London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Sunday, October 13, 2024
Sunday, October 13, 2024

యుద్ధోన్మాదం అంతమైతేనే శాంతి

ఎంత మంది సైన్యాలను దింపినా, మారణహోమం సృష్టించినా, వందల బిలియన్ల డాలర్లు ఖర్చు చేసినా హోచిమిన్‌ నాయకత్వాన ఉన్న ప్రజా సైన్యం చేతిలో అమెరికా ఓడిపోక తప్పలేదు. 1975లో ఒకే వియత్నాం ఏర్పడిరది. ఇదే క్రమంలో లావోస్‌, కాంబోడియా దేశాల్లో కూడా సైనిక జోక్యం చేసుకుని ఓటమిచెంది అప్రతిష్ట పాలైంది. 1961లో క్యూబాలో ఫిడెల్‌ కాస్ట్రో ప్రజా ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర చేసింది. అంతర్గత పోరాటం సృష్టించేందుకు ప్రభుత్వ వ్యతిరేక ఉగ్రవాదులకు సహాయంచేసి దేశంలో అస్థిర పరిస్థితులు సృష్టించేందుకు ప్రయత్నించి విఫలమైంది.

బొల్లిముంత సాంబశివరావు

సామ్రాజ్యవాదం యుద్ధాలకు నిలయం. ఈ రెండిరటి మధ్య అవినాభావ సంబంధం ఉంది. యుద్ధాలు లేకపోతే సామ్రాజ్యవాదులకు నిద్ర పట్టదు, గుత్త పెట్టుబడిదారీ వ్యవస్థకు మనుగడ లేదు. వివిధ దేశాల సహజ వనరులను కొల్ల గొట్టటం, ప్రభుత్వాలను కూల్చటం, దురాక్రమణ యుద్ధాలు చేయటం, పెద్ద ఎత్తున ఆయుధ వ్యాపారం చేయటం కోసం దేశాల మధ్య తగవులు పెట్టటం దాని సహజ లక్షణం. వీటన్నిటినీ నేడు అమలు జరుపుతున్నది అమెరికా సామ్రాజ్యవాదం. గత 63 సంవత్సరాలుగా మొత్తం అమెరికా పారిశ్రామిక ఉత్పత్తిలో ఆయుధాల ఉత్పత్తే ముఖ్య భాగంగా ఉంది. ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌ఐపిఆర్‌ఐ) పరిశోధన ప్రకారం, అమెరికా ఆయుధ కంపెనీలు, రక్షణరంగ సేవ సంస్థలు అంతర్జాతీయ ఆయుధ అమ్మకాల్లో 37 శాతంతో అగ్రభాగాన ఉన్నాయి. ఆయుధాల మీద, రక్షణ రంగంమీద 2020లో అమెరికా చేసిన ఖర్చు 778 బిలియన్‌ డాలర్లు. మన రూపాయల్లో 58 లక్షల కోట్లు. ఆ తర్వాత 10 స్థానాల్లో ఉన్న దేశాలు చైనా, ఇండియా, రష్యా, సౌదీ అరేబియా, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇంగ్లండ్‌, జపాన్‌, దక్షిణ కొరియా, బ్రెజిల్‌. ఈ పది దేశాల ఆయుధ ఉత్పత్తి ఖర్చులు కలిపినా అమెరికా ఖర్చు కన్నా తక్కువ. అమెరికా మొత్తం ఖర్చులో 15శాతంపైగా ఆయుధ పరిశ్రమలకే ఖర్చు చేస్తున్నది. 2019లో దేశ రక్షణకోసం కేటాయించిన 716 బిలియన్‌ డాలర్లలో 686 బిలియన్‌ డాలర్లు (90శాతం) రక్షణ శాఖకే కేటాయించింది. 