Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 15, 2024
Sunday, September 15, 2024

ప్రపంచ శాంతి అవశ్యం

లిజ్‌ పైన్‌

రెండో ప్రపంచ యుద్ధం ముగిసే దశలో 1945 ఆగస్టు 6న హిరోషిమా, 9వ తేదీన నాగసాకి పట్టణాలపై అమెరికా చేసిన బాంబు దాడుల్లో లక్షలాదిమంది మరణించారు. ఇదేదో యాదృచ్ఛికంగా జరిగిందేమీ కాదు, కావాలని బాంబులను అమెరికా వేసిందనేది స్పష్టం. ప్రపంచ ఆధిపత్యాన్ని చాటుకునే క్రమంలో అమెరికా ఈ బాంబుదాడులకు తెగబడిరది. ప్రపంచ యుద్ధం తరువాత పశ్చిమ పసిఫిక్‌ ప్రాంతంలో తమ సామ్రాజ్యవాద విధానాన్ని, పెత్తనాన్ని కొనసాగించేందుకే ఈ ఘాతుకానికి పాల్పడిరది. ఈ ఘటనలో హిరోషిమాలో దాదాపు 1,40,000 మంది ఒకే రోజున చనిపోయారు. వేలమంది గాయపడ్డారు. ఈ అణుబాంబు ప్రభావం ఇప్పటి తరాలను కూడా ఇంకా వేధిస్తూనే ఉంది.
అమెరికా ప్రభుత్వానికి, సైన్యానికి తాము చేసిందేమిటో స్షÛష్టంగా తెలుసు. హిరోషిమా దాడి అనంతరర మూడురోజులకు నాగసాకిమీద బాంబు దాడులు జరిగాయి. ఈ విధ్వంసకాండ వల్ల జరిగిన ఘోరం, నష్టం ప్రపంచానికి అమెరికా వైఖరిని స్పష్టం చేసింది. జపాన్‌లోనూ, ముఖ్యంగా మధ్యప్రాచ్యంలోనూ సోవియట్‌ యూనియన్‌కి ఎలాంటి పట్టులేకుండా చేసేందుకే అమెరికా ఈ ఘాతుకానికి పాల్పడిరది. ఈ అణుబాంబు దాడులు తర్వాత సరిగ్గా 79 సంవత్సరాలకు, నాటో కూటమి ఏర్పడిన 75 ఏళ్లకు సామ్రాజ్యవాద దేశాల సైనిక, ఆయుధాల శక్తులు అపారంగా పెరిగాయి. ప్రస్తుతం అమెరికా దగ్గర ఉన్న ఆయుధాలు వినియోగించినట్లయితే ఈ ప్రపంచలో ఉన్న అత్యధిక మంది ప్రజలు మరణిస్తారు. బహుశా భవిష్యత్తులో విశ్వమంతా ఆయుధాలతోనే నిండిపోతుందేమో… తాజాగా వాషింగ్టన్‌లో జరిగిన శిఖరాగ్ర సమావేశం(జులై 10,2024) విడుదల చేసిన ప్రకటన చదివితే ప్రజలను భయకంపితులను చేస్తోంది. ఈ ప్రకటన ప్రపంచాన్ని రెండుగా చీలుస్తుందని రష్యా పేర్కొంది. ప్రపంచ టెర్రరిజంగా రష్యా అభివర్ణించింది. ఈ సమావేశంలో చైనా, ఇరాన్‌, కొరియా,ఆ స్ట్రేలియా, న్యూజిలాండ్‌, జపాన్‌, భారత్‌ దేశాలు పాల్గొన్నాయి.ఈ ప్రకటన చేసిన హెచ్చరికలు ప్రపంచ ప్రయోజనాలకు తీవ్ర ముప్పుకలిగించేలా ఉన్నాయని ఆ ప్రకటన తెలియజేసింది.
స్టాక్‌హోమ్‌ అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్థ ప్రకారం(జూన్‌,2024) ప్రపంచంలో అణ్వాయుధాలు కలిగిన తొమ్మిది దేశాలు తమ అణ్వాయుధ శక్తిని మరింత పెంచు కుంటున్నాయి. ఈ ఆయుధాలను ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే ఈ దేశాలు ఆయుధ స్థావరాలను, జలాంతర్గా ములను ప్రపంచమంతటా ఏర్పాటుచేశాయి. అత్యధికంగా ఆయుధస్థావరాలు అమెరికా, రష్యాలకు ఉన్నాయి. అత్యంత ఆధునిక అణ్వాయుధాలు ఇజ్రాయిల్‌లో ఉన్నాయి. డిమోనియా వద్ద ఫ్లుటోనియం ఉత్పత్తి రియాక్టర్‌ను ఆధునికంగా తయారు చేస్తున్నారు. బ్రిటన్‌ వద్ద న్యూక్లియర్‌ వార్‌ హెడ్‌ నిల్వలు పరిమితంగానే ఉన్నాయి. అమెరికా అణ్వాయుధాలను నిల్వ చేసేందుకు సఫోల్క్‌లో ఉన్న సైనిక స్థావరం కేంద్రంగా ఉంది.
స్టాక్‌ హోమ్‌ శాంతి పరిశోధనా సంస్థప్రకారం, మానవాళి చరిత్రలో ప్రస్తుతం మనం అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో నివసిస్తున్నాం. 2022 నుంచి యుద్ధాలు, అంతర్యుద్ధాలు పెరిగిపోయాయి. ఇప్పటికే రష్యా`ఉక్రెయిన్‌ మధ్య జరిగిన యుద్ధంలో వేలాదిమంది మరణించారు. మరికొంతమంది దిక్కుతోచని స్థితిలో శరణార్ధి శిబిరాల్లో తలదాచుకుంటుండగా మరికొంతమంది వలసలుగా వెళ్లారు. పలస్తీనాపై దాదాపు రెండు సంవత్సరాలుగా ఇజ్రాయిల్‌ దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. గాజా ప్రాంతం నుంచి 20లక్షలమందికిపైగా పలస్తీనియన్లను ఇజ్రాయిల్‌ ఇతర ప్రాంతాలకు తరిమివేసింది. దాదాపు 40వేల మందికిపైగా పలస్తీనీయులు హతులయ్యారు. వీరిలో 15వేల మందికిపైగా చిన్నారులున్నారు. పలస్తీనాపై ఇజ్రాయిల్‌ దాడిలో అమెరికా కీలకపాత్ర పోషిస్తూ ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తోంది. ఒకవైపు ఇజ్రాయిల్‌కు ఆయుధాలు, నిధులను అందిస్తూ అమెరికా మరోవైపు శాంతివచనాలు వల్లిస్తోంది. గతంలో ఇజ్రాయిల్‌ సిరియాలోని ఇరాన్‌ ఎంబసీ పైన బాంబులు ప్రయోగించడంతో రెండు దేశాల మధ్య వైరం మరింత పెరిగింది. ఈ నేపధ్యంలో ఇరాన్‌ ఇజ్రాయిల్‌పైన దాడులు చేసేందుకు సిద్ధమవుతోంది. అమెరికా గతంలో ఇరాక్‌పైన, అనంతరం అఫ్గ్గానిస్తాన్‌పైన దాడులుచేసి లక్షలాదిమందిని హతమార్చిన చరిత్ర ఉంది. ఇప్పటికైనా ప్రపంచదేశాలన్నీ ఒక్కటై శాంతిని నెలకొల్పవలసిన తరుణం ఆసన్నమైంది. అయితే ఇలాంటి అవకాశం లేకుండా నియంతృత్వ, నిరంకుశ ధోరణులతో అమెరికా, నాటో దేశాలు అడ్డుకుంటున్నాయి. వీరిని ఎదుర్కొనేందుకు అనివార్యంగా చైనా, రష్యా, తదితర దేశాలు సిద్ధపడాల్సి వస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img