కుటుంబంలో పనిచేసే వారి సంఖ్య కూడా పెరుగుతున్నది. వీరికి ప్రత్యేకించి మహిళలకు ఎలాంటి వేతనాలు ఉండవు. నాలుగేళ్లుగా ఇంటిపనుల్లోనూ, వ్యవసాయ పనులోన్లూ పాల్గ్గొనే మహిళల సంఖ్య పెరుగుతున్నది. వ్యవసాయేతర రంగాలలో ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారి సంఖ్య పెరిగింది. అతి తక్కువ పోస్టులలో నియామకాలకు సంబంధించి ఉన్నతస్థాయి చదువులు చదివిన వారితోపాటు లక్షలమంది నిరుద్యోగులు దరఖాస్తులు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో దాదాపు 30లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ భర్తీ చేయడంలేదు.
దేశంలో నిరుద్యోగం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఉన్నత చదువులు చదివిన యువతకు ఉపాధి కరువైంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో పరిమిత అవకాశాలే ఉన్నాయి. ఈ కారణంగా వేలాదిమంది యువత నిరాశాజనక పరిస్థితిలో ఉన్నారు. పెద్దగా చదువు లేని వారు ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధి హామీ పథకంతో పొట్ట పోసుకుంటున్నారు. గత రెండేళ్లుగా దేశంలో నిరుద్యోగం రేటు ఏమాత్రం తగ్గలేదు. అయితే నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ విషయాన్ని అంగీకరించదు. దఫదఫాలుగా జరిగే కార్మికుల సర్వే నిరుద్యోగ సమస్యపైన సోమవారం నివేదికను విడుదల చేసింది. 2023 జులై నుంచి 2024జూన్ వరకు జరిగిన తాజా సర్వేను లేబర్ బ్యూరో విడుదల చేసింది. నిరుద్యోగరేటులో ప్రధానమైన మార్పు ఏమీలేదు. ఒక్క వ్యవసాయరంగంలో మాత్రం పనిచేసే కార్మికుల పంపిణీలో కొద్దిగా పెరుగుదల కనిపించింది. ఈ సర్వేకుముందు జరిగిన మూడేళ్లకాలంలో ఉత్పత్తిరంగంలో ఏమాత్రం ఉద్యోగాలు పెరగలేదు.
లేబర్ బ్యూరో లాంటి సంస్థలు చేసిన సర్వేలను సైతం కేంద్ర ప్రభుత్వం తిరస్కరిస్తూ ప్రతి సంవత్సరం లక్షలాదిమందికి ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు బొంకుతున్నారు. వివిధ అసంఘటిత రంగాలలో కొద్దిగా కార్మికులసంఖ్య పెరిగింది. వీరిలో మహిళల భాగస్వామ్యం పెరుగుతున్నది. అదే సమయంలో ఉద్యోగాల కల్పన రేటు తగ్గిపోతున్నదన్న విమర్శను కేంద్రం భరించలేకుండా ఉన్నది. ఉద్యోగాలలో మహిళల సంఖ్య కూడా తగ్గిపోతోంది. కేంద్ర ప్రణాళికా కార్యక్రమం అమలు మంత్రిత్వశాఖ విడుదల చేసిన నివేదికలో గ్రామీణ ప్రాంతాల్లో కార్మికులు చేసే పనుల్లో 201718లో 50.7శాతం నుంచి 2023
24 నాటికి 63.7శాతం పెరిగినట్లు తెలిసింది. అదే పట్టణప్రాంతాల్లో కార్మికుల పాత్ర 47.6శాతం నుంచి 50 శాతానికి పెరిగినట్లు వెల్లడిరచింది. లేబర్‌కోడ్స్ పార్టిసిపేషన్ రేటు (ఎల్‌ఎఫ్‌పీఆర్) పురుషుల్లో 201718లో 75.8శాతం నుంచి 2023
24నాటికి 78.8శాతానికి పెరిగినట్లు తెలిపింది.
