డా. జ్ఞాన పాఠక్
కొవిడ్ మహమ్మారి కాలంలో భారతదేశంలో గతంలో ఏనాడు లేనివిధంగా అతి తక్కువ వేతనాలను కార్మికులకు చెల్లించారు. ధరల తీవ్రత వాటి ఒత్తిడుల నడుమ నలిగిపోతున్న నిర్బంధ కార్మికులకు అతి తక్కువ కూలీలు చెల్లించారు. బాల కార్మి కులు, నిర్బంధ కార్మికులు, మానవ రవాణా పెరిగిపోయాయి. ఈ ఒత్తిడుల కారణంగా నిర్బంధ కార్మిక సరఫరా సంస్థలు అతి తక్కువ కూలీని చెల్లించటంతో పాటు చెల్లింపులలో అనవసరమైన కోతలు విధించారు. జరిమానాలు వేశారు. కొన్ని చోట్ల కూలీలు కూడా ఇవ్వలేదు. భారతదేశంలోని తేయాకు పరి శ్రమలో నిర్బంధ కార్మికులకు చెల్లింపుల విషయంలో కోతల విధింపు ఎక్కువగా ఉందని ఐఎల్‌ఒ నివేదిక తెలిపింది.
ప్రపంచ వ్యాప్తంగా, మరీ ముఖ్యంగా భారతదేశంలో నిర్బంధ కార్మికుల నివారణకు తక్షణం చర్యలు తీసుకోవాలి. ఆయా ప్రభుత్వాలు సరఫరా చేస్తున్న నిర్బంధ కార్మికులతో సహా అన్ని రకాల సరఫరా మార్గాలను శాశ్వతంగా మూసివేసేందుకు కఠిన వైఖరిని అనుసరించాలని జి7 దేశాల వాణిజ్య మంత్రులు ఒక ప్రకటన చేశారు. పనులు అవసరమైన వారిని, మైనారిటీలను, వ్యవసాయ, సౌర, దుస్తుల తయారీ రంగాల నుండి దేశాలు నిర్బంధ కార్మికులను పంపు తున్నాయి. కొవిడ్ మహమ్మారి సృష్టించిన సంక్షోభం నిర్బంధ కార్మికుల పరిస్థితు లను కల్లోల పరిచింది. ప్రపంచ వ్యాప్తంగా 2.5 కోట్ల మంది నిర్బంధ కార్మికులు ఉన్నారు. 2018లో నిర్వహించిన ప్రపంచంలో బానిస కార్మికుల సూచీ ప్రకారం భారతదేశంలో 2016లో 80లక్షలమంది ఆధునిక బానిసత్వంలో జీవిస్తున్నారు. వెయ్యి మంది ప్రజలలో 6.1 మంది నిర్బంధ కార్మిక వ్యవస్థలో ఉన్నారు. 2019 ప్రపంచ కార్మిక సంస్థ చేసిన ప్రకటనలో బాల కార్మికులు, నిర్బంధ కార్మికులు, మానవ రవాణా మార్గాలను పూర్తిగా నివారించాలని కోరింది. ఈ మార్గాల ద్వారా సరఫరా చేసే దేశాలలో భారతదేశం కూడా ఉన్నది.
నిబంధనల ప్రకారం పనిచేసే బహుళ వాణిజ్య వ్యవస్థలో నిర్బంధ కార్మికులకు తావు లేకుండా చూడాలని ఆ నివేదిక కోరింది. ఇందుకోసం అన్ని దేశాలు, బహుళ వాణిజ్య సంస్థలు, వ్యాపార సంస్థలు కలిసి పని చేయటం ద్వారా ప్రపంచంలో నిర్బంధ కార్మికుల సరఫరా మార్గాలను పూర్తిగా నిర్మూలించాలని ప్రపంచ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) నివేదిక కోరింది. సరఫరా మార్గాల నుండి నిర్బంధ కార్మికుల సమస్యను పూర్తిగా పరిష్కరించేందుకు గాను వారి గుర్తింపు, నివారణకు వాణిజ్య విధానం ముఖ్యమైన సాధనాలలో ఒకటని జి7 వాణిజ్య మంత్రులు గుర్తించారు. నిర్బంధ కార్మికుల సమస్య ప్రపంచ స్థాయిలో ఉన్నది. అంతర్జాతీయ కార్మిక ప్రమాణాలు, వాణిజ్యానికి ఐరాస మార్గదర్శక సూత్రాలు, మానవ హక్కులు, అంతర్జాతీయ వాణిజ్య ప్రమాణాల ఆధారంగా నిర్బంధ కార్మికుల సమస్య పరిష్కరించాలి. ఈ సమస్య పరిష్కారంలో ఐక్యరాజ్య సమితి ప్రత్యేకించి ఐఎల్‌ఓ, ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ (ఒఈసీడీ) లతో కలిసి పని చేయవలసి ఉంటుంది.
