బుడ్డిగ జమిందార్
ప్రస్తుతం ఆసియా ` పసిఫిక్ ప్రాంతంలో చైనాను రెచ్చగొట్టటానికి తైవాన్ జలసంధి వేదికగా మారింది. తరచూ అమెరికా మిత్రదేశాలు ఇక్కడ నావికా విన్యాసాలు చేస్తుంటుంటాయి. చైనా మెయిన్ భూభాగంలో 180కిలో మీటర్లు వెడల్పు గల జలసంధి వేరు చేస్తుంది. దక్షిణ చైనా సముద్రాన్ని తూర్పుచైనా సముద్రంతో తైవాన్ జలసంధి కలుపుతుంది. మొత్తం 55వేల చదరపు కిలోమీటర్లు వైశాల్యం కలిగిన ఈ సముద్ర ప్రాంతంలో రానున్న కాలంలో యుద్ధం జరిగే ప్రమాదముంది. క్రితం వారం ఈ ప్రాంతంలోనే అమెరికాకు చెందిన జలాంతర్గామితో ఒకటి తెలియని పెద్ద పరికరాన్ని గుద్ది కొద్దిలో ఘోర ప్రమాదం నుండి తప్పుకొంది. జలాంతర్గామి నిండా అణ్వస్త్రాలు ఉన్నాయి. చైనా తీవ్ర స్వరంతో అమెరికా వైఖరిని హెచ్చరించింది.
ప్రపంచ దృష్టి ఆసియా పసిఫిక్ ప్రాంతంపై మళ్లింది. ప్రచ్ఛన్న యుద్ధం ప్రారంభమైంది. చైనా అమెరికాల మధ్య సంబంధాలలో తైవాన్ జలసంధి రానున్నకాలంలో తీవ్ర పరిణామాలకు దారితీసే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ ప్రాంతంలో అత్యాధునిక అణ్వాయుధాల మొహరించే అవ కాశాలు మెండుగా ఉన్నాయి. గత నాలుగు దశాబ్ధాల చైనాతైవాన్ సంబంధాల్లో అత్యంత ఘర్షణల స్థాయికి చేరుకున్నాయి. ఈ ఉద్రికత్తలకు అక్టోబరు 10నాడు జరిగిన 110 సంవత్సరాల క్సిన్‌హాయ్ విప్లవవార్షికోత్సవం వేదికగా మారింది. 1911లో ఊచాంగ్‌లో ప్రారంభమైన క్సిన్‌హాయ్ విప్లవం అంతిమంగా క్వింగ్ రాచరికం సమాప్తికి దారితీసింది. కమ్యూనిస్టులకు జాతీయవాదులకు మధ్య జరిగిన అంతర్యుద్ధ పోరాటంలో 1949లో మావో జెడాంగ్ నాయకత్వంలో ‘పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా’ ఏర్పడిరది. రిపబ్లిక్ ఆఫ్ చైనా (ఆర్‌ఓసీ) నేత షియాంగ్ కైషేక్స్ తైవాన్‌కు పారిపోయాడు. అమెరికా నౌకలు దగ్గరుండి షియాంగ్‌ను తైవాన్ దీవికి తరలించాయి. ఆర్‌ఓసి రాజధానిగా తైపెల్‌ను ప్రకటించి మాదే అసలైనా చైనా అంటూ మెయిన్‌ల్యాండ్ (ప్రస్తుత మొత్తం చైనా) నుండి వీడిపోయి తైవాన్ దీవికి మాత్రం పరిమితమైనాడు. అమెరికా మిత్రదేశాలు షియాంగ్ కైషేక్స్ తైవాన్‌ను మాత్రమే చైనాగా 1971 వరకూ గుర్తించాయి. 