Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Wednesday, September 18, 2024
Wednesday, September 18, 2024

కుల నిర్మూలనవాది, నవ బౌద్ధుడు ప్రొ.లక్ష్మీనరసు

డాక్టర్‌ దేవరాజు మహారాజు

ఆధునిక నవ బౌద్ధుడిగా, విజ్ఞానవేత్తగా, విశేష జ్ఞాన సంపన్నుడిగా, తిరుగులేని కుల నిర్మూలనవాదిగా, సంఘ సంస్కరణోద్యమకారుడిగా పోకల లక్ష్మీనరసు (18611934) అందించిన సేవలు చిరస్మరణీయమైనవి. దక్షిణ భారత బౌద్ధ సంఘాలకి జీవితకాలం ఆయనే అధ్యక్షుడు. ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు సింగారవేల్‌ చెట్టియార్‌తో కలిసి ‘మహాబోధి సొసయిటీ’ స్థాపించిన బౌద్ధ ప్రచారకులు. నిబద్ధతతో కృషి చేసే ప్రతి కుల నిర్మూలనవాది, సామాజిక కార్యకర్త. ప్రొ.పోకల లక్ష్మీనరసు రచనలు తప్పకుండా అధ్యయనం చేయాలి. సమతా వ్యవస్థ కోసం తపించిన అద్వితీయ ప్రతిభాశాలి, మన తెలుగువాడు కావడం మనందరికీ గర్వకారణం! తమిళ కవి సుబ్రహ్మణ్య భారతికి ఈయన ఒక నాస్తిక మిత్రుడు. జాతీయోద్యమ నాయకుడైన డా.భోగరాజు పట్టాభి సీతారామయ్యకు ఆప్త మిత్రుడు. ఆధ్యాత్మిక రారాజుగా వెలుగొందిన స్వామి వివేకానందను ముఖాముఖి ఎదుర్కొన్న తెలుగువాడు మన ఈ పోకల లక్ష్మీనరసు! 1960 లోనే తయన తొలి వర్ణాంతర విందు ఏర్పాటు చేశారంటే, దేశంలో మానవవాద దృక్పథం వేళ్లూనుకోవడానికి, మనువాదాన్ని మట్టి కరిపించడానికి ఆయన గట్టి ప్రయత్నమే చేశారని తెలుస్తుంది. ఈయన జీవిత విశేషాలు పరిశోధించి రవిచంద్‌ 2004 లో ‘‘ఆంధ్ర బౌద్ధ భాష్యకారుడు ప్రొఫెసర్‌ పి.లక్ష్మీనరసు’’ అనే వివరణాత్మకమైన రచన ప్రకటించారు. కుల వ్యవస్థలోని కష్టనష్టాలను గుర్తించిన తొలితరం మహనీయులలో ప్రొ.పి.లక్ష్మీనరసు ఒకరు. ఈయన రచన ది ఎసెన్స్‌ ఆఫ్‌ బుద్ధిజమ్‌ కి డా.బి.ఆర్‌.అంబేద్కర్‌ ముందుమాట రాశారు. వీరి ఇతర ముఖ్యమైన రచనలు 1. వాట్‌ ఈజ్‌ బుద్ధిజమ్‌, 2. ఎ స్టడీ ఆఫ్‌ కాస్ట్‌, 3. రెలిజియన్‌ ఆఫ్‌ ది మోడ్రన్‌ బుద్ధిస్ట్‌ వగైరా. ఇవి అందరూ చదవవల్సిన పుస్తకాలు. కొన్ని నెట్‌లో కూడా దొరకొచ్చు. శరీరాన్ని మించిన క్షేత్రం లేదు. మనసును మించిన తీర్థం లేదు. జీవితాన్ని మించిన గ్రంథం లేదు. అంతరాత్మను మించిన గురువు లేడు. అనుభవాన్ని మించిన పాఠం లేదు బుద్ధుడు.
ఇంగ్లీషులో వెలువడ్డ ప్రొఫెసర్‌ పి.ఎల్‌.నరసు రచనలన్నీ దిల్లీలోని సమ్యక్‌ ప్రకాశన్‌ వారి దగ్గర ఉన్నాయి. ది ఎసెన్స్‌ ఆఫ్‌ బుద్ధిజమ్‌ను తైవాన్‌ బౌద్ధ సంఘం లక్షల ప్రతులు ప్రచురించి, ప్రపంచవ్యాప్తంగా దేశ దేశాల జ్ఞాన పిపాసులకు ఉచితంగా అందించింది. దీన్ని చంద్రశేఖర్‌ ‘బౌద్ధ ధమ్మ సారం’ పేరుతో తెలుగు చేశారు. ఇక ప్రొ.నరసు రచన ఎ స్టడీ ఆఫ్‌ కాస్ట్‌ అంబేద్కర్‌ రచన కులనిర్మూలన పై ప్రభావం చూపిందని అంటారు. అలాగే రెలిజియన్‌ ఆఫ్‌ కాస్ట్‌ పై ప్రభావం చూపిందని అంటారు. అయితే రెలిజియన్‌ ఆఫ్‌ మోడ్రన్‌ బుద్ధిస్ట్‌ ఇంత వరకు తెలుగులోకి రాలేదు. ఎవరైనా ఆ పనికి పూనుకుంటే బావుంటుంది. మరో రచన వాట్‌ ఈజ్‌ బుద్ధిజమ్‌ను జెకొస్లావేకియా తొలి రాష్ట్రపతి, థామస్‌ మాసరిక్‌ జెక్‌ భాషలోకి అనువదించారు. తర్వాత అది జర్మన్‌ భాషలోకి కూడా అనువాదమయ్యింది. అదే గ్రంథాన్ని ఏటుకూరి బలరామమూర్తి తెలుగు చేశారు. దానికి కళాతాత్త్వికులు సంజీవదేవ్‌ ముందు మాట రాశారు. అది మిళింద ప్రచురణగా బయటకు వచ్చింది.
‘ద ఎస్సెన్స్‌ ఆఫ్‌ బుద్ధిజం’ కు డా.బి.ఆర్‌.అంబేద్కర్‌ రాసిన ముందు మాటతో మనకు ప్రొపెసర్‌ లక్ష్మీనరసుకు సంబంధించిన అనేక విషయాలు అవగతమౌతాయి. నిజానికి వీరిద్దరూ కలుసుకోలేదు. కానీ, వీరిద్దరికీ అత్యంత సన్నిహితుడైన డా.భో.పట్టాభి సీతారామయ్య మూలంగా అంబేద్కర్‌, ప్రొ.నరసు వ్యక్తిగత విషయాలు, జీవిత విశేషాలు తెలుసుకోగలిగారు. ది ఎసెన్స్‌ ఆఫ్‌ బుద్ధిజమ్‌ అనే ఇంగ్లీషు పుస్తకం మొదట 1907లో అచ్చయ్యింది. అప్పటికి అంబేద్కర్‌ సుమారు పదహారేళ్లవాడు. ఈ విషయం ఎందుకంటే, వాళ్లిద్దరి మధ్య వయసు వ్యత్యాసం తెలుసుకోవడానికి! ఫ్రొ.నరసు ఆ పుస్తకం ప్రకటించే నాటికి సుమారు నలభై ఆరేళ్లవాడు. ఇక ఆ పుస్తకం రెండో ముద్రణ 1912లో వెలువడిరది. ఆ తర్వాత చాలాకాలం వరకు (అవుట్‌ ఆఫ్‌ ప్రింట్‌) అది ప్రజలకు అందుబాటులో లేకుండా పోయింది. ఆ పుస్తకం చదివి, అనందించి అలాంటి పుస్తకం పాఠకులకు అందుబాటులో ఉండడం చాలా అవసరమని డా.అంబేద్కర్‌ స్వయంగా పూనుకున్నారు. బొంబాయిలో 1948 లో థక్కర్‌ ప్రెస్‌లో మూడవ ముద్రణ అచ్చువేయించారు. కుల నిర్మూలనకు కట్టుబడి అహోరాత్రులు పనిచేసిన కార్యకర్తగా, నవ బౌద్ధుడిగా తను మారడమే కాకుండా, బౌద్ధ కార్యకర్తగా దక్షిణ భారతదేశంలో విశేషంగా కృషిచేసిన వాడిగా ప్రొ.లక్ష్మీనరసు అంబేద్కర్‌కు బాగా నచ్చారు. అందుకే ముందుమాట రాసి, మూడవ ముద్రణ వేయించే బాధ్యత తనకు తానై స్వీకరించారు. అప్పటికి అంబేద్కర్‌ వయసు యాభైఏడు! ప్రొ.లక్ష్మీనరసు కన్నుమూసి పద్నాలుగేళ్లు!!
