నిరుద్యోగ సంక్షోభ పరిష్కారానికి 202425 బడ్జెట్‌లో బీజేపీ నాయకత్వంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ధ పెట్టలేదు. నిరుద్యోగశాతం ఈ సంవత్సరం మే నెలలో 7 శాతం ఉండగా, జూన్ నాటికి 9.2 శాతానికి పెరిగిందని సిఎంఐఈ సర్వే ఈ గణాంకాలను వెల్లడిరచింది. పెరుగుతున్న నిరుద్యోగ సమస్య పరిష్కారానికి మోదీ అధికారానికి వచ్చిన తర్వాత ఏనాడు శ్రద్ధ వహించలేదు. మౌలిక సమస్యల పరిష్కారంకోసం బడ్జెట్‌లో ఎటువంటి చర్యలను పేర్కొనలేదు. బడ్జెట్‌లో ఆదాయం, వ్యయం అంచనాలు మినహా, రానున్న ఆర్థిక సంవత్సరంలో చేపట్టనున్న చర్యలను పొందుపరచలేదు. ఆర్థికరంగంపై రాజకీయాలు ప్రభావం చూపుతాయ చెప్పడానికి ఇది సరైన ఉదాహరణ. అదే సమయంలో రాజకీయాలపై కూడా ఆర్థికరంగం అత్యధికంగా ప్రభావం చూపుతోంది. ఈ విషయం చరిత్ర పుటల్లో చూడవచ్చు. ఆంధ్రప్రదేశ్, బీహార్‌లో వ్యవసాయం, ఉద్యోగరంగం విస్తరిస్తుందని బడ్జెట్ పేర్కొంది. మోదీ ప్రభుత్వం ఏర్పడటానికి కీలకమైన ఆంధ్రప్రదేశ్, బీహార్‌లలో ప్రాంతీయ పార్టీలు టీడీపి, జెడి(యు) లు తోడ్పాటు అందించినందున ఆ రాష్ట్రాలకు ప్రత్యేక కేటాయింపులు ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ బడ్జెట్‌లో పేర్కొన్నారు. టీడీపి, జెడి(యు) లు ఎన్‌డిఎలో భాగస్వాములుగా ఉన్నాయి. రెండు రాష్ట్రాల అభివృద్ధికి అవసరమైన కేటాయింపులు చేయాలని కోరారు. తమ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరినప్పటికీ మోదీ తిరస్కరించారు. ప్రస్తుతానికి ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రశాంతంగా ఉన్నారు. బీహార్‌కు చెందిన వివిధ ప్రాజెక్టుల కోసం దాదాపు 59 వేల కోట్లు కేంద్రం కేటాయించింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు నుంచి 15 వేల కోట్ల రూపాయలు అప్పుగా ఇప్పిస్తామని ఆర్థిక మంత్రి హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా దేశ ప్రజలందరికీ ఆహారధాన్యాలను అందిస్తుందని చెప్పారుగానీ నిధుల కేటాయింపు విషయం నిర్దిష్టంగా ప్రకటించలేదు. బీహార్‌తో సమానంగా ఆంధ్రప్రదేశ్‌కు సహాయాన్ని ప్రకటించలేదు. దేశ వ్యాప్తంగా నిరుద్యోగంతో యువత అల్లాడుతున్నప్పటికీ సమస్య పరిష్కారానికి కేంద్రం శ్రద్ధ వహించలేదు. గత ఏడు సంవత్సరాల్లో అసంఘటిత రంగంలో 16.45 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోగా పురుషుల కంటే మహిళల్లో నిరుద్యోగిత ఎక్కువగా ఉందని బడ్జెట్‌లో పేర్కొన్నారు. మరోపక్క గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం పెరుగుతూనే ఉంది. పనిచేయగల వయసులో ఉన్నవారు మూడిరట రెండువంతులుండగా వారు నిరుద్యోగులుగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో దేశంలో ఉత్పత్తి రంగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. 2024
25 బడ్జెట్‌లో సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల వివరాలను, వాటికి కావలసిన అవసరాలను, అవి లేని విషయాన్ని బడ్జెట్‌లో పేర్కొనలేదు. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి దూరదృష్టి అవసరం. బడ్జెట్‌కు ముందు ఆర్థిక నిపుణులతో ప్రధానమంత్రి మోదీ జూలై 11 న సమావేశమై ఉత్పత్తి, గ్రామీణ వాణిజ్యంపై ప్రముఖంగా పేర్కొన్నారు. అయితే ఈ సమావేశం కేవలం మాటలకే పరిమితమైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పరస్పర సంబంధాలు, సమస్యల గురించి మాట్లాడి సరిపెట్టారు. ప్రాజెక్టులు, పథకాలకు కేంద్రప్రభుత్వ కేటాయింపులపై చర్చలు జరిపారు. ఈ ప్రాజెక్టులు, కార్యక్రమాలను అమలు చేయడానికి రాష్ట్రాలు జవాబుదారీగా లేవని అభాండాలు వేశారు.
ఇంతవరకు చర్చ ఆర్థికరంగంపై జరిగింది. అయితే గ్రామీణ సమస్యలను అంతర్భాగం చేయకపోతే అది పూర్తి ఆర్థికంరంగంపై చర్చగా పరిగణించలేము. గ్రామీణ ప్రాంతాల్లో వేతనాల పెరుగుదల దాదాపు నిలిచిపోయింది. వేతనాల విషయంలో సానుకూల దృక్పథం లేదు. సంవత్సరానికి పైగా రైతులు చేపట్టిన మహత్తర పోరాటానికిగాను మూడు దుష్ట చట్టాలు ఉపసంహరణ తర్వాత రైతులు సమ్మె విరమించారు. ఎన్నికలు జరగనున్న సమయంలో సమ్మె విరమణతో ప్రభుత్వం సంబరపడిరది. అయితే ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను నేటికీ మోదీ ప్రభుత్వం నెరవేర్చలేదు. పంటలకు కనీస మద్దతు ధరను చట్టబద్ధంగా ఆమోదించాలన్నది రైతు ఉద్యమ ప్రధాన డిమాండ్. నిరుద్యోగం గురించి ప్రధాని మోదీ మాట్లాడుతూ, ‘‘శ్రమ ఔన్నత్యం’’ అని ఎంతో గొప్పగా వ్యాఖ్యానించారు. కార్మికులు ఆకలికి అల్లాడుతుంటే అది ఔన్నత్యం అవుతుందా? 125 దేశాలలో ఆహార సమస్యపై చేసిన అధ్యయనం ప్రకారం భారతదేశం అత్యంత దిగువలో 111 వ స్థానంలో ఉంది. అయితే ఈ అధ్యయనాన్ని మోదీ ప్రభుత్వం తిరస్కరించింది. ఏ అధ్యయనాన్ని ఈ ప్రభుత్వం అంగీకరించదు. 40 దేశాలలో తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న పరిస్థితి భారతదేశంలోనూ ఉంది. ఇదీ దేశ పరిస్థితి.