Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Saturday, September 21, 2024
Saturday, September 21, 2024

ఎగిసిన అస్తిత్వ ప్రతీక…!!!

యస్‌… నేను మరణిస్తాను… నా వారసత్వం ఎక్కడి నుంచో వస్తుంది. కొన్నాళ్ళకు అది కూడా అమరత్వం పొందుతుంది. మళ్లీ మళ్లీ మా పోరాటాలకు, ఉద్యమాలకు మా వారసత్వం వస్తుంది. బహుశా ఇదీ అమరత్వం పొందవచ్చు. కొత్త రూపంలో కొత్తతరం మళ్ళీ ఈ ఉద్యమాలలోకి వస్తుంది.
ఈ కొత్త తరం ఆనాటి మా కలలనే కాదు ఈనాటి తమ భూమిని, ప్రజలను కూడా కాపాడుకుంటుంది. తప్పక విజయం సాధిస్తుంది’’ ఇలా అన్నది తూర్పు లిబియా పోరాట ఉద్యమ నాయకులు ఉమర్‌ ముక్తార్‌. లిబియాపై ఇటలీ చేస్తున్న వలసవాద దాష్టీకాలకు వ్యతిరేకంగా తూర్పు లిబియా నుంచి ఉద్యమం నడిపిన వాడు. 73 ఏళ్ల వయసులో ఎడారిలో సింహంలా ఉద్యమాన్ని ఉరకలు, పరుగులు పెట్టించిన నాయకుడు. ఈ చరిత్రని ఉమర్‌ ముక్తార్‌ పేరుతో సినిమాగా తీశారు. 1931లో ఇటలీ సైన్యం ఆ మహావీరుడ్ని అరెస్టు చేసింది. తమకు అనుకూలంగా మారమని, తాము ఇచ్చే కానుకలు పొందమని ఇటలీ జనరల్‌ ఒత్తిడి చేశాడు.
ఇటాలియన్‌ కాన్సంట్రేషన్‌ క్యాంపులో తన వారందరి ముందు ఉమర్‌ ముక్తార్‌ను బహిరంగంగా ఉరితీశారు. ఆ ఉరి అనంతరం నేలమీద పడిపోయిన ఉమర్‌ ముక్తార్‌ చేతిలోని కళ్ళజోడుని ఓ ఆరేళ్ల పిల్లాడు తీసి కళ్ళకు అమర్చు కుంటాడు. ఆ కుర్రాడి తల్లి తీవ్ర దుఃఖంతో ఆ కుర్రాడ్ని ఎత్తుకుని అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ప్రపంచంలో ఏ ఉద్యమమైనా ప్రారంభమూ, దాని కొనసాగింపు, దాని వారసత్వం కూడా ఇలాగే ఉంటుంది. ఇది జరగడానికి ఎంతకాలం పడుతుందో ఎవరూ చెప్పలేరు. అలాంటి ఉద్యమాలు, పోరాటాలు నీతి నిజాయితీతో కూడుకున్నవైతే ఆ ప్రజల నుంచే కాదు సంఫీుభావం తెలిపే సమాజాల నుంచి కూడా ఆదరణ లభిస్తుంది.
ఏ దేశ స్వాతంత్రమైన, ప్రాంతీయ అస్తిత్వ పోరాటాలైనా, ఏ జాతైనా తమకు అన్యాయం జరుగుతోందంటూ త్యాగాలకు వెరవకుండా ఉద్యమాలుచేస్తే ఎప్పుడూ మంచి ఫలితాలే వస్తాయి. దీనికి అనేక ఉద్యమ ఉదాహరణలు ఉన్నాయి. అలాగే కొన్ని దశాబ్దాల తరబడి అడ్డంకులు ఉంటాయి. అవి రాజకీయంగా, స్థానికంగా, వర్గాలుగా, ముఠాలుగా మోకాలు అడ్డుపెడుతున్నవి కావచ్చు. వీటిని దాటడానికి న్యాయస్థానాల గడపలు దాటాల్సి రావచ్చు. దీనికి ఎంతకాలం పడుతుందో సరిగ్గా చెప్పలేం. అసలు ఆ మాటకొస్తే ఆ ఉద్యమాలను తలకెత్తుకున్నవారు ఆ ఉద్యమ విజయాలను తనివితీరా చూసి ఉండలేకపోవచ్చు. ప్రత్యేక తెలంగాణ రావాలని ఎన్నో కలలు కన్నారు కాళోజి. అలాగే ఆయన తర్వాత ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌. ఈ ఇద్దరు మహాను భావులు తెలంగాణ కల తీరకుండానే తనువు చాలించారు. వారిద్దరి వారసుడిగా తెలంగాణ కాగడాన్ని తన భుజానికి ఎత్తుకున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. తన కళ్ళారా చూసుకుంటున్నారు.