2019లో ఐఎల్‌ఓ నివేదికను ఒఈసీడీ, ఐఒఎం, యునిసెఫ్ కలిసి రూపొందించాయి. కొవిడ్ మహమ్మారి కాలంలో భారతదేశంలో గతంలో ఏనాడు లేనివిధంగా అతి తక్కువ వేతనాలను కార్మికులకు చెల్లించారు. ధరల తీవ్రత వాటి ఒత్తిడుల నడుమ నలిగిపోతున్న నిర్బంధ కార్మికులకు అతి తక్కువ కూలీలు చెల్లించారు. బాల కార్మికులు, నిర్బంధ కార్మికులు, మానవ రవాణా పెరిగి పోయాయి. ఈ ఒత్తిడుల కారణంగా నిర్బంధ కార్మిక సరఫరా సంస్థలు అతి తక్కువ కూలీని చెల్లించటంతో పాటు చెల్లింపులలో అనవసరమైన కోతలు విధించారు. జరిమానాలు వేశారు. కొన్ని చోట్ల కూలీలు కూడా ఇవ్వలేదు. భారతదేశంలోని తేయాకు పరిశ్రమలో నిర్బంధ కార్మికులకు చెల్లింపుల విషయంలో కోతల విధింపు ఎక్కువగా ఉందని ఐఎల్‌ఒ నివేదిక తెలిపింది. కార్మికులకు తక్కువ వేతనాలు, వేతనాల చెల్లింపులలో అవకతవకలు తదితర విధాలుగా కార్మికుల దోపిడీ విపరీతంగా సాగిందని అధ్యయనం తెలియజేసింది. పైగా నిర్బంధ కార్మికులపై భౌతిక దాడులు, బెదిరింపులు, లైంగిక దాడులు జరిగినట్టు కార్మికులే ఫిర్యాదు చేశారు.
ఐఎల్‌ఒ నివేదికలో కార్మికుల సబ్ కాంట్రాక్టు, ఉత్పత్తి కోటాలు, అవుట్ సోర్సింగ్ ఒత్తిడి, అదనపు పనిగంటలు తదితరాలు ఆధునిక బానిసత్వానికి దోహదం చేశాయి. భారతదేశంలో కరోనా కాలంలో ఏర్పడిన పరిస్థితులు ఆధు నిక బానిసత్వానికి దారి తీశాయి. పైగా మోదీ ప్రభుత్వం వివాదాస్పదమైన నాలుగు లేబర్ కోడ్‌లను అమలు చేసేందుకు ఏ మాత్రం వెనుకాడటం లేదు. తాజా ప్రపంచ బానిసత్వ సూచీ కూడా నిర్బంధ లైంగిక దాడులు, ఆధునిక బాని సత్వంలో పిల్లల సమస్యలు ప్రతిబింబించింది. ఇందులో అవయవాల రవాణా, ఆయా దేశాలలో జరిగే యుద్ధాలలో బాలల వినియోగం లాంటి అంశాలను చేర్చ లేదు. దేశ వ్యాప్తంగా కాపాడిన బాధితులను నిర్బంధ కార్మికులుగా, వేశ్య వృత్తిలో దించేందుకు ఇంకా ఇతర రూపాలలో దోపిడీ చేసేందుకు వినియోగించారని భారత జాతీయ నేరాల నమోదు బ్యూరో 2018 ప్రపంచ బానిస సూచీ తెలియజేసింది.
మన దేశంలో మొత్తం కార్మికులలో 90 శాతం అసంఘటిత రంగంలో పని చేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది నిర్బంధ కార్మికులు కావడానికి ఇతర విధాలుగా వారిని దుర్వినియోగం చేసేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. కొవిడ్ మహమ్మారి ఈ అవకాశాలను మరింత పెంచింది. కార్మికులను దోపిడీ చేయటాన్ని నిరోధించేందుకు ప్రస్తుతమున్న న్యాయవ్యవస్థ తగినంత కట్టుదిట్టంగా లేదు.