విశాలాంధ్ర- వత్సవాయి : సినీ హీరో మహేష్ బాబు జన్మదిన వేడుకలు బోనకల్ శాంతి నిలయం అనాధాశ్రమం లో ఘనంగా నిర్వహించారు.పోలంపల్లి గ్రామానికి చెందిన దారెల్లి క్రాంతి కుమార్ సారధ్యంలో మహేష్ బాబు అభిమానులు శుక్రవారం రాత్రి అన్నదానం చేసారు. ఈ కార్యక్రమం లో మాడుగుల రామారావు, దారెల్లి క్రాంతికుమార్,మాడుగుల వంశీ, వంకాయలపాటి జగదీశ్ మాడుగుల అనిల్, పులిపాటి మహేష్ షేక్ . నాగుల్ మీరా, మాగం శివ, ఆదిమళ్ల నాగేంద్ర బాబు మరియు మాడుగుల సునీల్, మాడుగుల రాము తదితరులు పాల్గొన్నారు.