విశాలాంధ్ర -నందిగామ రూరల్ న్యూస్ :-వరద బాధితుల రైతన్నల స్వల్పకాలిక రుణాలను రీ షెడ్యూల్ చేయాలని ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్య నిర్వహణ కార్యదర్శి యండ్రపల్లి శ్రీనివాసరావు ఓ ప్రకటన ద్వారా తెలిపారు గురువారం ప్రకటన ద్వారా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరదలకు దెబ్బతిన్న వ్యవసాయ పంటలకు బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుమారు 281 కోట్ల రూపాయలు అందించటం రాష్ట్రంలోనే ఓ గొప్ప కార్యక్రమంగా ఆయన పేర్కొన్నారు మొత్తం రాష్ట్రవ్యాప్తంగా వరదలు వర్షాల కారణంగా 1,17 ఎకరాల్లో పంట నష్టం జరగగా 1,87 వేల మంది రైతులు నష్టపోయినట్లు అధికారులు గుర్తించారని ఎన్నడూ లేని విధంగా 15 రోజుల్లో నష్టపరిహారాన్ని రైతన్నలకు నేరుగా అందించిన ఘనత ఒక్క చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు అదేవిధంగా ఇటీవల వర్షాలు వరదల కారణంగా పొలాల్లో పేరుకుపోయిన ఇసుక బురద మేటలను తొలగించుకొనుట కొరకు రైతులకు వెసులుబాటు కల్పించే ప్రక్రియ కల్పించాలని కోరారు స్వల్ప కాలిక రుణాలను రీ షెడ్యూల్ చేసే విధంగా బ్యాంకర్స్ కు ఆదేశాలు అందించి రైతులకు మరింత చేయూత అందించాలని వారు కోరారు నందిగామ జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో మునిగిన పంట పొలాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని),ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టెం రఘురామ్ ఆదేశాల మేరకు జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్(తాతయ్య), నందిగామ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య ఎప్పటికప్పుడు రైతులకు అందుబాటులో ఉంటూ రైతులకు నష్టపరిహారం చెల్లింపు ప్రక్రియ గురించి అధికారులకు పలు ఆదేశాలు ఇస్తూ నియోజకవర్గంలో రైతులకు అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు పంగా సతీష్ తదితరులు పాల్గొన్నారు…