Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

ఏపీకి మెడ మీద కత్తిలా ట్రిబ్యునల్‌?

వి. శంకరయ్య

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య కృష్ణానదీ జలాల పంపిణీ గురించి 1956 అంతర్‌ రాష్ట్ర జల వివాదాల చట్టం కింద విచారణ సాగిస్తున్న బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ ఆంధ్రప్రదేశ్‌ రైతాంగం మెడ మీద కత్తిలా వేలాడుతోంది. ఇందుకు ప్రథమ ముద్దాయి జగన్‌మోహన్‌ రెడ్డి. రెండవ ముద్దాయి కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా అంతర్గత నదీ జలాల వినియోగంపై తీవ్ర కసరత్తు సాగుతున్నదే గాని అసలుకే మోసం తెచ్చే అంతర్‌ రాష్ట్ర జల వివాదాలపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు.
కృష్ణానది జలాల పంపిణీలో ట్రిబ్యునళ్ల ఏర్పాటు చాల చిత్రమైనది. బచావత్‌ ట్రిబ్యునల్‌ గడువు ముగిసిన తర్వాత 2004లో బ్రిజేశ్‌ కుమార్‌ అధ్యక్షతన రెండవ ట్రిబ్యునల్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ 2010లో మధ్యంతర తీర్పు వెలువరించింది. అయితే ఈ తీర్పు న్యాయ బద్దంగా లేదని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపు తట్టింది. మధ్యంతర తీర్పు కాబట్టి తన వాదనను ట్రిబ్యునల్‌కు నివేదించమని సుప్రీంకోర్టు ఆదేశించింది. బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ 2013లో తుది తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు మధ్యంతర తీర్పునకు ఏమాత్రం భిన్నంగా లేదు. తిరిగి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సుప్రీంకోర్టుకెళ్లితే తీర్పు నోటిఫై కాకుండా స్టే మంజూరు చేసింది. అప్పటి నుంచి పదేళ్లకు పైగా ఈ కేసు పరిష్కారం కాలేదు. ఫలితంగా న్యాయపరంగా కృష్ణాబేసిన్‌లో బచావత్‌ ట్రిబ్యునల్‌ అమలులో వుంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను 2014లో విభజించారు. రాష్ట్ర విభజన చట్టంలో సాగునీటి ప్రాజెక్టులు నీటి పంపిణీ గురించి స్పష్టంగా నిబంధనలు పొందుపర్చారు. సెక్షన్‌ 85 సబ్‌ సెక్షన్‌ 8 (ఎ) (1)లో ఈపాటికే 1956 అంతర్‌ రాష్ట్ర జల వివాదాల చట్టం కింద నియమించిన ట్రిబ్యునల్‌ చేసిన కేటాయింపులు అమలు జరగాలని పొందుపర్చారు. సెక్షన్‌ 89లో ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు జరగకుండా మిగులు నీరు వుంటే ( బచావత్‌ ట్రిబ్యునల్‌ చేసి వుంది) రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయాలని ఒక వేళ నీటి ఎద్దడి వుంటే ప్రొటొకోల్‌ నిర్ణయించేందుకు కృష్ణాట్రిబ్యునల్‌ గడువు పొడిగించి బాధ్యత అప్పగించాలని స్పష్టంగా వుంది. ఈ సెక్షన్‌ మేరకు బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ గడువు పెంచి ఈ బాధ్యతను కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ విచారణ మొదలు పెట్టింది. ట్రిబ్యునల్‌ ముందు తెలంగాణ 18 అంశాలను, ఆంధ్రప్రదేశ్‌ 13 అంశాలను విచారణకు అఫిడవిట్‌లు దాఖలు చేశాయి. తెలంగాణ అఫిడవిట్‌లోని అంశాలు పరిశీలిస్తే మన్ముందు రానున్న తీవ్ర ప్రమాదం పసిగట్ట గలం. కెేసీ కెనాల్‌ సాగర్‌ కుడి కాలువ తుంగభద్ర ఎగువ కాలువ ఆయకట్టు బేసిన్‌ ఆవల వుందని అక్కడ పంటల విధానం మార్పు చేసి మిగులు నీరు తమకు కేటాయించాలని కోరింది. అంతేకాదు ఒక ఆయకట్టుకు రెండు మార్గాల నుంచి నీళ్లు వస్తే ఒక వైపు నుంచి వచ్చే నీటి వాటా తగ్గించి తమకు కేటాయించాలని కూడా కోరింది. కృష్ణాడెల్టా ఉదాహరణగా చూపింది. మరో వైపు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెేసీిఆర్‌ సెక్షన్‌ 89 కింద విచారణ అసమగ్రంగా వుందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు బచావత్‌ ట్రిబ్యునల్‌ కేటాయించిన మొత్తం నీళ్లు తిరిగి పంపిణీ చేయాలనీ అందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త ట్రిబ్యునల్‌ నియామకం జరగాలని సుప్రీంకోర్టుకెక్కారు. ఈ నేపథ్యంలో 2020లో జరిగిన రెండవ అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో 1956 అంతర్‌ రాష్ట్ర జల వివాదాల చట్టం కింద కొత్త ట్రిబ్యునల్‌ నియమించాలని కేసీఆర్‌ డిమాండ్‌ చేశారు. కేంద్ర జల వనరుల శాఖ అప్పటి మంత్రి షెకావత్‌ సుప్రీంకోర్టులో వున్న కేసు వెనక్కి తీసుకొంటే కొత్త ట్రిబ్యునల్‌ నియమిస్తామని ప్రకటించారు. ఆ సమావేశంలో వున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి మూగ నోము పట్టారు. కెేసీఆర్‌కు వ్యతిరేకంగా డిసెంట్‌ (అసమ్మతి)నోట్‌ పెట్టలేదు. ఈ దెబ్బతో మొత్తం ఆంధ్రప్రదేశ్‌ సాగునీటి వ్యవస్థను ఐసీయూలోనికి జగన్‌మోహన్‌రెడ్డి నెట్టారు. వాస్తవంలో రెండు రాష్ట్రాల మధ్య ఏ తగాదా పరిష్కారం కావాలన్నా రాష్ట్ర విభజన చట్టం కరదీపికగా వుంది. పైగా విభజన చట్టం మేరకు ఒక ట్రిబ్యునల్‌ పనిచేస్తోంది. దాని ముందు తెలంగాణ తమ వాదన వినిపిస్తోంది. కొన్నాళ్ల పాటు కేసీఆర్‌ సెక్షన్‌ 89 అసమగ్రంగా వుందని పార్లమెంటులో సవరించాలని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరి వున్నారు. జగన్‌మోహన్‌ రెడ్డి మౌనంతో కొత్త ట్రిబ్యునల్‌ నియామకానికి ఆమోదముద్ర పడిరది. అయితే ఇల్లు అలకగానే పండుగ కాదని కేసీిఆర్‌తో వున్న తగాదా ఫలితంగా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనను కోల్డ్‌స్టోరేజ్‌లో పడేసింది. కెేసీఆర్‌ అడిగినపుడల్లా ఫైల్‌ న్యాయ శాఖ వద్ద వుందని చెబుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సరిగ్గా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోనికి వచ్చేసినట్లు భ్రమించి అందుకు అండగా అప్పటి వరకు కోల్డ్‌ స్టోరేజ్‌లో ఉన్న ఫైల్‌ బయటికి తీసి కొత్త ట్రిబ్యునల్‌ నియామకానికి ఆదేశాలు ఇచ్చింది. ఈ దెబ్బతో అప్పటి వరకు ఐసీయూలో వున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలను కేంద్రంలోని బీజేపీి ప్రభుత్వం వెంటిలేటర్‌ పైకి నెట్టింది. ఏ పని చేయాలన్నా రాజకీయ ప్రయోజనం లేనిదే చేయదని మోదీ ప్రభుత్వం మరొక మారు రుజువు చేసింది.
విషాదమేమంటే ఆంధ్ర ప్రదేశ్‌ ప్రయోజనాలకు విఘాతం కలిగేందుకు తనే కారణమైన పూర్వ రంగంలో జగన్‌మోహన్‌ రెడ్డి సర్కారు ట్రిబ్యునల్‌ నియామకం సరికాదని సుప్రీంకోర్టు కెక్కింది గాని ఈ కేసు విచారణకు తీసుకు వచ్చే కృషి మాత్రం చేయ లేదు. ఇప్పటికీ ఈ కేసు సుప్రీంకోర్టులో వుంది. కొసమెరుపు ఏమంటే పుంగనూరు అల్లర్ల సందర్భంగా తెలుగు దేశంనేతలపై మోపిన కేసులో హైకోర్టు వారికి బెయిల్‌ ఇస్తే సుప్రీంకోర్టులో అప్పీలు చేసి కేసు విచారణకు వచ్చేవిధంగా జగన్‌ ప్రభుత్వం కృషి చేసింది గాని రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు చెందిన కేసుపై శ్రద్ధ కనపర్చలేదు.
ప్రస్తుతం రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వం ఏర్పడిరది. జగన్‌ లాగా కాకుండా సాగునీటి రంగంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సమగ్ర అవగాహన వుంది. తను అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత పోలవరం మొదలు కొని సాగునీటి రంగంపై సమీక్ష సమావేశాలు నిర్వహించారు. కానీ, మొత్తం రాష్ట్రం మెడ మీద కత్తిలా వేలాడుతున్న ట్రిబ్యునల్‌ గురించి గానీ, జగన్‌ సర్కారు సుప్రీంకోర్టులో వేసిన కేసు గురించి సమీక్ష జరప లేదు. గతంలోలాగా కాకుండా బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ కూడా విచారణను వేగవంతం చేస్తోంది. ఆగస్టు ఆఖరు వారంలో జరగనున్న విచారణ సందర్భంగా సమర్థవంతమైన వాదనతో ఏపీ అధికారులు వెళ్లవలసి ఉంది. తెలంగాణ మాత్రం స్టేట్‌ మెంట్‌ ఆఫ్‌ కేస్‌ సమగ్రంగా వేసింది. కాని ఆంధ్రప్రదేశ్‌ వైపు న్యాయపరమైన చర్యలు ఆశాజనకంగా లేవు. గత ఆరేడేళ్లుగా తెలంగాణ తరపున లాయర్‌ వైద్యనాథన్‌ సమర్థవంతంగా ట్రిబ్యునల్‌ మొదలుకొని సుప్రీంకోర్టులో అంతర్‌ రాష్ట్ర జల వివాదాల కేసులు వాదిస్తున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికారులు కూడా ఈ అంశం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు రాలేదు. రాష్ట్రం మొత్తం ప్రయోజనాలు ఇమిడి వున్న ట్రిబ్యునల్‌ ప్రస్తావన ప్రభుత్వం వైపు నుంచి సమాచారం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ట్రిబ్యునల్‌ నియామకంపై సుప్రీంకోర్టులో వున్న కేసుతో పాటు ట్రిబ్యునల్‌లో విచారణ సమర్థవంతంగా నిర్వహించ వలసి ఉంది. న్యాయపరంగా ఆంధ్రప్రదేశ్‌ వైపు బలమైన అంశాలున్నాయి. ముందుగా ట్రిబ్యునల్‌ నియామకాన్ని సుప్రీంకోర్టులో సవాల్‌ చేయాలి. తెలంగాణకు ఏదైనా అన్యాయం జరిగి ఉంటే బేసిన్‌ మొత్తం మీద నీటి పంపిణీ జరిగినప్పుడు తప్ప మరో విధంగా పరిష్కారం కాదు. రెండు రాష్ట్రాల మధ్య ఏ సమస్య పరిష్కారం కావాలన్నా రాష్ట్ర విభజన చట్టం మేరకే జరగాలి. రాష్ట్ర విభజన చట్టం మేరకు ట్రిబ్యునల్‌ విచారణ సాగిస్తున్న దశలో దాన్ని పక్కన బెట్టి 1956 అంతర్‌ రాష్ట్ర జల వివాదాల చట్టం కింద కొత్తగా మరొక ట్రిబ్యునల్‌ నియామకం సరికాదని న్యాయ పరంగా పోరాడ వలసి వుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వున్న ఈ ప్రభుత్వం ఏమాత్రం అలసత్వం వహిస్తే తుదకు కృష్ణ డెల్టా కేటాయింపులకు కూడా ఎసరు పెట్టే అవకాశం లేకపోలేదు.
విశ్రాంత పాత్రికేయులు, 984839401

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img