తాజాగా విద్యార్థులు, యువకులు ప్రత్యేకించి కుకీలకు చెందినవారు తమకు ప్రత్యేక పాలనా యంత్రాంగాన్ని ఏర్పాటుచేసి పాలనను కూడా తమకు అప్పగించాలని చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు. అయినప్ప టికీ కేంద్రం ఏ విషయాన్ని తేల్చకుండా మణిపూర్‌ను అగ్నిజ్వాలలకు వదిలిపెట్టారు. మణిపూర్ రాజధాని ఇంఫాల్‌తో సహా లోయలోని ఐదు జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. ఇంఫాల్‌లో ఫ్రీ ప్రెస్, ఇంటర్నెట్, బ్రాడ్ బాండ్‌పై నిషేధం విధించారు. ఇంఫాల్‌లో విధించిన కర్ఫ్యూను ధిక్కరించడంతో విద్యార్థులకు, పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఆదివారం మధ్య రాత్రి కుకీలపైన మెయితీలు అధికంగా ఉండే ప్రాంతంలో పోలీసులు ప్రదర్శకులను విచ్చలవిడిగా బాదారు. లాఠీఛార్జి చేసి ప్రదర్శకులను చెల్లాచెదురు చేశారు
మణిపూర్‌లో పరిస్థితి మరోసారి భగ్గుమంది. దాదాపు 5,6 రోజులుగా మణిపూర్‌లో అక్కడక్కడ అల్లర్లు చెలరేగుతున్నాయి. మెయితీలుకుకీ
జో గిరిజనుల మధ్య 2023 మేలో హింస చెలరేగింది. రెండు తెగల మధ్య సుదీర్ఘకాలంగా ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ మణిపూర్‌లో సమస్యలను పరిష్కరించేందుకు ఏ మాత్రం కృషి చేయలేదు. హోం మంత్రి అమిత్‌షా ఒకటి, రెండు సార్లు మణిపూర్‌ను సందర్శించినప్పటికీ సమస్యలను చిత్తశుద్ధితో పరిశీలించి పరిష్కారానికి కృషిచేయలేదు. కుకీజో గిరిజనులు కొండప్రాంతాల్లో ఎక్కువగా నివసిస్తున్నారు. మెయితీలు సంపన్నవర్గాలుగా భావిస్త్తారు. వీరు విష్ణుమూర్తిని ఆరాధిస్తారు. కుకీ
జోలకు అమలు జరుపుతున్న రిజర్వేషన్లను తమకు కూడా ఇవ్వాలని మెయితీలు డిమాండ్‌చేస్తూ రంగంలోకి దిగారు. ముఖ్యమంత్రి బిరేన్‌సింగ్ మెయితీలకు చెందినవారు. అందువల్ల రాష్ట్ర హైకోర్టులో మెయితీలకు అనుకూలమైన తీర్పును సాధించారన్న ఆరోపణలున్నాయి. కోర్టు ఇచ్చిన తీర్పు తర్వాతనే రాష్ట్రంలో మెయితీలకు, కుకీలకు మధ్య అంతర్యుద్ధమే జరిగింది.
తాజాగా విద్యార్థులు, యువకులు ప్రత్యేకించి కుకీలకు చెందినవారు తమకు ప్రత్యేక పాలనా యంత్రాంగాన్ని ఏర్పాటుచేసి పాలనను కూడా తమకు అప్పగించాలని చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు. అయినప్ప టికీ కేంద్రం ఏ విషయాన్ని తేల్చకుండా మణిపూర్‌ను అగ్నిజ్వాలలకు వదిలిపెట్టారు. మణిపూర్ రాజధాని ఇంఫాల్‌తో సహా లోయలోని ఐదు జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. ఇంఫాల్‌లో ఫ్రీ ప్రెస్, ఇంటర్నెట్, బ్రాడ్ బాండ్‌పై నిషేధం విధించారు. ఇంఫాల్‌లో విధించిన కర్ఫ్యూను ధిక్కరించడంతో విద్యార్థులకు, పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఆదివారం మధ్య రాత్రి కుకీలపైన మెయితీలు అధికంగా ఉండే ప్రాంతంలో పోలీసులు ప్రదర్శకులను విచ్చలవిడిగా బాదారు. లాఠీఛార్జి చేసి ప్రదర్శకులను చెల్లాచెదురు చేశారు. కంగ్‌పోక్పి జిల్లాలో మాజీ హవల్దార్ లింకోలాయ్ మేట్ సెక్మయ్‌లో శవమై పడిఉన్నాడని టెలిగ్రాఫ్ వార్తా పత్రిక తెలియజేసింది. ఆయన తన స్నేహితుడిని విడిచిపెట్టేందుకు బైటకువచ్చినప్పుడు కుకీజో మెయితీలు నివసించే ప్రాంతాల నుంచి తిరిగివస్తున్న సందర్భంలో అతనిని పోలీసులు తీవ్రంగా కొట్టి గాయపరచారు. చివరకు అతను చనిపోయాడు. మేట్ చనిపోవడంపై కుకీ, మెయితీల మధ్య ఘర్షణలు రేగాయి. కుకీలు నివసించే ప్రాంతానికి మెయితీలు, మెయితీలు నివసించే ప్రాంతానికి కుకీలు రావడానికి వీలులేకుండా ఆంక్షలు విధించు