1979 నుండి చైనాను అమెరికా గుర్తించింది. అమెరికా అధ్యక్షుడు రిచర్డ్‌నిక్సన్ చైనా సందర్శించి మావోను కలుసుకుని సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా అభిప్రాయాన్ని సేకరించటంలో సఫలీ కృతుడై నాడని రాజకీయ విశ్లేషకులు అంటుంటారు. అందుకు ప్రతిఫలంగా ఒకే చైనా సిద్ధాంతానికి అమెరికా మద్దతు పల్కిందని, తైవాన్‌తో సంబంధాలను అమెరికా తగ్గించిందని, 1978 నుండి చైనాలో మార్కెటింగ్ విధానాల్లో సాయపడిరదని విశ్లేషకులు అభిప్రాయం, 1972లో ఉమ్మడి షాంఘై ప్రకటనక దారితీసిన పరిణామాలతో అమెరికా చైనాల మధ్య పూర్తిస్థాయి దౌత్య సంబంధాలకు ఏకాభిప్రాయం కుదిరింది. తైవాన్ చైనాలో (మైయిన్ ల్యాండ్) అంతర్భాగంగా చైనా వాదిస్తుండగా తైవాన్ స్వతంత్య్రం కావాలంటుంది. ఐతే ఒకే చైనా సిద్ధాంతానికి రానురాను అమెరికా తూట్లు పొడవటం ప్రారంభించింది. 2016లో చైనా వ్యతిరేక పార్టీ డిజీపీ అధికారంలోకి వచ్చింది. ట్రంప్ హయాంలో అనేకమంది అమెరికా అధికారులు తైవాన్‌లో పర్యటించారు. ఇది చైనా
అమెరికాల ఇరుదేశాల ఒకే చైనా అంగీకారానికి విరుద్ధం. మొదటి నుండి కమ్యూనిస్టు చైనాను బలహీన పర్చటానికి తైవాన్‌ను ఎప్పుడు అమెరికాడుకుంటూనే ఉంటుంది. 195053 మధ్య జరిగిన కొరియా యుద్ధంలో అమెరికా సేనలు తైవాన్‌లో తిష్టవేసాయి. తైవాన్‌ను విమానాశ్రయంగా అమెరికా వాడుకొంది. తైవాన్ దేశాన్ని ‘‘సముద్రంలో మునగని అమెరికా విమానాశ్రయంగా’’ అమెరికన్లు ఇప్పటికీ వర్ణిస్తూంటారు. ప్రస్తుతం ఆసియా
పసిఫిక్ ప్రాంతంలో చైనాను రెచ్చగొట్టటానికి తైవాన్ జలసంధి వేదికగా మారింది. తరచూ అమెరికా మిత్రదేశాలు ఇక్కడ నావికా విన్యాసాలు చేస్తుంటుంటాయి. చైనా మెయిన్ భూభాగంలో 180కిలో మీటర్లు వెడల్పు గల జలసంధి వేరు చేస్తుంది. దక్షిణ చైనా సముద్రాన్ని తూర్పుచైనా సముద్రంతో తైవాన్ జలసంధి కలుపుతుంది. మొత్తం 55వేల చదరపు కిలోమీటర్లు వైశాల్యం కలిగిన ఈ సముద్ర ప్రాంతంలో రానున్న కాలంలో యుద్ధం జరిగే ప్రమాదముంది. క్రితం వారం ఈ ప్రాంతంలోనే అమెరికాకు చెందిన జలాంతర్గామితో ఒకటి తెలియని పెద్ద పరికరాన్ని గుద్ది కొద్దిలో ఘోర ప్రమాదం నుండి తప్పుకొంది. జలాంతర్గామి నిండా అణ్వస్త్రాలు ఉన్నాయి. చైనా తీవ్ర స్వరంతో అమెరికా వైఖరిని హెచ్చరించింది.
క్సిన్‌హాయ్ విప్లవాన్ని పురస్కరించుకొని చైనా అధ్యక్షుడు కిన్‌జిన్‌సింగ్ మాట్లాడుతూ తైవాన్ చైనాతోకలవటం చారిత్రాత్మక అవసరమని శాంతి యుతంగా కలవటానికి చైనా ప్రయత్నిస్తుందని, ఒకవేళ కాదని తైవాన్ స్వతంత్రం ప్రకటించుకోవాలంటే అవసరమైతే బలప్రయోగంతోనైనా సరే తైవాన్‌ను ఒకప్పటి చైనాలో భాగంగా కలుపుకోవల్సివస్తుందని హెచ్చరించారు. ఇది చైనా ప్రజలు సర్వసాధారణ సంకల్పమని క్సీ అన్నారు. తైవాన్ జలసంధికి ఇరువైపులా ఉన్న స్వదేశీయులందరం పునరేకీకరణకు పాటుపడాలని, అసలైన చరిత్ర వారసులుగా వ్యవహరించాలనీ తద్వారా పునరుజ్జీవనాన్ని సాధించటానికి చేతులు కలపాలని క్సీజిన్‌పింగ్ అన్నారు. ఇటీవల కాలంలో చైనాకు చెందిన యుద్ధవిమానాలు తైవాన్ జలసంధిలోఅనేకసార్లు చక్కర్లు కొట్టాయి. అక్టోబరు 1న 38 విమానాలు, అక్టోబరు 2న, 39, అక్టోబరు 4నాడు 56 యుద్ధ విమానాలు గస్తీతిరిగాయి. యుద్ధ వాతావరణం ఇప్పటికే ఈ ప్రాంతంలో అలుముకొని ఉంది. క్సీ జిన్‌పింగ్ ప్రసంగ పాఠానికి భిన్నంగా తైవాన్ అధ్యక్షులు తైవాన్ మాట్లాడుతూ తైవాన్ ప్రజలు చైనా ఒత్తిడికి తలొగ్గరు, అటువంటి భ్రమలు చైనా పెట్టుకోకూడదు, మన జాతీయభద్రతను తైవాన్ మరింత బలోపేతంచేస్తుంది, మనల్ని మనం కాపాడు కొనే సమయం ఆసన్నమైంది అని అన్నారు. చైనా ఆలోచనల ప్రకారం తైవాన్ ప్రజలు నడుస్తారనే ఆలోచనలు మా దేశ ప్రజలకు లేవని జాతీయ దినోత్సవం సందర్భంగా ఆమె అన్నారు. తమ జాతీయ దినోత్సవంలో జరిగిన కవాతులో భాగంగా అరుదైన ఆయుధాలను తైవాన్ ప్రదర్శించటం ద్వారా చైనాకు సైనిక హెచ్చరిక చేసినట్లయింది. బహురకాల ట్యాంకులు, యుద్ధ ట్రక్కుల పై క్షిపణులను ఉంచి ప్రదర్శన చేశారు. అనేక ఫైటర్ జెట్స్ గగనంలో తిరిగాయి. తైవాన్ చైనాలో విలీనం చేయబడుతుందని ప్రచారం జరుగుతుందనీ, ఐతే తైవాన్ స్వంత్ర ఆర్థిక వ్యవస్థను విధానాలను కలిగి ఉంటుందని ప్రచారం చేస్తుందని, ఒకజాతి
రెండు వ్యవస్థల విధానం చైనా విస్తృతంగా ప్రచారం చేస్తుందని కానీ ఇది తైవాన్ 2.3 కోట్ల ప్రజల ప్రజాస్వామ్య జీవన విధానానికి సార్వభౌమధికారానికి తగదని తైవాన్ అధ్యక్షురాలు తైని అన్నారు.
ఆసియా పసిఫిక్‌లో ఉద్రిక్తతలను పెంచటానికి తైవాన్ ఒక్కప్రక్క వేరొక వైపు హాంగ్‌కాంగ్‌లు నుంచి చైనా వ్యతిరేక ఆయుధాలును అమెరికాకు దొరికాయి. వాస్తవానికి తైవాన్, హాంకాంగ్‌లు చైనా అంతర్భాగాలే. భారతదేశంలో కశ్మీర్ సమస్యవంటివే తైవాన్, హాంకాంగ్ సమస్యలు. వీటిలో విదేశీ జోక్యం అనవసరం. సమస్యలను చైనా హాంకాంగ్
తైవాన్‌లే పరిష్కరించుకోవాలి. కానీ అమెరికా సామాజ్య్రవాదం అలాపరిష్కారంకానివ్వక, సమస్యను జఠిలం చేయాలను కొంటుంది.
వ్యాస రచయిత అసోసియేట్ ప్రొఫెసర్, కె ఎల్ యూనివర్శిటీ
సెల్ : 9849491969