Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

జీవించే హక్కు

చింతపట్ల సుదర్శన్‌

అదో వీధికుక్క. బక్కచిక్కి పోయి ఉంది. డొక్క ఎగరేస్తూ నిలబడిరది. పాపం ఎన్నాళ్లయిందో తిండి తిని అనుకుంది దూరంగా చెట్టుకింద నిలబడున్న డాగీ. ఆ దారంట ఓ బైకు రయ్యిమంటూ దూసుకు వచ్చింది. మూలుగుతూ ఓ పక్క నిలబడ్డ వీధికుక్క, లేచి నిలబడిరది. ఒంట్లో శక్తినంతా కాళ్లల్లోకి తెచ్చుకుని ఆ బైకు వెంట అరుస్తూ పరుగెత్తింది. బైకువాడు స్పీడు పెంచి తప్పించుకుపోయాడు. అరుస్తూ వెనక్కు వచ్చిన వీధికుక్క, అటుగా వస్తున్న మరో బైకు వెంట అరుస్తూ పరుగెత్తింది.
ఏమైంది దీనికి వచ్చిన ప్రతి బైకు వెనకా పరుగెత్తుతున్నది అనుకుంటూ ఆ సంగతే అడిగింది. ఏమైంది ఎక్కడా తిండి దొరక్కపోతే వచ్చీపోయే మనుషుల పిక్కలు కొరికి తిందామనుకుంటున్నావా? అదేంలేదు భాయి సాబ్‌. నిన్న ఓ బైకు నాకొడుకు నా చిన్నారి కూన మీదినించి దూసుకుపోయేడు. అప్పట్నించి ఏ బైకును చూసినా నా చిట్టితల్లే గుర్తుకు వస్తున్నది. అందుకే బైకు కనబడితే చాలు పూనకం వస్తున్నది. ఇక తిండి అంటావా అడక్కు. ఈ లోకంలో మనుషులకు తప్ప తిండి తినే హక్కు ఎవరికీ లేదేమోననిపిస్తున్నది అంది వీధి కుక్క.
ఆ మాట నిజమేననుకో. ఈ భూ ప్రపపంచకమంతా తమ తాతగారి జాగీరనుకుంటున్నారు. ఇన్నాళ్లూ ఎంతో విశ్వాసంగా ఉన్నామన్న విశ్వాసం కొంచెం కూడా లేదు వాళ్లకి. ఎవరి బైకో నీ బిడ్డను చంపితే, మిగతా వారిని కరవాలనుకోవడం, బైక్‌ల వెంట పరుగెత్తడం ఏ మాత్రం సబబైన విషయం కాదు, ఆలోచించు. నేరం ఒకరిదయితే శిక్ష మరొకళ్లకు వెయ్యద్దు. రా…నా వెంబడి, ఈ దారంట పోతే ఓ హోటల్‌ వెనక చెత్తకుండీ ఉంటుంది. అక్కడ నాకూ నీకూ ఏదైనా తిండానికి దొరకవచ్చు అంటూ డాగీ ఆ వీధి కుక్కను ఓదారుస్తూ తన వెంట నడిపించింది.
అరుగు ఎక్కుతున్న రెండు కుక్కల్ని చూసింది డాగీ. ఈ ‘అతిథి ఎవరోయ్‌’ అంది డాగీతో. కొత్త ఫ్రెండులే తన బిడ్డని ఓ బైకు తొక్కే సిందన్న బాధలో ఉంటే ఊరడిరచి కాస్సేపు మరిచిపోతుందని తీసుకు వచ్చా. మనుషుల వెంట తోక ఊపుతూ తిరిగామిన్నాళ్లూ. కానీ రోడ్ల మీద కుక్కచావు చచ్చినకుక్కల్ని ఎవడైనా పట్టించుకున్నాడా? చట్టసభల్లో కుక్కల్లా కాట్లాడుకుంటారు కాని వందల ఏళ్లనించి మనిషికి ఊడిగం చేస్తున్న మనల్ని ఇప్పుడులేకుండా చేస్తామంటున్నారు అంది డాగీ.
