విశాలాంధ్ర -నందిగామ: వరద సృష్టించిన బీభత్వాన్ని రాష్ట్ర ప్రజల చేయూతతో సమర్థవంతంగా ఎదుర్కోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో రాష్ట్రంలోని అన్ని విభాగాల నుండి తమ చేయూత అందిస్తున్న సమయంలో నందిగామ ఎన్ ఎస్ ఆర్ చారిటబుల్ సొసైటీ వారు 5116 రూపాయల చెక్కును ట్రస్ట్ అధ్యక్షులు ప్రకాష్ నందిరాజు, కార్యదర్శి రాజా హనుమంతరావు తో కలిసి స్థానిక శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్యకు మంగళవారం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సహాయం ఏదైనా ప్రతి ఒక్కరూ తమ వంతు వరద బాధితులకు అండగా నిలవాలని కోరారు ఈ కార్యక్రమంలో ట్రెజరర్ కల్పన,ట్రస్టు సభ్యులు లక్ష్మి, మూర్తి,మేఘన,ఏం.సాంబశివరావు, సుబ్రహ్మణ్యం,భాజపా నందిగామ నియోజకవర్గ అధ్యక్షులు తొర్లికొండ సీతారామయ్య,గింజుపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు..