Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 15, 2024
Sunday, September 15, 2024

మోదీ పాలన ప్రజాస్వామ్య రహితం

సీ.ఎన్‌ క్షేత్రపాల్‌ రెడ్డి

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రాజ్యాంగ స్పూర్తికి భిన్నమైన పాలననే ఇప్పటికీ కొనసాగిస్తున్నది. 2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తూ వచ్చింది. 2019 నాటి ఎన్నికల అనంతరం ఇతరులపై ఆధారపడకుండా బీజేపీకే 303 సీట్లు రావడంతో అడ్డు అదుపులు లేవని భావించిన మోదీ సర్కారు ఏకంగా రాజ్యాంగంలోని మౌలికమైన సూత్రాలన్నిటినీ నిర్వీర్యం చేయడం మొదలుపెట్టింది. చక్రవర్తి తరహా పాలన తీసుకురావాలని ఉబలాటపడిరది. ఎన్నికల తరుణంలో తాను దైవాంశ సంభూతుడనని ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో ప్రధాని మోదీనే చెప్పుకున్నారు. పూర్వం చాలా మంది రాజులు, చక్రవర్తులు తాము దైవాంశ కారణంగానే పాలకులుగా ఉన్నామని తమ ప్రజల్ని నమ్మించి, భయపెట్టి పాలన సాగించేవారు. ఇదే ట్రిక్కు ఎన్నికల తరుణంలో మోదీ ప్రదర్శించజూపారని సులభంగానే అర్థం చేసుకోవచ్చు.
భారత దేశంలో ఎన్నికలు, ప్రజాస్వామ్యం అనే భావనలే లేని రాజ్యాన్ని స్థాపించేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’ ఇందులో భాగమే. రాజ్యాంగ బద్దమైన ఆర్బీఐ, సీబీఐ, న్యాయవ్యవస్థ వంటి అనేక సంస్థలు నిర్వీర్యం అయ్యాయి. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆర్టికల్‌ 370 రద్దు చేశారు. ప్రజాస్వామ్యం భారతీయ విద్యార్థులకు భారమనే భావనను ముందుకు తెచ్చింది. దేశ ప్రజలందరికీ ఆర్థిక సమానత్వం ఉండాలని చెప్తుండగా ఒకరిద్దరు బడా కార్పొరేట్‌లకు దేశ సంపదలన్ని దారాదత్తం చేస్తూ రాజ్యాంగ వ్యతిరేకతను చాటుకుంది. ప్రభుత్వ ఆస్తులను తెగనమ్మేయాలని ప్రయత్నిస్తూనే ఉంది. రాజ్యాంగ విలువలకు తిలోదకాలిచ్చి వ్యవసాయ నల్లచట్టాలను రూపొందించారు. అయోధ్య రామాలయ ప్రారంభంలోనూ రాజ్యాంగ వ్యతిరేకత వ్యక్తమైంది. రాజ్యాంగాన్ని మార్చడం మా తదుపరి కర్తవ్యమని అనేక మంది బీజేపీకి చెందిన పార్లమెంటు సభ్యులు 2024 సార్వత్రిక ఎన్నికల కన్నా ముందు నుంచీ బాహాటంగానే ప్రకటించిన సందర్భాలు అనేకం. వారు అనుకున్నట్టు బీజేపీకే సొంతంగా 370 సీట్లు, ఎన్‌డీఏ కూటమికి 400 సీట్లు వచ్చి ఉంటే ఈ పాటికే భారత రాజ్యాంగానికి మంగళం పాడేందుకు అవసరమైన చర్యల్ని ప్రారంభించి ఉండేవారే. తాజాగా జరిగిన ఎన్నికల్లో సీట్లు తగ్గి ఇతరులపై ఆధారపడే పరిస్థితి ఏర్పడినా పాలకుల ఆలోచనా తీరులో ఏ మార్పు కనిపించడం లేదు. రాజ్యాంగం విషయంలో బీజేపీ నుంచి ఎదురయ్యే ప్రమాద తీవ్రత తగ్గుతుందని చాలామంది భావించారు. కానీ ప్రభుత్వం మాత్రం తమ రాజ్యాంగ వ్యతిరేకతను కొనసాగిస్తూనే ఉన్నది. రాజ్యాంగం నిర్దేశించిన సమాఖ్య స్పూర్తికి భిన్నంగా బడ్జెట్‌ ప్రవేశపెట్టి తమ భావజాలం పాటించని రాష్ట్రాలకు మొండి చేయి చూపింది. తమ ప్రభుత్వ మనుగడకు అవసరమైన సీఎం చంద్రబాబు, నితీష్‌ కుమార్‌లను సంతృప్తి పరిచేలా బడ్జెట్‌ను రూపొందించింది. బీహార్‌లో జరుగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వ్యవసాయం, వరదల నియంత్రణ కోసం అంటూ రూ.11 వేల కోట్లకు పైగా కేటాయింపులు చేసిన కేంద్రం, కేరళలో సంభవించిన వరదల నేపథ్యంలో కనీసం తక్షణ సాయం కూడా ప్రకటించలేదు. 300 వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయినా, వందల మంది ఆచూకీ దొరకకపోయినా కేంద్రం నుంచి సరైన స్పందన లేకపోవడం గర్హనీయం. ఇది సమాఖ్య స్పూర్తికి విరుద్దం. రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర మంత్రి కురియన్‌ సహాయక శిబిరాలను సందర్శించి వాయనాడ్‌ వరద పరిస్థితులను పీఎంవో నిశితంగా పరిశీలిస్తున్నదని తప్పించుకున్నాడు. రక్షణ బలగాలు అందిస్తున్న సాయం మరువలేనిదే. అయితే కేవలం ఇది మాత్రమే కేరళలో సంభవించిన విపత్కర పరిస్థితులకు పరిష్కారం కాదు. 2018లో కేరళలో సంభవించిన వరదల్లోనూ 37 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 9 వేల కోట్ల ఆస్తినష్టం జరిగిందని సాయం చేయాలని సీఎం విజయన్‌ ప్రధానిని కోరితే చాలా కాలం తరువాత కేవలం వంద కోట్లు విదిల్చారు. ఇతర దేశాల నుంచి వచ్చే సాయానికి కూడా అడ్డుపడ్డారు. మూడోసారి అధికారంలోకి వచ్చి నెలలు గడువక ముందే రాజ్యాంగ విరుద్ధమైన అంశాలతో కూడిన నూతన నేర చట్టాలను రూపొందించిన మోదీ ప్రభుత్వం వాటిని దేశ ప్రజలపై రుద్దింది. ఒకే దేశం ఒకే ఎన్నిక విషయంలో మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ గత నవంబరులో ఇచ్చిన నివేదిక అధారంగా సమాఖ్య సూత్రాలకు భిన్నంగా రాచరికందిశగా పావులు కదిపేలా కనిపిస్తున్నది. బీజేపీ కోరుకునే రాచరికం తరహా పాలనకు ఆరంభ సూచికకు ఏడాది క్రితమే బీజం పడిరది. నూతనంగా నిర్మించిన పార్లమెంటు భవన ప్రారంభోత్సవంలో భాగంగా సెంట్రల్‌ హాలులో ‘రాజదండం’ (సెంగోల్‌) ప్రతిష్ఠాపనను కార్యక్రమాన్ని అట్టహాసంగా చేపట్టం వెనుక పెద్ద కథే ఉందనిపిస్తుంది. ఈ రాజదండాన్ని ప్రధాని మోదీ వేదపండితుల సమక్షంలో రాజ్యాంగ నియమాలను ధిక్కరించి ప్రతిష్ఠించడంపై దేశ వ్యాప్తంగా పెద్ద చర్చే జరిగింది. అవేమీ అధికారంలో ఉన్న వారెవరికీ తలకెక్కలేదు. భారతదేశానికి స్వాతంత్య్రం ప్రకటించిన బ్రిటీష్‌ అధికారి లార్డ్‌ మౌంట్‌ బాటెన్‌ వెళుతూ వెళుతూ అధికార మార్పిడికి చిహ్నంగా భారత తొలి ప్రధాని నెహ్రూకు ఈ రాజదండాన్ని అందించారని కట్టుకథలకు బీజేపీ విస్తృతంగా ప్రచారం ఇచ్చింది. నాడు బ్రిటీష్‌ పాలకుల నుండి అధికార మార్పిడి జరిగిందని నిరూపించే ప్రయత్నంతో పాటు ఇకపై దేశంలో రాజరికం తరహా పాలనను చూడబోతున్నారనే సంకేతమివ్వడం ఆ తతంగం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం.