ప్రొఫెసర్‌ లక్ష్మీనరసు మొదట మద్రాస్‌ క్రిస్టియన్‌ కాలేజీలో ట్యూటర్‌డెమాన్‌స్ట్రేటర్‌గా కొంతకాలం పనిచేశారు. ఆ తర్వాత 1897 లో భౌతికశాస్త్ర విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందారు. 189899 లలో అప్పటి హెడ్‌ మఫెట్‌ అనే బ్రిటీష్‌ ప్రొఫెసర్‌ సెలవుపై వెళ్లగా ఆ బాధ్యతలు నరసు నిర్వహించారు. భౌతిక, రసాయనిక డిగ్రీ క్లాసులన్నీ ఈయన ఆధ్వర్యంలోనే నడిచేవి. ఈయన మేథో సంపత్తి ఎంతటిదంటేఅకడమిక్‌గా అన్ని సమస్యలకకు పరిష్కారాలు చూపుతూ, అన్ని విషయాలకు వివరణలు ఇస్తూ ఆనాటి బ్రిటీష్‌ ప్రొఫెసర్ల అహంకారాన్ని అణిచి వేస్తుండేవారు. దేశం బ్రిటీష్‌ పాలనలో ఉన్న రోజులు గనక, తాము పాలకులమని, ఇక్కడి భారతీయులు పాలితులనీ ఓ చిన్నచూపు ఉండేది. తాము బ్రిటన్‌లో ఉన్నత చదువులు చదివి వచ్చినవారమనిఇక్కడి వారికి తమకు ఉన్నంత తెలివి, విజ్ఞత ఉండవని ఒక అభిప్రాయం ఉండేది. కానీ, ప్రొ.లక్ష్మీనరసు తన అద్వితీయమైన మేథో సంపత్తితో వారి అహాన్ని అణిచివేస్తుండేవారు. ఆ రోజుల్లో బ్రిటీష్‌ ప్రొఫెసర్‌ విల్సన్‌ డైనమిక్స్‌లో పెద్ద ఉద్దండుడని ఒక అభిప్రాయం ఉండేది. ఒకసారి ప్రొఫెసర్‌ లక్ష్మీనరసు ఆయనకే కొన్ని విషయాలు వివరించాల్సి వచ్చింది. విపులంగా వివరించి, చివరగా ఓ మాట అన్నారు ‘‘ప్రొఫెసర్‌ విల్సన్‌కు డైనమిక్స్‌ చెప్పగలిగినందుకు నాకెంతో ఆనందంగా ఉంది’’అని! భారతీయుడిగా ఆయన తన ఆత్మవిశ్వాసం ప్రదర్శించారు. తన దేశ ఔన్నత్యం చాటి చెప్పుకోవడంలో ఎక్కడా ఏ మాత్రం తగ్గలేదు. ఆయన కాలంలో పాలిస్తున్న బ్రిటీష్‌ పాలకుల్ని, అంతకు ముందు పాలించిన మొఘలుల్ని, ఇంకాముందు పాలించిన దిల్లీ సుల్తనేట్‌ను అందరినీ వదిలేసి భారతదేశ చరిత్రలో ఇంకా వెనక్కి వెళ్లి, అశోక చక్రవర్తితో ప్రభావితుడయ్యారు. ఈ దేశ మూల సంస్కృతిలో భాగమయిన చార్వాక, లోకాయిత, జైన, బౌద్ధ జీవన విధానాల గూర్చి లోతుగా అధ్యయనం చేశారు. చివరకు బుద్ధుని మార్గాన్ని ఎంచుకుని నవ బౌద్ధుడిగా మారారు. ‘ఈ విశ్వంలో ప్రతిదీ కార్యకారణ సంబంధంతో జరుగుతూ ఉందన్న’` బుద్ధుడి మాట వైజ్ఞానిక మేధావి అయిన ప్రొ.నరసుకు ఎందుకు నచ్చదూ? నచ్చింది! అందుకే బుద్ధుడి బాటలో నడుస్తూ, ఆయన బోధనల వెలుగుల్ని ప్రపంచానికి పంచారు.
ప్రతిభావంతులైన విద్యావేత్తగా రాణించడం వల్ల మద్రాసులోనే పచియప్పన్‌ కళాశాలకు ప్రిన్సిపాల్‌ కాగలిగారు. బయటి ప్రపంచంతోనూ దగ్గరి సంబంధాలు ఉంచుకోవడం వల్ల ‘‘నేషనల్‌ ఫండ్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ అసోసియేషన్‌’’ అనే సంస్థ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేవారు. ఈ అసోసియేషన్‌ ధనికుల నుంచి అధిక మొత్తంలో విరాళాలు సేకరించి, ఆ డబ్బుతో ఉత్సాహవంతులైన యువకుల్ని జపాన్‌కు పంపుతూ ఉండేది. వారు అక్కడ సాంకేతిక పరిజ్ఞానం పెంచుకుని వచ్చిన తర్వాత వారిని ఈ దేశ పారిశ్రామిక అభివృద్ధిలో భాగస్వాముల్ని చేసేవారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రొ.లక్ష్మీనరసు పర్యవేక్షణలో జరుగుతూ ఉండేవి. ఈయన అనుభవాన్ని, ప్రజ్ఞను ఆ అసోసియేషన్‌ పూర్తిగా వాడుకునేది. ఒకవైపు విద్యావేత్తగా, విద్యాసంస్థ పరిపాలనాదక్షుడిగా తన రోజువారీ కార్యక్రమాలు నిర్వహించుకుంటూనే, మరోవైపు సమాజంలో కుల నిర్మూలన, బాల్య వివాహాలను అడ్డుకోవడం, విధవా పునర్వివాహాలు జరిపించడం వంటి వాటిపై దృష్టి పెట్టేవారు. హేతువాద దృక్పథంతో జీవితాన్ని తీర్చిదిద్దుకోవడం వంటి విషయాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఉండేవారు.
సుప్రసిద్ధ సాహితీవేత్త, విశ్రాంత బయాలజీ ప్రొఫెసర్‌

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img