బంగ్లాదేశ్‌లో హిందువుల మీద జరిగిందంటున్న దాడి ప్రకంప నలు పొరుగున ఉన్న త్రిపురలో వెంటనే వినిపించాయి. మాస్కోలో వర్షం కురిస్తే ఇక్కడ గొడుగేసుకుంటారు అని ఎద్దేవ చేసినవారు అంతకన్నా విపరీతంగానే ప్రవర్తిస్తారు. మరో రాష్ట్రంలో గానీ, మరో దేశంలో గానీ హిందువుల మీద దాడులు జరిగాయన్న సమాచారం అందితే చాలు హిందూవుల ప్రయోజనాలకు కంకణం కట్టుకున్నా మనుకుంటున్న సంఫ్‌ు పరివార్ వెంటనే స్పందిస్తుంది. అంతకంత ప్రతీకారం తీర్చుకుంటుంది. మసీదులను, ముస్లింల ఇళ్లను, దుకా ణాలను ధ్వంసం చేస్తుంది. బంగ్లాదేశ్‌లో దేవాలయాలను, హిందు వుల ఇళ్లను ధ్వంసం చేయడం ఎవరూ అంగీకరించరు. అది వీరోచిత కార్య క్రమం అని ఎవరూ అనరు. కానీ దానికి ప్రతిక్రియ మనదేశంలో కనిపించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. బంగ్లాదేశ్ పొరుగున ఉన్న త్రిపుర ఉత్తర ప్రాంతంలో విశ్వ హిందూ పరిషత్ అక్టోబర్ 26న నిరసన ప్రదర్శన ఏర్పాటు చేసింది. ఇది ప్రతీకార వాంఛతో ఏర్పాటు చేసిన నిరసన కనక మసీదులను ధ్వంసం చేయడం, ముస్లింల ఇళ్లను నేలమట్టం చేయడమో, దగ్ధం చేయడమో షరా మామూలుగా జరిగిపోయాయి. బంగ్లాదేశ్‌లో అవాంఛనీయ సంఘటనలు ఏమైనా జరిగితే చర్య తీసుకోవలసిన, నిరో ధించవలసిన బాధ్యత ఆ దేశ ప్రభుత్వానిదే. కానీ ఒక మతం వారు మతో న్మాదంతో రెచ్చిపోయారని మరో మతం వారు కూడా అదే పని చేస్తే ఉన్మాదం ఒకే రీతిలో ఉన్నట్టే. షేక్ హసీనా ప్రభుత్వం హిందువుల మీద దాడి చేసిన వారిని వదిలి పెట్టకుండా చర్య తీసుకుంటూనే ఉంది. కానీ ఈ లోగా విశ్వహిందూ పరిషత్ త్రిపురలో ప్రతీకార దాడులకు దిగి మతో న్మాదంలో తామూ తక్కువ తినలేదని నిరూపిస్తోంది. సంఫ్‌ుపరివార్ మతో న్మాదాన్ని అధికారం సాధించుకోవడానికి వినియోగించుకున్నట్టే ఆ అధి కారాన్ని నిలబెట్టుకోవడానికి మతోన్మాదాన్నే రెచ్చగొడ్తుంది. బీజేపీకి అధి కారం ఉన్నా లేకపోయినా నష్టపోవాల్సింది ముస్లింలేనన్న మాట. దాడులు, ప్రతి దాడులు అన్న శృంఖల అలా అవిచ్ఛిన్నంగా, నిర్విరామంగా కొనసాగా ల్సిందేనన్న మాట. ఒక మసీదును ధ్వసం చేశారని, కొన్ని ముస్లింల దుకాణాలను, ఇళ్లను ధ్వసం చేశారని త్రిపుర పోలీసు అడిషనల్ ఇన్స్పెక్టర్ జనరల్ ధ్రువీకరించారు. ఈ దాడి ప్రతీకారాత్మక దాడిగా కాకుండా పథకం ప్రకారం జరిగిన దాడిలాగే ఉంది. అంటే సంఫ్‌ు పరివార్ అవకాశం కోసం ఎదురు చూస్తోందన్న మాట. ఆ అవకాశం దక్కగానే సర్వ శక్తులూ ఒడ్డి బీభత్సం సృష్టించి ముస్లింలను భీతావహుల్ని చేయడంలో విజయం సాధించినట్టుంది. విశ్వహిందూ పరిషత్ చేసిన అఘాయిత్యం దొంగ చాటుగా జరిగిందేమీ కాదు. అందుకే ఆ దాడికి సంబంధించిన వీడియోలు సర్వ వ్యాప్తమైనాయి. అందులో దాడి చేసిందెవరో స్పష్టంగా రుజువు అవుతూనే ఉంది. ‘‘త్రిపురా మే ముల్లాగిరి నహీ చెలేగా, నహీ చెలేగా’’ అన్న నినాదాలు ఆ వీడియోల్లో స్పష్టంగానే వినిపించాయి. ‘‘ఓ మహమ్మద్ తేరా బాప్, హరే కృష్ణ హరే రాం’’ నినాదాలు రెచ్చగొట్టడానికి ఎంత పదునైన ఆయుధాలో ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. ఇవి ముస్లింలను రెచ్చగొట్టడానికి ఎంత ఉపకరిస్తాయో హిందువులను సంఘటితం చేసి మతోన్మాదం బాట అనుసరించేట్టు చేయడానికి అంతగానే ఉపకరిస్తాయి. పోలీసులు ముందు జాగ్రత్తగా 144వ సెక్షన్ అమలు చేశారు. గుర్తు తెలియని దుండగుల మీద కేసులు షరా మామూలుగా నమోదు చేసే ఉంటారు. అయితే ఎవరినీ అరెస్టు చేయలేదు. త్రిపురలో