ఇక్కడ రాజకీయాలు పదవుల గురించి కాదు నేను మాట్లాడేది కేవలం తెలంగాణ గురించి మాత్రమే. ఇదంతా చరిత్ర. వర్తమానానికి వస్తే మాదిగ దండోరా మూడున్నర దశాబ్దలక్రితం చేపట్టిన మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి(ఎంఆర్పీఎస్‌) పోరాటానికి భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నుంచి ఓ గొప్ప విజయం కానుకగా లభించింది. రిజర్వేషన్‌ వర్గీకరణ విషయంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య సంవత్సరాల తరబడి తాత్సారం జరిగింది. ఈ వర్గీకరణ సహేతుకం కాదంటూ దళితవర్గాల నుంచే ఉద్యమము నడిచింది. చివరికి వర్గీ కరణవైపే సుప్రీంకోర్టు అనుకూల తీర్పు ఇవ్వడం ఎమ్మార్పీఎస్‌ ఇన్నేళ్ల ఉద్యమా నికి కలిగిన గొప్ప ఊరట. సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన క్షణంలోనే రెండు తెలుగు రాష్ట్రాలు వర్గీకరణ అమలు చేసేందుకు అడుగులు వేస్తున్నాయి. వీటిని అడ్డుకునేందుకు వైరిపక్షాలు కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తారు కదా
‘‘ ఒక వ్యక్తిని మరొక్క వ్యక్తి
ఒక జాతిని వేరొక జాతి
పీడిరచే సాంఘిక ధర్మం
ఇంకానా….ఇకపై సాగదు
అని మహాకవి శ్రీశ్రీ ఆగ్రహ, ఆవేశ ప్రకటనే కాదు జాన్తానై అని గద్దించాడు. ప్రపంచవ్యాప్తంగా జాతుల మధ్య వైరం పెరగడం నేటి ప్రపంచ ప్రజల దురదృష్టం. దానిని మించి మన ముందే ఒకే జాతిలో వైరుధ్యం పెరగడం అత్యంత విషాదం. ఈ రెంటి మధ్య ఉన్న వైషమ్యాలను తొలగించేందుకు సామరస్యపూర్వక వాతావరణాన్ని నింపేందుకు ఏ రాజకీయ పార్టీ ముందుకు రాకపోవడం మరింత విషాదం.
ఇక మూడున్నర దశాబ్దాలుగా మందకృష్ణ మాదిగ చేస్తున్న పోరాటం నిజంగా ఓ అద్భుతం. ఓ ప్రాంతంలో తాను మైనారిటీ. మరో ప్రాంతంలో మెజార్టీ. ఈ సమయంలోనే తాను నేర్చుకున్న రహస్య రాజకీయాలతో నెగ్గుకొచ్చారు. ఎక్కడ ఎన్ని లాబీయింగ్‌లు చేశాడో. తన మూడున్నర దశాబ్దాల పోరాటానికి సుప్రీంకోర్టు నుంచి గౌరవప్రదమైన విజయాన్ని పొందగలిగాడు. ఎమ్మార్పీఎస్‌ ఉద్యమం తీవ్రదశలో ఉండగా రంగారెడ్డి జిల్లా తాండూరులో ఆ ఉద్యమ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించాడు మందకృష్ణ మాదిగ. అప్పటికే నాకు మంచి స్నేహితుడు కావడం,
జర్నలిస్టు వృత్తిలో భాగంగా కొన్నాళ్లు ఇతర రాజకీయ వార్తలు, రాజకీయేతర బీట్లకు విరామంఇచ్చి ఎమ్మార్పీఎస్‌ బీటు వార్తలే రాస్తున్నాను. అదిగో ఆ సమయంలో, తాండూరులో సమావేశం ముగిసాక, రాత్రి 8 గంటలకి నాకు ఫోన్‌ చేశాడు కృష్ణ మాదిగ. ‘‘చక్రి ఎక్కడున్నావ్‌. మా కార్యకర్తకి కారు ఇచ్చి పంపుతున్నాను. తాండూర్‌ రాగలవా. కొద్దిగా మాట్లాడాలి’’ అన్నాడు మిత్రుడు మందకృష్ణ. ఆనాటి పత్రిక ఎడిటర్‌ అనుమతి తీసుకుని కారులో తాండూర్‌ వెళ్లాను. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున మూడు గంటల వరకు మా ఇద్దరికీ మధ్య అనేక అనేకానేక వాదాలు, విమర్శలు, మాటలు. ఓ పెద్ద ఇంటర్వ్యూ. మధ్యలో ఆఫ్‌ ది రికార్డ్‌ కబుర్లు. నేను బయలుదేరే ముందు ‘‘ అన్నా… ఈ వర్గీకరణ ఉద్యమం విజయం కావడానికి ఇంకా ఎన్నాళ్లు పడుతుంది’’ అని అడిగా. అప్పుడు…. ఆ సమయాన… అచ్చంగా… ఆ తెల్లవారుజామున….నేను ముందుగా రాసిన లిబియా ఉద్యమ నాయకుడు ఉమర్‌ ముక్తార్‌ అన్న మాటలే అన్నాడు. ఇంచుమించు అలాంటి మాటలే అన్నాడు. విజయం మనం చూడలేకపోయినా మన వారసులు ఉంటారుగా అన్నాడు.
ఆ ఉమర్‌ ముక్తారో…
మహానుభావుడు కాళోజీయో..
తెలంగాణను కలగన్న ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ లానో … కాకుండా…తన మూడు దశాబ్దాల పోరాట విజయాన్ని తానే అందుకున్నాడు. తన వారసులకు వర్గీకరణ విజయాన్ని కానుకగా ఇస్తున్నాడు. అతడే… నా మిత్రుడు మందకృష్ణ మాదిగ.

సీనియర్‌ జర్నలిస్టు, 9912019929

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img