2023 నాటికి రక్షణ రంగ కేటాయింపులు 900 బిలియన్ల డాలర్లకు పెరిగింది. అమెరికా ఆయుధ ఉత్పత్తిలో 10శాతం కాంట్రాక్టు ఆయుధ నిర్మాణం, అంటే ఇతర దేశాల ప్రభుత్వాలకోసం, బహుళజాతి సంస్థల కోసం ఆయుధాలు ఉత్పత్తిచేసి ఇవ్వటం. ఆయుధ పరిశ్రమలో ఉద్యోగాలు నిలపటంకోసం నిరంతరం ఆయుధ ఉత్పత్తి జరుగుతుంది. ఈ ఆయుధాల విక్రయంకోసం ఇతర దేశాల అంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకోవటం, ఒక దేశం పైకి మరొక దేశాన్ని రెచ్చగొట్టి యుద్ధాలను సృష్టిస్తుంది.
అమెరికా పాలన, సైన్యం 1960 తర్వాత నుంచి ‘‘సైనిక పారిశ్రామిక కూటమి’’ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఈ సైనిక కూటమి ఏర్పడకముందే అమెరికా సైన్యం ఆ దేశ రక్షణ అవసరాలకోసం ప్రైవేట్‌ పరిశ్రమ మీద ఆధారపడేది. ఈ కూటమి ఏర్పడిన తర్వాత ప్రభుత్వ అవసరాలు తీర్చటం దానికీ అప్పగించటం జరిగింది. అమెరికా జరిపిన మారణకాండ సామ్రాజ్యవాద కాంక్షలకు, ఆధిపత్యానికి వ్యతిరేకంగా స్టాలిన్‌ నాయకత్వాన సోషలిస్టు శిబిరం ఏర్పడటం అమెరికాకు నిద్ర లేకుండా చేసింది. అనేక దేశాలకు విస్తరిస్తున్న కమ్యూనిజం వ్యాప్తిని అడ్డుకోవటానికి కమ్యూనిస్టు, సోషలిస్టు దేశాలపై దాడులకు పాల్పడిరది. 1950లో ఉత్తర కొరియాకి సైన్యాన్ని పంపింది. చైనా వైపుకు చొరబడేందుకు ప్రయత్నించింది. ఈ యుద్ధంలో అమెరికా ఓటమి చెందటమే కాకుండా 36 వేల మంది సైనికులను కోల్పోయింది. ప్రజా చైనా ఉత్తర కొరియాకు అన్ని రకాల తోడ్పాటును అందించింది. అమెరికా, దక్షిణ వియత్నాంలో కమ్యూనిస్టుల ఉద్యమాన్ని అణచివేతకు 5 లక్షల సైన్యాన్ని పంపింది. ప్రజలపైన, కమ్యూనిస్టు గెరిల్లా, సైనిక దళాలపైన పాశవిక దాడులతో అమెరికా అనేక అమానుషాలకు పాల్పడిరది. అమెరికా సైన్య దాడుల్లో 11లక్షలకుపైగా వియత్నాం ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 58 వేల అమెరికన్‌ సైనికులు హతులయ్యారు. ఈ యుద్ధంపై అమెరికా పెట్టిన ఖర్చు 686 బిలియన్‌ డాలర్లు. అప్పటి రూపాయి విలువ ప్రకారం 5.5 లక్షల కోట్లు. ఎంత మంది సైన్యాలను దింపినా, మారణహోమం సృష్టించినా, వందల బిలియన్ల డాలర్లు ఖర్చు చేసినా హోచిమిన్‌ నాయకత్వాన ఉన్న ప్రజా సైన్యం చేతిలో అమెరికా ఓడిపోక తప్పలేదు. 1975లో ఒకే వియత్నాం ఏర్పడిరది. ఇదే క్రమంలో లావోస్‌, కాంబోడియా దేశాల్లో కూడా సైనిక జోక్యం చేసుకుని ఓటమిచెంది అప్రతిష్ట పాలైంది. 1961లో క్యూబాలో ఫిడెల్‌ కాస్ట్రో ప్రజా ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర చేసింది. అంతర్గత పోరాటం సృష్టించేందుకు ప్రభుత్వ వ్యతిరేక ఉగ్రవాదులకు సహాయంచేసి దేశంలో అస్థిర పరిస్థితులు సృష్టించేందుకు ప్రయత్నించి విఫలమైంది.
