Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

ఉపఎన్నికలకు ఎస్‌పీ కసరత్తు

ప్రదీప్‌ కపూర్‌

లోక్‌సభ ఎన్నికల విజయోత్సాహంలో ఉన్న సమాజ్‌వాదీపార్టీ యూపీలో 10 అసెంబ్లీ స్థానాలకు జరిగే ఉపఎన్నికల్లో మరో విజయదుందుబి మోగించాలన్న ఉత్సాహంతో పనిచేస్తున్నార. ఎన్నికల తేదీ ప్రకటించనప్పటికీ సమాజ్‌వాదీ పార్టీ నేతలు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు 2027లో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయనేది స్పష్టం. ఈ ఎన్నికల్లో పొత్తుతో పోటీ చేస్తామని రాహుల్‌, అఖిలేష్‌ యాదవ్‌ ఇప్పటికే బహిరంగ ప్రకటన చేశారు. మరోపక్క సీట్ల పంపకం విషయంలో సమాజ్‌వాదీ పార్టీ నాయకులు కాంగ్రెస్‌ అధిష్టానంతో చర్చలు జరుపుతున్నారు. ఉప ఎన్నికలు జరగనున్న 10 స్థానాల్లో కూటమి భాగస్వామ్య పక్షాలు బీజేపీని ఎదుర్కోవాల్సిన అభ్యర్థులతోపాటు సీట్ల విషయంలో అధిష్టానంతో చర్చలు జరుపుతున్నారు. స్థానిక సమస్యలు ఎక్కువగా ఉండటంతో సమాజ్‌వాదీ పార్టీ 10 నియోజకవర్గాల్లోని అభ్యర్థుల నియామకంపై ఆచితూచి వ్యవహరిస్తోంది. ప్రతిష్టాత్మకమైన అయోధ్యలో ఓటమి చవిచూడడంతో బీజేపీ ఈ ఉప ఎన్నికల్లో ప్రతీకారాన్ని తీర్చుకునేందుకు వ్యూహం పన్నుతోంది. సీఎం యోగి ఆదిత్యనాథ్‌, బీజేపీ నాయకత్వం మొత్తం 10 స్థానాల్లో విజయం సాధించేందుకు మల్లగుల్లాలుపడుతున్నాయి. బీజేపీ తరఫు బరిలో నిలిచే అభ్యర్థులకు ఓటర్ల మద్దతు కూడగట్టేందుకు డజనుకు పైగా మంత్రులు, సీనియర్‌ నేతలను బీజేపీ రంగంలోకి దించనుంది.
దళితులు, మైనారిటీలు, అల్పసంఖ్యాక వర్గాలకు టిక్కెట్ల పంపిణీ ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు తోడ్పడుతుందని సమాజ్‌వాదీ పార్టీ విశ్వసిస్తోంది. అఖిలేష్‌ యాదవ్‌ కూడా బీజేపీిలో వర్గపోరును ఆసరాగా చేసుకుని ఈ ఎన్నికల్లో విజయం సాధనదిశగా పావులు కదుపుతున్నారు. మరోపక్క ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ నాయకత్వం, డిప్యూటీ సిఎం కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య నేతృత్వంలోని రెండు శిబిరాల్లో కుమ్ములాటలు ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అగ్రవర్ణాలైన ఠాకూర్‌ సామాజికవర్గం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో సన్నిహితంగా మెలుగుతుండగా మరోపక్క దళితులు, మైనారిటీలు కేశవ్‌ ప్రసాద్‌ మౌర్యకు మద్దతు ప్రకటించడం గ్రూపుతగాదాలను బహిర్గతపరచాయి. అయితే జూన్‌లో ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అధ్యక్షతన జరిగే సమావేశాలను కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య ఉద్దేశపూర్వకంగా బహిష్కరించారనేది తెలిసిందే. అయితే కూటమి భాగస్వాములైన బీఎన్‌పీ నాయకుడు నిషాద్‌ పార్టీ సుహెల్‌దేవ్‌ మౌర్యను కలుసుకుని బహిరంగంగా తమ మద్దతును తెలియజేశారు. దళితులు, ముస్లింల మద్దతుకోసం చూస్తున్న సమాజ్‌వాదీ పార్టీకి బీజేపీలోని అంతర్గత తగాదాలు, కుమ్ములాటల విభజన తోడ్పడనున్నాయి. టికెట్ల పంపిణీ విషయంలో సమాజ్‌వాదీ పార్టీ ఏడుసార్లు ఎమ్మెల్యే, అసెంబ్లీ మాజీ స్పీకర్‌ మాతా ప్రసాద్‌ పాండేను ప్రతిపక్ష నాయకుడిగా నియమించడం ద్వారా బ్రాహ్మణ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. మాతా ప్రసాద్‌ పాండే గత అనుభవాల్ని ఈ ఎన్నికల్లో సమాజ్‌వాదిపార్టీ తనకు పూర్తి అనుకూలంగా మార్చుకోనుంది. ప్రతిపక్ష నాయకుడిగా పాండే నియామకం ముఖ్యంగా బ్రాహ్మణ ఓటర్లను ప్రబలంగా ప్రభావితం చేయనుంది.
సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే క్రిమినల్‌ కేసులో దోషిగా నిరూపణ కావడం, 9మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు లోక్‌సభకు ఎన్నిక కావడంతో ఉప ఎన్నికల పర్వానికి దారితీసింది. ఈ 10 అసెంబ్లీ సీట్లలో ఐదు సమాజ్‌వాదీ పార్టీ, మూడు బీజేపీి, ఆర్‌ఎల్‌డి, నిషాద్‌ పార్టీ ఒక్కొక్కటి గెలిచాము. బీజేపీ, కూటమి భాగస్వామ్య పక్షాలు గెలిచే ఐదు స్థానాల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్‌ అత్యంత ఆసక్తిగా ఉంది. అఖిలేష్‌ యాదవ్‌, రాహుల్‌ గాంధీ మధ్య జరిగే చర్చలు ఈ సీట్ల కేటాయింపు ఆధారపడి ఉంటుంది. అయితే ఎన్నికల తేదీలు ప్రకటించనప్పటికీ, ఇండియా కూటమి` బీజేపీ మధ్య మొత్తం 10 స్థానాల్లో తీవ్ర పోటీ నెలకొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img