Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 15, 2024
Sunday, September 15, 2024

మిషన్‌ ఇంపాజిబుల్‌

చింతపట్ల సుదర్శన్‌

పడమటి వాకిలి తెర్చుకుని సూర్యుడు భూగోళం మరో వైపునకు వెళ్లడంతో పక్షులు గూళ్లకు బయలుదేరాయి. ఇంకాస్సేపయితే చీకటి నల్ల దుప్పటి పట్టుకు వచ్చేస్తుందని కొంపకు బయలుదేరింది డాగీ. దారిలో కొత్తగా కనిపించిన ఒకటి రెండు కుక్కలను ‘భవ్వు’ తో బెదిరించి అరుగు ఎక్కింది. అప్పటికే గోడకు వీపు ఆనించి ‘మెడిటేషన్‌’ చేస్తున్నది డాంకీ. పలకరిద్దామంటే, ధ్యానంలో ఉన్నాను ‘డిస్ట్రబ్‌’ చెయ్యకు అంటుందేమోనని, మౌనంగా కూచుంది కాని ఇంటి లోపలినుంచి ‘మ్యావు’ శబ్దం వినిపించడంతో ఉలిక్కిపడ్డది. మన ‘ఎనిమీ’ ఇంట్లోకి రావడమేమిటి బొత్తిగా భయం అనేది లేకుండా పోతున్నది ఈ గోడమీది పిల్లులకి అనుకుంటూ వార్నింగ్‌గా ఒక భవ్వు ‘భవ్వు’ మంది.
ధ్యానం చెడిన డాంకీ కళ్లు తెరిచింది. వచ్చావా ‘బ్రో’, వచ్చీరాగానే అసెంబ్లీ రౌడీలా ఏమిటా అరుపు అంది డాంకీ. అరవక ఊరుకుంటానా? లోపల నా బద్ధశత్రువు మ్యావుమంటున్నది మరి. ఎవరన్నారామాట. పిల్లీ, ఎలుకా శత్రువులవవచ్చు, ఎందుకంటే రెండోది మొదటి దానికి ఫుడ్డు కనక కానీ కుక్కకీ, పిల్లికీ ఎందుకు శత్రుత్వం. దాని నోట్లో నువు పట్టవు. నీ నోటికి అది అందదు. ఎవరో కావాలని మీ మధ్య లేని చిచ్చు రగిల్చారు. ఇకనైనా ఆపండి అనవసరపు ‘ఎనిమిటీ’ అంది డాంకీ. అదేమో నాకు తెలీదు ముఖం చూసుకున్న వేళ కరెక్టు కాదేమో కాని, దాన్ని లోపలికెందుకు రానిచ్చావు అంది డాగీ కోపంగా. కోపంలో నైతేనేం నిజం కక్కావు. అవును. దాన్ని నేనే లోపలికి పంపించాను. నువ్వు అరిచి గీ పెడ్తావని, కరవడానికి వెనక్కి పోవని భయపడ్డది కూడా అంది డాంకీ. నువ్వే పంపించావా? సొంత పార్టీ వాడికే ద్రోహం చేస్తావా? రాజకీయం ఒంట పట్టిందా? సీబీఐ వాళ్లల్లా ప్రశ్నలు సంధించకు. సింపుల్‌గా చెప్తా విను. మన ఈ శిథిలమైన కోటలో అనేకం ఎలుకలు చేరాయి. వాటి చప్పుడుకు నా ధ్యానం భగ్నమవుతుంది. వాటి బెడద తప్పించడానికి పిల్లిని పిలిచాను. ఇంట్లోకి పంపాను. దొరికిన ఎలుకను దొరికినట్టు, కసిక్కిన నరికి, పోగులు పెట్టమన్నాను. సాటి జంతువుగా నా ‘రిక్వెస్టు’ ను మన్నించి మూషిక మారణహోమానికి వచ్చింది అంది డాంకీ.
నువ్వు రమ్మన్నావు కనుక అది వచ్చింది కనుక లోపల నిన్ను డిస్ట్రబ్‌ చేసే ఎలుకల్ని వేటాడుతున్నది కనుక నా శత్రువును ఏమీ చెయ్యకుండా వదిలేస్తున్నాను అంటూ సైలెంటయింది డాగీ. లోపల పిల్లి మ్యావులు క్రమంగా పెరిగి తారస్థాయిని అందుకని మళ్లీ చప్పబడ్డవి. ఆ తరువాత కాస్సేపటికి పిల్లి అడుగులో అడుగు వేస్తూ బయటకురాబోయి డాగీని చూసి ఆగిపోయింది. భయపడకు. నేనే రమ్మన్నానని చెప్పా. అసలు మీ ఇద్దరికీ శత్రుత్వం అనవసరం అని ఉద్భోదించా. రా…రా…ఎన్ని ఎలుకల్ని ‘సఫా’ చేశావో చెప్పు. మిషన్‌ కంప్లీటయిందా లేదా అంది డాంకీ. బయటికి వచ్చి ఎందుకైనా మంచిదని డాంకీ పక్కనే నిలబడ్డ పిల్లి నా వల్లకాలేదు ఫ్రెండ్‌. ఈ ఇంట్లో ఉన్నవసలు ఎలుకలేకాదు. పరుగెత్తి పరుగెత్తి కాళ్లు, ఊపి, ఊపి తోకా అలసిపోయాయి. గోడకు కొట్టుకుని తలబొప్పి కట్టింది. అమ్మోవ్‌! అమ్మోవ్‌! ఎలుకలా అవి అంటూ కూలబడిరది. అదేమిటి నల్లపిల్లీ ఎలుకలా అవి అంటూ కూలబడిరది. అదేమిటి నల్లపిల్లీ ఎలుకలని ఎలుకలు కావంటావు అంది డాంకీ. అవి ఒకప్పుడు ఎలుకలేమోకానీ, ఇప్పుడు కొంపా కొంపా తిరిగి దొరికిందంతా కొరికి కొరికిందంతా నమిలి నమలిందంతా మింగి బాగా బలిసి పందికొక్కులయినవి. ఎలుకల్ని పట్టే చిన్న నోటితో బలుపెక్కి పంది కొక్కులయిన వాటిని పట్టుకోలేను కదా. అక్కడికీ శాయశక్తులా కృషి చేశాను. అరుపులకు బెదరలేదు. ఉరుకులకు చెదరలేదు. తిరగబడ్డవి. అయాం సారీ మైడియర్‌ డాంకీ నా వల్లకాలేదు అంది పిల్లి నాలుకతో సొమ్మసిల్లిన తోకను నాకుతూ.
చిట్టెలుకల్ని చిట్టెలుకలుగా ఉన్నప్పుడే పట్టుకోవాలి కాని, పందికొక్కులయ్యేక అవి చిక్కవూ దొరకవు అంటూ అరుగు ఎక్కి అంతా విన్నాను ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ అయినట్టే కదా అన్నాడు అబ్బాయి తన జాగాలో కూచుంటూ. వచ్చావా బ్రో. ఈ పిల్లిని నా ఎనిమీని సాయం కోరింది డాంకీ. డాంకీ రమ్మంది కనుక అరవక కరవకు ఊరుకున్నా అంది డాగీ. ఇంతకీ చిట్టెలుకలు, పందికొక్కులు ఎలాగయ్యేయి అంది డాగీ. ఎందుకేమిటి ఏదిపడితే అది తింటే మనుషులు కూడా పందికొక్కులే అవుతారు. పందికొక్కులయిన మనుషులు తినే తిండినే ‘స్కాము’ అనీ ‘కుంభకోణ’ మనీ అంటారు. ఇప్పుడు దేశం నిండా స్కాములే, కుంభకోణాలే అన్నాడు అబ్బాయి. అవునవును ఇవాళ మన రాష్ట్రంలో వెయ్యికోట్ల జీఎస్‌టి స్కాము జరిగిందని పేపర్లో నమిలాను. స్కాములను పట్టుకుందుకు మనుషులకు దర్యాప్తు సంస్థలు లేవా పోలీసు యంత్రాంగం లేదా? ఊరుకుంటారా అంది డాంకీ. ఏముంటే ఏం లాభం ఏళ్లనించీ కుంభకోణాలు కొనసాగుతూనే ఉన్నాయి దర్యాప్తులు జరుగుతూనే ఉన్నయి. కోర్టుల్లో కేసులు నలుగుతూనే ఉన్నయి. బెయిళ్లూ, వాయిదాలూ, రాజకీయలాలూచీలు ఉండనే ఉన్నయి. కేసులు కొలిక్కి వచ్చి శిక్షలుపడేది ఎందరికి అన్నాడబ్బాయి.
చిట్టెలుకలుగా ఉన్నప్పుడే పంటికిందికి వస్తయి కాని పందికొక్కులయ్యాక లాభంలేదు అంటూ గోడ ఎక్కి దూకి వెళ్లిపోయింది పిల్లి. చిన్న దొంగలకి, చిల్లర దొంగలకి శిక్షలు తక్షణం అమలు చెయ్యవచ్చు కాని, రాజకీయపు అండా, పదవీ హోదా దండా, కలిగి ఉండే కుంభకోణాల వ్యూహకర్తలని ఎవరైనా ఏం చేయగలరు అని నిట్టూర్చాడు అబ్బాయి. కుంభకోణాల పంది కొక్కుల్ని నా వెనక కాళ్ల దగ్గిర నిలబెడితే చుక్కలు చూపిద్దును అన్నది డాంకీ.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img