విశ్వహిందూ పరిషత్తు ర్యాలీ సందర్భంగా హింసాత్మక సంఘటనలు జరగడం వెనక కుట్ర ఉందని బీజేపీ అధికార ప్రతినిధి నవేందు భట్టాచార్య తగు జాగ్రత్తతో విశ్వ హిందూ పరిషత్తు మీద ఈగ వాలకుండా అడ్డుకట్ట వేసేశారు. విద్రోహుల మీద కఠినంగా చర్య తీసుకోవాలని విజ్ఞప్తి కూడా చేశారు. ఇది పోలీసలకు సంకట స్థితే. ఎందు కంటే మసీదు ధ్వంసం కావడానికి, దుకాణాలను లూటీ చేయడానికి, దగ్ధం చేయడానికి కారకులైన విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు సంఫ్‌ు పరివార్ కుదురులోని వారే. త్రిపురలో అధికారంలో ఉన్నది సంఫ్‌ు పరివార్ రాజకీయ అంగమైన బీజేపీయే గద. మసీదులు, దుకాణాల మీద దాడి చేసింది ముస్లింలలోని ఒక వర్గం వారేనని సంఫ్‌ు పరివార్ వాదిస్తోంది.
గాఢాంధకారంలో ఆశాజ్యోతిలాగా అక్టోబర్ 26 నాటి సంఘటనలను తనంత తానుగా త్రిపుర హైకోర్టు స్వీకరించి కేసు విచారణకు చేపట్టింది. త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్. తాళపత్ర ఈ కలహాలను నిరోధించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటో వివరిస్తూ ప్రమాణ పత్రం దాఖలు చేయాలని ఆదేశించారు. మతోన్మాదం విస్తరించకుండా ఏ చర్యలు తీసుకున్నారో కూడా చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. త్రిపురలో అధికారంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. అందు వల్ల వాస్తవాలు ఏ మాత్రం ఈ ప్రమాణ పత్రంలో చోటు చేసుకుంటాయో సులభంగానే ఊహించుకోవచ్చు. ఈ మతోద్రిక్తతలకు సంబంధించి రెండు ఎఫ్.ఐ.ఆర్.లు దాఖలైనాయి. ఒక ఎఫ్.ఐ.ఆర్.లో ముస్లింలకు చెందిన మూడు దుకాణాలను, మూడు ఇళ్లను ధ్వంసం చేశారని, ఒక ముస్లిం మహిళపై లైంగిక దాడులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. మరో ఎఫ్.ఐ.ఆర్.లో విశ్వహిందూ పరిషత్ ర్యాలీ జరుగుతుంటే దుర్భాషలాడారని, తీవ్ర పరి ణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించినట్టు ఉంది. అక్టోబర్ 26న జరిగిన సంఘటనలపై నమోదు చేసిన కేసుల్లో దర్యాప్తు ఎంత వరకు వచ్చింది, ఎలా సాగుతుందో వివరించాలని కూడా హైకోర్టు ఆదేశించింది. సామాజిక మాధ్యమాలలో బూటకపు సమాచారం అందజేసే ప్రయత్నం సాగింది. దీనిపై ఆ సామాజిక మాధ్యమాల మీద, బూటకపు సమాచారం ప్రసారం చేసిన వారి మీద చర్య తీసుకోవాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే మీడియా మాత్రం రాష్ట్రంలో శాంతి నెలకొనడానికి కృషి చేసింది. హైకోర్టు తనంత తాను కేసు విచారణకు స్వీకరించడం ఒక రకంగా సానుకూల పరిణామమే. ప్రజలకు రక్షణ కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వానిదేనని పునరుద్ఘాటించడం ఒక ఎత్తు అయితే పోలీసులు సాక్ష్యా ధారాలను తారుమారు చేయకుండా అడ్డుకోవడానికి అవకాశం ఉంటుం దన్నది మరో ఎత్తు. ఇలా హైకోర్టు తనంత తాను విచారణకు చేపట్టడంవల్ల విచారణ కొనసాగి, నేరస్థులకు శిక్ష పడడానికి తగినంత సమయం పడ్తుందన్నది కూడా వాస్తవమే. ఇలాంటి వ్యవహారాల్లో విచారణ సత్వరం పూర్తి చేసి దోషులను శిక్షించగలిగితే మత కలహాలను కొంత మేరకైనా నివారించడానికి వీలుంటుందేమో. ఇలాంటి మతకలహాలకు మూలం ఎక్కడుందో తెలుసుకుని కావలసిన చర్యలు తీసుకోవడం ఇప్పటి దాకా సాధ్యం కానే లేదు. సంఫ్‌ు పరివార్ లాంటివి మత కలహాలను తమకు అనువుగా దుర్వినియోగం చేస్తూనే ఉన్నాయి. ఈ విషయంలో పోలీసులకు సంపూర్ణ స్వేచ్ఛ ఇవ్వగలిగితే కొంత ఫలితం ఉండొచ్చు.