దేశంలో నిరుద్యోగుల పరిస్థితి తీవ్రంగా ఉందని నిపుణులు చేసిన వార్షిక సర్వే తెలియజేస్తోంది. ఈ పరిస్థితి ప్రతి సంవత్సరం ఆందోళనకరంగా ఉన్నదికానీ ఏమాత్రం ఊరట నిచ్చేదిగా లేదని ప్రముఖ్య ఆర్థికవేత్త సంతోశ్ మెహరోత్రా తెలిపారు. నిరుద్యోగ వాతావరణం లేదా నిరుద్యోగ యువకుల విషయంలోనూ ఏమాత్రం మార్పులేదన్నారు. ప్రభుత్వం మాత్రం పనిచేసే వారి నిష్పత్తి పెరుగుతున్నదని చెప్పుకుంటున్నది. వ్యవసాయరంగంలో పనిచేసే కార్మికుల సంఖ్య కొంతమేర పెరిగింది. ఎందుకంటే పట్టణ ప్రాంతాలకు తరలివెళ్లి నిర్మాణరంగంలో పనిచేసేవారు అనేకమంది గ్రామాలకే పరిమిత మవుతున్నారు. ఒక్క రైల్వే విభాగంలోనే 3లక్షలకుపైగా ఖాళీలున్నా భర్తీ చేయడంలేదు. ఈ కారణంగానే రైల్వే ప్రమాదాలు పెరుగుతున్నాయని తెలుస్తోంది. రైల్వేలను ప్రైవేటీకరించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందువల్లనే ఖాళీలను భర్తీచేయడంలేదన్న అభిప్రాయం ఉంది. కుటుంబంలో పనిచేసే వారి సంఖ్య కూడా పెరుగుతున్నది. వీరికి ప్రత్యేకించి మహిళలకు ఎలాంటి వేతనాలు ఉండవు. నాలుగేళ్లుగా ఇంటిపనుల్లోనూ, వ్యవసాయ పనులోన్లూ పాల్గ్గొనే మహిళల సంఖ్య పెరుగుతున్నది. వ్యవసాయేతర రంగాలలో ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారి సంఖ్య పెరిగింది. అతి తక్కువ పోస్టులలో నియామకాలకు సంబంధించి ఉన్నతస్థాయి చదువులు చదివిన వారితోపాటు లక్షలమంది నిరుద్యోగులు దరఖాస్తులు చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో దాదాపు 30లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ భర్తీ చేయడంలేదని అనేక సర్వేలు వెల్లడిరచాయి. ఉత్పత్తిరంగంలో పాల్గొనే కార్మికులసంఖ్య 11.4శాతం ఉంది. ఈ రంగంలోనే ఉద్యోగుల సంఖ్య పెరగడంలేదు. 2012లో ఈ రంగంలో పనిచేస్తున్న వారి శాతం 12.8 కాగా, గత 10ఏళ్లలో సైతం ఏమాత్రం పెరగలేదని మెర్‌హోత్రా తెలిపారు. నిర్మాణ రంగంలో పనిచేస్తున్నవారి సంఖ్య 12శాతానికి తగ్గిపోయింది. తాజాగా వీరి సంఖ్య పెరగడంలేదు. అంటే నిర్మాణరంగం వృద్ధి చెందడంలేదని అర్థం చేసుకోవాలి.
జమ్మూకశ్మీర్‌లో నిరుద్యోగం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఇక్కడ ఉన్నత చదువులు చదివిన యువతకు ఉపాధి కరువైంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో పరిమిత అవకాశాలే ఉన్నాయి. ఈ కారణంగా వేలాదిమంది యువత నిరాశాజనక పరిస్థితిలో ఉన్నారు. ఇక్కడ ఉద్యోగాలు దొరకడం కష్టమేనని అధికారిక గణాంకాలే చెబుతున్నాయి. జమ్మూ
కశ్మీర్‌లో 2023-24 తొలి త్రైమాసికంలోనే 3.52 లక్షల మంది యువత ఉపాధికల్పన విభాగంలో పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో 1.09 లక్షల మంది పట్టభద్రులు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు. నిరుద్యోగులలో మూడోవంతు వీరే ఉండడం గమనార్హం. గత సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ మధ్యకాలంలో 99,322 మంది గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు తమపేర్లు నమోదు చేసుకున్నారు. అయితే అధికారిక, అనధికారిక గణాంకాల మధ్య చాలా వ్యత్యాసం కన్పిస్తోంది. జమ్మూకశ్మీర్‌లో నిరుద్యోగ రేటు అత్యధికంగా 23.1 శాతంగా ఉన్నదని సెంటర్‌ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ గత ఏడాది ఏప్రిల్‌లో తెలిపింది. గత సంవత్సరపు జమ్మూ
కశ్మీర్ ఆర్థిక సర్వే మాత్రం నిరుద్యోగం తగ్గిందని చెబుతోంది. జమ్మూ`కశ్మీర్‌లో 60 వేలకు పైగా ప్రభుత్వ దినసరి కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి రోజుకు రూ.300 వేతనం లభిస్తోంది. వీరంతా గత పదిహేను సంవత్సరాలుగా కాంట్రాక్ట్ పద్ధతిపైనే పనిచేస్తున్నారు. విద్యుత్, ప్రజారోగ్యం, ఇంజినీరింగ్ వంటి ప్రభుత్వ విభాగాలలో సేవలు అందిస్తున్నారు. వందలాది మంది కార్మికులు గత 20 సంవత్సరాలుగా వన్యప్రాణుల విభాగంలో పనిచేస్తున్నా వారిని క్యాజువల్ కార్మికులుగా కూడా గుర్తించడం లేదు. వారిని సీజనల్ వర్కర్లుగా పిలుస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలు ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి హామీలు గుమ్మరిస్తూ మ్యానిఫెస్టోలను విడుదల చేశాయి, అందులో రోడ్లు, విద్యుత్, నీరు నుంచి ఆర్టికల్ 370 వరకు వాగ్దానాలు చేశాయి. కానీ ప్రతి విజన్ డాక్యుమెంట్‌లో లేనిది నిరుద్యోగ సమస్యకు పరిష్కారమే.
ఎడిట్ పేజి డెస్క్