1947 ఆగస్టు 17 నాటి ఆంధ్రపత్రికలో రాజదండంపై అసలైన నిజాలతో ఒక కథనం ప్రచురించారు. ఆ కథనంలో రాజదండం ఫోటో కూడా ఉంది. దాన్ని మౌంట్‌ బాటెన్‌ ఇచ్చినట్టు లేదు. తమిళనాడులోని మఠాధిపతి స్వాతంత్య్ర దినం సందర్భంగా నెహ్రూకు బహూకరించినట్టు ప్రత్యేకంగా రాశారు. ప్రధానిగా ఉన్నవారికి చాలా మంది వివిధ సందర్భాల్లో చాలా బహుమతులు, జ్ఞాపికలు ఇస్తుంటారు. అలా నెహ్రూ చేతికి వచ్చినదే సదరు రాజదండం. అది ఎన్నటికీ అధికార మార్పిడికి చిహ్నం కాజాలదు. పైగా దేశ స్వాత్యంతం బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా వివిధ స్రవంతులు జరిపిన ఉద్యమాల ఫలితమే. ఎందరో వీరుల ప్రాణ త్యాగాలతో సాధించుకున్న స్వాతంత్య్రం కాబట్టే నాటి ప్రధాని నెహ్రూ ఆ సెంగోల్‌ను కానుకగా భావించి మ్యూజియంలో పెట్టమన్నారు. బీజేపీ మాతృక ఆర్‌ఎస్‌ఎస్‌కు భారత్‌లో రాజరికం తరహా పాలన ఉండాలని కోరుకుంది. రాజ్యాంగం అవసరం లేదని, రాచరికానికి ఆలంబన అయిన మనుధర్మ శాస్త్రం ముద్దు అని వాదించింది కాబట్టే రాజదండం ఉండాలని అసత్యకథనాలు ప్రచారం చేసింది. రాజదండం అంటేనే రాజరికానికి చిహ్నం. రాజరికం ఉన్న చోట ప్రజాస్వామ్యం ఉండదు. ప్రజాస్వామ్యం నశిస్తే రాజ్యాంగమే అమలులో ఉండదు. భారతదేశంలో రాజరిక వ్యవస్థకు నూకలు చెల్లి చాలా కాలమే అయ్యింది. భారత రాజ్యాంగం ఆలంబనగా 75 ఏళ్లకు పైగా నడిచిన స్వాతంత్య్ర భారతంలో మళ్లీ బానిసత్వంతో కూడిన రాజరికం అనే భావనను దేశ ప్రజలు ఎన్నటికీ హర్షించరు. ఈ నేపథ్యంలో పార్లమెంటులోకి చేరిన రాజదండం నిర్దేశించే పాలన దేశానికి తీవ్ర నష్టం చేస్తుంది. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, పౌర హక్కులను కంటికి రెప్పలా కాపాడుకునేందుకు రాజ్యాంగం ఒక్కటే శరణ్యం. బీజేపీ పాలనలో నిత్యం ప్రమాదాలను ఎదుర్కొంటున్న భారత రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు ప్రజాస్వామిక శక్తులన్నీ కదలాల్సి ఉంటుంది.
సెల్‌: 9059837847

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img