Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Saturday, September 14, 2024
Saturday, September 14, 2024

మెత్తని కత్తి తేజస్వి

అనన్య వర్మ

క్రికెట్‌ క్రీడాకారుడు కావాలనుకున్న కుర్రాడు రాజకీయాల్లో రాణించడం గొప్పే. పదో తరగతి కూడా చదవని బీహార్‌ మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వీయాదవ్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ ప్రతిపాదించిన విశ్వాస తీర్మానంపై ప్రసంగించినప్పుడు పాటించిన సంయమనం, పరిణతి ఆశ్చర్య పరుస్తాయి. నితీశ్‌ కుమార్‌ ఇంతకు ముందూ, ఇప్పుడూ, భవిష్యత్తులో కూడా తమకు ఆదర్శనీయుడేనని చెప్పిన తీరు పరిపక్వత కలిగిన రాజకీయ నాయకుడికి మాత్రమే చేతనైన విద్య. తేజస్వీ మాట తీరుచూస్తే ఆయన ప్రవర్తనలో కనిపిస్తున్న పరిపక్వత ఆశ్చర్య పరుస్తోంది. 34 ఏళ్ల వ్యక్తిలో ఇంత రాజకీయ కౌశలం అబ్బురమే. లాలూ ప్రసాద్‌ యాదవ్‌ బీహార్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1989 నవంబర్‌ 9న తేజస్వీ జన్మించారు. లాలూప్రసాద్‌ యాదవ్‌కు ఉన్న తొమ్మిదిమంది సంతానంలో అందరికన్నా చిన్నవాడు తేజస్వీ. ఒకప్పుడు తేజస్వీ క్రికెట్‌నే ప్రధాన వృత్తిగా చేసుకోవాలనుకున్నాడు. దిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో పదో తరగతి మధ్యలో మానేసి క్రికెట్‌లో రాణించాలను కున్నాడు. చిన్నప్పటి నుంచి క్రికెట్‌ మీద ఆయనకు అభిమానం ఉన్నా బీహార్‌లో సరైన శిక్షణ సదుపాయాలు లేనందువల్ల తేజస్వీ ఆకాంక్షకు గండి పడిరది.
తేజస్వీ దిల్లీ డేర్‌ డెవిల్స్‌, జార్ఖండ్‌ క్రికెట్‌ బృందంలో ఉండేవారు. క్రికెట్‌లో ఆయన ఆల్‌ రౌండర్‌. పాఠశాలలో చదివేటప్పుడు క్రికెట్‌ బృందంలో ఉండేవారు. దిల్లీలో ఉన్నప్పుడు 15 ఏళ్లకు లోబడిన క్రికెట్‌ బృందంలో ఉండేవారు. పదమూడేళ్లకే ఆల్‌ రౌండర్‌ అనిపించుకున్నారు. విరాట్‌ కోహ్లీ కెప్టెన్‌గా ఈయన బృందంలోనే తేజస్వీ ఉండేవారు. 15 ఏళ్ల లోపు బృందంలో ఉన్నప్పుడు ఇషాంత్‌ శర్మకు జోడీగా ఆడి ఆ మ్యాచ్‌ గెలవడానికి తేజస్వీ దోహదం చేశారు. 17 ఏళ్ల లోపు, 19 ఏళ్ల లోపు క్రికెట్‌ బృందంలోనూ తేజస్వి ఆడారు. 19 ఏళ్లలోపు బృందం ప్రపంచ కప్‌ గెలిచినప్పుడు తేజస్వీ కూడా ఆ బృందం సభ్యుడే. కానీ ఆడే అవ కాశం మాత్రం రాలేదు. తేజస్వీ 2010లో క్రికెట్‌ రంగం నుంచి తప్పుకున్నారు. చివరకు క్రికెట్‌ క్రీడాకారుడు కావాలన్న ఆశ నెరవేరనేలేదు. బీహార్‌లో సరైన సదుపాయాలు లేనందువల్ల ఇతర రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించిన బీహారీలు చాలా మందే ఉన్నారు. తేజస్వీ అదే పనిచేశారు. కానీ ఆ బృందాల్లో స్థానికులకే ఎక్కువ ప్రాధాన్యం ఉండేది. రాజకీయ విషయాలకు వస్తే తేజస్వీ బీహార్‌ ప్రభుత్వంలో అయిదవ ఉపముఖ్యమంత్రి. అతి చిన్న వయసులో ఆయనకు ఈ పదవి దక్కింది. అతి చిన్న వయసులోనే ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఉన్నారు. 