములకు సంబంధించిన ఫైళ్ళను కూడా అయితే వేల ఎకరాలు కాజేశారు ఎక్కడ బయటపడుతుంది అని దానికి సంబంధించినఫైళ్లనుతగలబెట్టేశారు అదేవిధంగా అగ్రిగోల్డ్ సంబంధించిన భూములు కూడా కాజేసి ఆ ఫైళ్లను కూడా తగలబెట్టారు ఇలా అనేక భూ అక్రమాలు చేశారు వీటన్నింటి పైన ఎవరైతే భూ బాధితులు ఉన్నారువారునేడువిజయవాడలోనిదాసరిభవన్కు చేరుకొని తమసమస్యలుతెలియజేయాలనికోరారుఅదేవిధంగాకూటమిప్రభుత్వంఈభూబాధితులకు వాళ్లు భూములు ఇప్పించి తగున్యాయంచేయాలనిఅంకయ్యడిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోసిపిఐ నగర సహాయకార్యదర్శి సయ్యద్ సిరాజ్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులుశానవాజ్,వ్యవసాయకార్మికసంఘంజిల్లాకార్యదర్శి నందిపోగురమణయ్య, ఏఐవైఎఫ్ జిల్లా కన్వీనర్ మున్నా,ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి శంకర్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు