జ్ఞాన పాఠక్
క్రమంగా ద్రవ్య స్పెక్యులేటర్లు ఆర్థిక వ్యవస్థలో కొత్త ఏరియాలను నెమ్మదిగా ఆక్రమించుకుంటున్నారని స్వతంత్ర పరిశోధనాత్మక విలేకరులు, నిపుణులు, ఆందోళన చెందుతున్నారు. మానవ హక్కులు అవసరమైన అణగారిన ప్రజలు, మూల వాసులు, రైతులు, వికలాంగులు సంఘర్షణ ప్రాంతాలలో నివసిస్తున్నారు. వారి మధ్యకు వ్యాపారాన్ని విస్తరించారు. 1980ల నుంచి ఈ ఆర్థిక విస్తరణ నూతన ఆర్థిక సాధనాలు పెరిగేందుకు అవకాశం కల్పించింది. ఈ పరిణామం మహిళల, బాలికల హక్కులను తరతమ భేదాలతో ప్రభావితం చేస్తోంది. అంతిమంగా వీరు ఒక పద్ధతి ప్రకారం వివక్షకు గురవుతున్నారు.
అత్యాశ ఎల్లవేళలా బాధితులను చేస్తుంది. వ్యక్తి లేదా వ్యక్తులు దీని వెంటే కొట్టుకుపోతున్నారు. చాతుర్యం కలిగినవాళ్లు అభివృద్ధి, జాతీయ వాదం, పెట్టుబడుల నూతన వనరులు, ప్రజా సంక్షేమం పేరుతో తమ అత్యాశను మరుగుపరుస్తున్నారు. పెట్టుబడి పెట్టేవారి అత్యాశను తీర్చేం దుకు కొత్త పెట్టుబడుల వనరులను కోరుతూ ప్రపంచ ఆర్థిక పరిశ్రమ కూడా ఇదే పని చేస్తోంది. రక్షిత మంచినీరు, పారిశుధ్యం పేరుతో ప్రకృతిని ధ్వంసం చేయటం, కాలుష్యం పెంచటం హక్కుగా స్థిరపరుచు కుంటున్నారు. 2010లో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో రక్షిత నీరు, పారిశుధ్యం మానవ హక్కులుగా గుర్తించారు. ఇటీవల ఐరాస మానవ హక్కుల మండలి సుస్థిర కాలుష్య రహిత వాతావరణాన్ని పరిశుభ్రతను, ఆరోగ్యాన్ని మానవ హక్కుగా ఆమోదించింది. హెర్జ్, ఇతర పెట్టుబడి నిధుల ద్వారా స్పెక్యులేషన్ ఆర్థిక మార్కెట్ల విస్తరణ మానవ హక్కులకు ముప్పు కలిగిస్తుందని స్వతంత్ర హక్కుల నిపుణుల కమిటీ (17 మంది) తీవ్రంగా హెచ్చరించింది. రక్షిత మంచినీరు, పారిశుధ్యం, ఆహారం తగినన్ని ఇళ్లు, అభివృద్ధి, ఆరోగ్యకరమైన సుస్థిర వాతావరణం లాంటివి మౌలిక మానవ హక్కులనీ కమిటీ స్పష్టం చేసింది.
క్రమంగా ద్రవ్య స్పెక్యులేటర్లు ఆర్థిక వ్యవస్థలో కొత్త ఏరియాలను నెమ్మదిగా ఆక్రమించుకుంటున్నారని స్వతంత్ర పరిశోధనాత్మక విలేకరులు, నిపుణులు, ఆందోళన చెందుతున్నారు. మానవ హక్కులు అవసరమైన అణగారిన ప్రజలు, మూల వాసులు, రైతులు, వికలాంగులు సంఘర్షణ ప్రాంతాలలో నివసిస్తున్నారు. వారి మధ్యకు వ్యాపారాన్ని విస్తరించారు. 1980ల నుంచి ఈ ఆర్థిక విస్తరణ నూతన ఆర్థిక సాధనాలు పెరిగేందుకు అవకాశం కల్పించింది. ఈ పరిణామం మహిళల, బాలికల హక్కులను తరతమ భేదాలతో ప్రభావితం చేస్తోంది. అంతిమంగా వీరు ఒక పద్ధతి ప్రకారం వివక్షకు గురవుతున్నారు. పెద్ద వయసు వాళ్ల పైన కూడా ప్రతికూల ప్రభావం ఉంటున్నది. అందువల్ల ఆర్థిక సేవల పరిశ్రమను తగిన విధంగా క్రమబద్దం చేయాలని నిపుణుల కమిటీ కోరుతున్నది. వ్యవసాయ మార్కెట్‌ను నాశనం చేయడం ద్వారా ఆహార హక్కును కోత వేశారు. 2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం తలెత్తడానికి అంతర్జాతీయ బ్యాంకులే కారణమన్న అంశం ఆహార హక్కును కూడా దెబ్బతీసిందనేది వాస్తవం. గోధుమ, ధాన్యం, సోయాబీన్ తదితరాల ధరలు పెరగడానికి ఆహార అంచనాల మార్కెట్‌లో అనేక బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టడం కారణం. వీటి ధరలు కొన్ని నెలల పాటు రెట్టింపు, మూడు రెట్లు పెరిగాయి. ధరల అంచనాల బుడగను సృష్టించి కోట్లాది మంది ప్రజలను పేదరికంలోకి నెట్టి ఆకలికి గురి చేసింది.
20 వ శతాబ్ది చివరి నాటికి ప్రపంచ ఆర్థిక మార్కెట్ల క్రమబద్దీకరణ మృగ్యమై వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్లు ప్రారంభమయ్యాయి. ప్రత్యేకించి అమెరికాలో వస్తువుల ఫ్యూచర్స్ (అంచనాల) ఆధునికీకరణ చట్టం2000 ఆమోదించిన తర్వాత బ్యాంకులు, సంస్థాగత పెట్టుబడిదారులు ఆహార ఫ్యూచర్స్ మార్కెట్లలో ప్రవేశించారు. తమ పెట్టుబడులను విభిన్న ప్రాంతా లకు విస్తరించేందుకు ఇదొక మంచి సాధనమని గుర్తించారు. ఫలితంగా 13 నుంచి 15 కోట్ల మంది తీవ్ర పేదరికంలోకి జారుకున్నారని, ప్రత్యే కించి ఆహార దిగుమతులపై ఆధారపడే, తక్కువ ఆదాయం ఉన్న దేశాలలో ప్రజలు ఈ పరిస్థితిని ఎదుర్కొన్నారు. దీంతో ఆగలేదు. ఆహార, గృహ నిర్మాణాలకు ఆర్థిక వనరులను అందించటం లాంటివి సంపద పెంచు కునేందుకు మార్గాలయ్యాయి. ఇటీవల కాలంలో గృహ నిర్మాణాలలో, ప్రపంచ మార్కెట్లలో వాణిజ్యం చేసే ఆర్థిక సాధనాల భద్రతకు భారీగా పెట్టుబడులు పెట్టారు. 2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం సందర్భంగా కోట్లాది మంది రాత్రికి రాత్రే తమ గృహాల విలువను కోల్పోయారు. దక్షిణ ప్రాంత దేశాలలోని అనేక నగరాలలో విలాస వంతమైన గృహాలను పడగొట్టి షాపింగ్ మాల్స్ నిర్మాణానికి ఇంకా సంపన్న గ్రూపులకు ఉద్దేశించి అత్యాధునిక సేవలు అందించడానికి ఆర్థిక పెట్టుబడులను అందించారు. ఇదొక ఆర్థిక అభివృద్ధికి లాభానికి మార్గంగా ఎంచుకు న్నారు. కొవిడ్
19 మహమ్మారి విజృంభించిన కాలంలో సంపదలను ఆర్థిక వనరులు పెంచుకునేందుకు ఎక్కువగా వినియోగించారు. ఆహారం, గృహ నిర్మాణాల రంగంలో ఆర్థిక పెట్టుబడులు అసమానతలను పెంచా యి. తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం కలిగింది. పేదరికంలో ఉన్నవారి మానవ హక్కులను ఈ పరిణామాలు ఉల్లంఘించాయి. అంతేకాదు ప్రకృతి, పర్యావరణ వ్యవస్థను సైతం ఒక ఆస్తిగా, వస్తువులుగా పరిగణించి దోపిడీకి తెర తీశారు. ఇటీవల దశా బ్దాలలో సుస్థిర వాతావరణ వ్యవస్థలకు కర్బనపు వాయువులను కూడా వస్తువులుగా పరిగణించి వ్యాపారం చేస్తున్నారు. ప్రపంచమంతటా కాలుష్యం కలిగించి రక్షిత నీటిని, భద్రమైన ఆహారం కూడా లభించకుండా ఆర్థిక పెట్టుబడులను పెడుతున్నారు. ఇటీవల వాల్‌స్ట్రీట్ ఫ్యూచర్స్ మార్కెట్లలో వాణిజ్యం చేసేందుకు నీటి ఫ్యూచర్స్ మార్కెట్‌ను సృష్టిస్తు న్నారు. వాతావరణ మార్పుల వల్ల నీటి కొరత ఏర్పడుతుందని అంచనాలు వేసి ముందుగానే ధరలను నిర్థాంచటానికి పూనుకున్నారు.