2020-2021లో ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ దిన పత్రిక ‘‘వందమంది శక్తిమంతులైన భారతీయుల’’ జాబితాలో తేజస్విని కూడా చేర్చింది. క్రికెట్‌ రంగం నుంచి పూర్తిగా తప్పుకోక ముందే 2010లోనే రాష్ట్రీయ జనతాదళ్‌ తరఫున ఎన్నికల ప్రచారం కూడా తేజస్వీ చేశారు. రాజకీయాల్లోకి ప్రవేశిం చిన తరవాత ఎన్నికల ప్రచారంలో ఆధునిక డిజిటల్‌ పద్ధతులు ప్రవేశ పెట్టారు. 2014లో నితీశ్‌తో రాజకీయ పొత్తు కోసం లాలూ ప్రసాద్‌ను ఒప్పించింది తేజస్వీనే అని ఆ పార్టీ నాయకులంటారు. ఆ తరవాతే జేడీయూ, ఆర్‌జేడీ, కాంగ్రెస్‌తో కలిసి మహాగట్బంధన్‌ ఏర్పడిరది. దీనిలో వామపక్షాలపాత్రా ఉంది. 2015 శాసనసభ ఎన్నికలలో తేజస్వీ రాఘోపూర్‌ నుంచి పోటీచేసి విజయం సాధిం చారు. ఆ ఎన్నికలలో మహాగట్బంధన్‌కు అపూర్వ మైన విజయం సమకూరింది. నితీశ్‌ మంత్రివర్గంలో తేజస్వి మొదట ిసారి ఉపముఖ్యమంత్రి అయ్యారు. 2017లో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న నితీశ్‌ హఠాత్తుగా పల్టీకొట్టి మహాగట్భంధన్‌కు దూరమై బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు తేజస్వీ ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉన్నారు. 2022 ఆగస్టు పదో తేదీన నితీశ్‌ పిల్లిమొగ్గ వేసి బీజేపీని వదిలించుకుని రాష్ట్రీయ జనతాదళ్‌తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడూ తేజస్వీ ఉపముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇటీవల నితీశ్‌ కుమార్‌ మరో సారి పిల్లిమొగ్గ వేసి బీజేపీతో కత్తు కలిపి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. తాజాగా నితీశ్‌ అమాంతం బీజేపీని ఆలింగనం చేసుకున్నప్పుడు తేజస్వి అడగవలసిన ప్రశ్నే అడిగారు. ఏదైనా ఫిర్యాదు ఉంటే విడిపోవ డానికి ముందు ఎందుకు చెప్పలేదు అని నిండు శాసనసభలో నితీశ్‌ను నిలదీశారు. మొదటిసారి నితీశ్‌ ఫిరాయించినప్పుడు తేజస్వీ మాటల్లో కనిపించిన దూకుడుపోయి తాజాగా నితీశ్‌ ఫిరాయించి నప్పుడు తేజస్వీ మాటల్లో సంపూర్ణమైన పరిపక్వత కొట్టొచ్చినట్టు కనిపించింది. కచ్చితమైన రాజకీయ బలిమి ఉంటేనే ఆ పరిపక్వత సాధ్యం. అయితే క్రికెట్‌లో భాగమైన బౌన్సర్లను, నితీశ్‌ను విమర్శించడానికి తేజస్వీ వాడుకున్నారు. రాష్ట్రాల స్థాయిలో బలంగా ఉన్న పార్టీల్లో ఒక్క రాష్ట్రీయ జనతాదళ్‌ తప్ప మిగతావన్నీ ఎప్పుడో ఒకప్పుడు బీజేపీతో కలిసి నడిచినవే. ఈ స్పష్టమైన వైఖరికి సైద్ధాంతిక నిబద్ధతే కారణం. ఇటీవల నితీశ్‌ బలపరీక్ష సమయంలో తేజస్వీ ప్రసంగం విని తీరవలసిందే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img