కున్నారు. చనిపోయిన మేట్ కుమారుడు కంగ్‌పోక్పి పోలీసుస్టేషన్‌లో సోమవారం ఉదయం ఫిర్యాదుచేయగా ఎఫ్‌ఐఆర్ నమోదుచేశారు. తన తండ్రిని గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి అపహరించుకుపోయారని మేట్ కుమారుడు చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసి తగిన చర్య తీసుకు నేందుకు ఇంఫాల్ పశ్చిమప్రాంత పోలీసులకు కేసు అప్పగించారు. మణిపూర్ సచివాలయం, రాజ్‌భవన్ ముందు వేలాదిమంది విద్యార్థులు నిరసన ప్రదర్శన చేశారు. ఇటీవల డ్రోన్లు, మిసిలీల ద్వారా దాడులు జరిపిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని రాష్ట్రాన్ని భద్రంగా కాపాడేందుకు కఠినమైన ముమ్మరమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. హింసను నియంత్రించడంలో విఫలమైనందుకుగాను ఉన్నత అధికారులు, ఎంఎల్‌ఏలు రాజీనామాలు చేసేందుకు సిద్ధ్దమయ్యారు. ముఖ్యమంత్రి బిరేన్‌సింగ్ విద్యార్థి ప్రతినిధులతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కుకీ
జోలకు ప్రత్యేకంగా పాలనా యంత్రాంగాన్ని ఏర్పాటు చేయకుండా కేంద్రం మౌనం పాటించినంతకాలం పరిస్థితులు హింసాత్మకంగా ఉంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రధాని మోదీ మణిపూర్ భారతదేశంలో భాగం కాదన్నట్లుగా వ్యవహ రిస్తున్నారు. అసోం రైఫిల్స్ బెటాలియన్లను వారి స్వస్థలాలకు పంపించి వేయాలని వారుఉన్నప్పటికీ భద్రత క్షీణిస్తున్నదని కంగ్‌పోక్పిలో మరో గ్రూపు ఆందోళనలను చేసింది. టార్చి లైట్లు పట్టుకిని ఆదివారం రాత్రి నిరసన ర్యాలీ జరిపినప్పుడూ పోలీసులు ప్రదర్శకులపైన లాఠీఛార్చిచేసి భాష్ఫవాయువు గోళాలను ప్రయోగించారు. జిరిబమ్ జిల్లాలో గత శనివారం రాత్రి రెండు సాయుధ గ్రూపుల మధ్య జరిగిన కాల్పుల్లో ఐదుగురు మృతిచెందగా, ముగ్గురు గాయపడ్డారు. బిష్ణుపూర్ జిల్లాలో మెయితీలకు చెంది వృద్ధుడు రాకెట్ దాడి మూలంగా మరణించాడని పోలీసులు అన్నారు. అయితే తాము ఇందుకు కారణంకాదని కుకీలు తిరస్కరించారు.
మంగళవారం రాజ్‌భవన్ ఎదుట నిరసన ర్యాలీ జరుపుతుండగా పోలీసులు జరిపిన హింసాకాండలో 50మంది విద్యార్థులు గాయపడ్డారు. గాయపడినవారిలో ఒక యువతి ఉన్నారు. ఆమె పరిస్థితి సరిగాలేదని మెరుగైన వైద్య చికిత్సకోసం ప్రాంతీయ మెడికల్ సైన్సెస్ సంస్థలో (ఇంఫాల్) చేర్చారు. మణిపూర్ వర్సిటీ విద్యార్థులు ప్రత్యేకంగా విధుల్లో ప్రదర్శన చేశారు.రాష్ట్ర భద్రతా సలహాదారు, పోలీసు డీజీపీ భద్రతను కాపాడటంలో విఫల మైనందున ఆయనను పదవినుంచి తప్పించాలని విద్యార్థులు డిమాండ్‌చేశారు. పరిస్థితి దిగజారుతున్న దృష్ట్యా హోం మంత్రిత్వశాఖ 2000మంది సీఆర్‌పీఎఫ్ దళాలను రాష్ట్రానికి పంపాలని ఉత్తర్వు జారీచేసింది. మంగళవారం ఇంఫాల్‌లో పోలీసులకు, విద్యార్థులకు మధ్య ఘర్షణలు జరిగిన కారణంగా ఆ ప్రాంతంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారడంతో సీఆర్‌పీఎఫ్ దళాలను పంపు తున్నారు.2023లో జరిగిన హింసాకాండలో 226 మంది మరణించారు. వందలాదిమంది గాయపడ్డారు. బాంబులు, రాకెట్ల దాడివెనుక విదేశీ శక్తులు ఉన్నాయని ఐజీపీ ఐకె ముయ్‌వా ఆరోపించారు. మణిపూర్‌లో అగ్నిజ్వాలలకు ప్రజలుఎంతగా ఇబ్బందులు పడుతున్నప్పటికీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మౌన వహిస్తూనే ఉంది. మహిళలను నగ్నంగా ఊరేగించి నప్పటికీ ప్రధాని మోదీ ప్రస్తావించనేలేదు. బహిరంగ సభల్లో మాత్రం మహిళలకు తాము ఎంతగానో గౌరవం ఇస్తామని చెప్పడం ఒట్టి బూటకం.
ఎడిట్ పేజి డెస్క్