చెరువులు తాగేస్తున్నారు. చెట్లు మింగేస్తున్నారు, కొండల్ని నమిలేస్తున్నారు. ఈ భూమ్మీద వాళ్లు తప్ప మరొకరు లేకుండా చేస్తున్నారు అంది డాంకీ. ‘జీవించు, జీవించనీయి’ అన్న మాట వాళ్లకు వర్తించదు. ఎంతసేపూ తామే జీవించాలనుకుంటారు అంటూ మొండిగోడ మీదికి వచ్చి నిలబడిరది పిల్లి. దాన్ని చూడగానే రెండు కుక్కలూ యుగళగీతం అందుకోబోయినయి. ఇంతకు ముందే చెప్పా, పిల్లికీ కుక్కకూ శతృత్వం వట్టి కల్పితమని కుక్కా, పిల్లీ, గాడిదా ఇలా అన్నింటికీ జీవించే అవకాశం లేకుండా చేస్తున్నారు మనుషులు. ఆ సంగతి ఆలోచించండి అంది డాంకీ.
అవును డాంకీ! నన్ను చూడు ఒకప్పుడు లావుగా బొద్దుగా, ముద్దుగా ఉండేదాన్ని. ఇప్పుడు ఎముకాతోలూ మిగిలాయి. ఏ ఇంట్లోనూ తిండి దొరకడంలేదు. పాలూ, పెరుగూ, నిన్న వండిరదీ, మొన్న వండిరది అన్నీ ఫ్రిజ్జుల్లో పెట్టి దాచుకుంటున్నారు. ఉట్టీలేదు, చట్టీలేదు. వెజ్జూ, డెయిరీ కరవైతే అయింది నాన్‌వెజ్జుందిగా అనుకుంటే, ఎలుకలెక్కడా కనిపించవు. అనేక అంతస్తుల ఇళ్లల్లోకి, ఎలుకలు ఎక్కడానికి ప్రత్యేక లిఫ్టులు లేవు కదా. ఇక మామూలు ఇళ్లల్లో ఇది వరకులాగ అటకలు లేవు. సామానంతా కప్‌బోర్డుల్లోనేనాయె. ఎలుక అనే జీవాన్ని చూసి ఎన్నాళ్లయిందో అంది పిల్లి. పిల్లులూ, బల్లులూ, ఎలుకలేకాదు ఆఖరుకు పిచ్చుకలక్కూడా జాగాలేదు, తిండీనీరూ లేదు. అంతా కట్ట కట్టుకు చావ్వలసిందే. కనుమరుగవ్వాల్సిందే అంటూ అరుగు ఎక్కాడు అబ్బాయి.
నువ్వు చెప్పు బ్రో మేమంతా ఉండాలా? చావాలా? వీధి కుక్కలు లక్షలైనవని, జనాన్ని కరుస్తున్నవని అన్నింటినీ చంపేయాలనీ అంటున్నారు మనుషులు. ఇంకా మా జాతి అంతరించినట్టేనా? చెత్తకుండీల్లో పసిపాపల్ని పారేసి పోయే మనుషులు కుక్కల్ని క్రూరమైనవనీ, సింహాల్లా కరుస్తున్నాయని అంటున్నారు. ఇలాగే అందరినీ నరికేసుకుంటూపోతే, పులులూ, సింహాలూ కూడా ఊళ్లల్లోకి రావంటావా? తిండి కోసం, నీడకోసం, ఆఖరుకు గుక్కెడు నీళ్ల కోసం అల్లాడిపోయే కుక్కలు కొన్ని మతితప్పి దిక్కతోచక కరుస్తున్న మాట నిజమే, కాని ఎన్నెన్నో మందులూ మాకులూ కనిపెట్టారే మనుషులు మా బాధలకు ఉపశమనం కనిపెట్టలేరా అంది డాగీ.
మీలో కొందరి ప్రవర్తనకు కారణం కనిపెట్టాలి. మీ జనాభాను నియంత్రించాలి. తాము కరోనాకు ‘టీకా’ తీసుకున్నట్టే మీకూ ఏదో ఓ మందు వెయ్యాలి. మనిషి కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడే మీ జాతిని లేకుండా చేయాలనుకోవడం మాత్రం కరెక్టు కాదు అన్నాడు అబ్బాయి.
రెండు కాళ్లున్న మనుషులే కాదు, నాలుగు కాళ్లూ,తోకా ఉన్న జీవులందరికీ జీవించే హక్కు ఉన్నది అంది డాంకీ.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img