అనేక దేశాల్లో అమెరికా కుట్రలు: కమ్యూనిస్టుల పోరాటాల అణచివేతకు సైనిక జోక్యం చేసుకోవటమే కాకుండా, తన మాట వినని దేశాల్లోని ప్రభుత్వాల కూల్చివేతకు పాల్పడి, సైనిక దాడులుచేసి ఆక్రమించింది. 2003లో ఇరాక్‌పై సైనిక దాడిచేసి, ఆ దేశాన్ని ఆక్రమించి, దేశాధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌ను చంపింది. ఈ దాడిలోను, దాడి తర్వాత పరిణామాల్లో 4లక్షల, 61 వేల మంది ఇరాక్‌ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 247 లక్షల కోట్ల నష్టం జరిగింది. అమెరికా అధ్యకుడు డబ్ల్యు బుష్‌ అఫ్ఘానిస్తాన్‌, ఇరాక్‌ దేశాలలో యుద్ధాలు మొదలు పెట్టగా, ఆ తర్వాత బరాక్‌ ఒబామా వాటిని కొనసాగిస్తూ లిబియా, సిరియా, యెమెన్‌ దేశాల్లో పరోక్షంగాను, ప్రత్యక్షంగా యుద్ధాలు చేశాడు. డొనాల్డ్‌ ట్రంప్‌, జో బైడన్‌ యుద్ధాలను వివిధ రూపాల్లో కొనసాగించారు. అమెరికా 20 సంవత్సరాలపాటు అఫ్ఘానిస్తాన్‌ను దురాక్రమణ చేసింది. ఫలితంగా ఆ దేశ ఆర్ధికవ్యవస్థ పూర్తిగా పతనమైంది. నేడు సగం జనాభా దారిద్య్రంలో మగ్గుతున్నారు. ఉక్రెయిన్‌, రష్యా మద్య జరుగుతున్న యుద్ధం అమెరికా దుష్ట పన్నాగ ఫలితమే. ఈ యుద్ధం ఆగకుండా అమెరికా, నాటో దేశాలు ఉక్రెయిన్‌కు సహకరిస్తున్నాయి.
అమెరికా జరిపిన అనేక దురాక్రమణ యుద్ధాల్లో 45 లక్షల మంది చనిపోయారని బ్రౌన్‌ విశ్వవిద్యాలయ 2023 మేలో విడుదల చేసిన ‘‘యుద్ధం ఖరీదు’’‘ అనే రీసెర్చ్‌ ప్రాజెక్టు నివేదిక పేర్కొంది. ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధం స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, మానవహక్కుల కోసమని అమెరికా చేస్తున్న ప్రచారం మోసమని ఈ నివేదిక తేటతెల్లం చేసింది. భూగ్రహం మీద అత్యంత హింసను మారణకాండను సృష్టించింది అమెరికా మాత్రమే. యుద్ధాలకు, లక్షలాది ప్రజల మరణాలకు అమెరికా సామ్రాజ్యవాద ప్రపంచ ఆధిపత్య ధోరణే కారణం. అమెరికా సామ్రాజ్యవాదం ఉన్నంత కాలం యుద్ధాలు కొనసాగుతూ లక్షల ప్రజల ప్రాణాలు కోల్పోతూనే ఉంటారు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రపంచం పోరాడి దాన్ని ఓడిరచినప్పుడే యుద్ధాలు ఆగుతాయి. ప్రపంచ ప్రజల శాంతి కోసం సామ్రాజ్యవాదం అంతం కావాలి.
సెల్‌: 9885983526

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img