Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 13, 2024
Friday, September 13, 2024

రుణాల మాఫీ కార్పొరేట్లకే

డా॥ జ్ఞాన్‌పాఠక్‌

బ్యాంకులకు కార్పొరేట్లు, బడా వాణిజ్యవేత్తలు చెల్లించవలసిన బకాయిలు ఇప్పుడు గణనీయంగా తగ్గిపోయాయని మోదీ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. 2014 లో తాము అధికారంలోకి వస్తే బ్యాంకుల్లో అప్పులు తీసుకొన్న వారి నుంచి పూర్తిగా వసూలు చేస్తామని హామీ ఇచ్చారు. ఆర్థిక మంత్రిత్వశాఖ సహాయమంత్రి పంకజ్‌చౌదరీ ఇటీవల రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పిన విషయమే మోదీ ప్రచారం అబద్ధమని స్పష్టం చేస్తోంది. 202324 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులకు చెల్లించవలసిన రుణాల మొత్తం 1.70 లక్షల కోట్లు ఉందని తెలిపారు. 2014 ఏప్రిల్‌లో మోదీ ప్రధానమంత్రిగా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి 2024 మార్చి చివరి వరకు 14.56 లక్షల కోట్ల రూపాయలు రద్దు చేశారు. బడా కార్పొరేట్లు పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకే ఈ బకాయిలను రద్దు చేశారు. చిన్న చిన్న రైతులు లేదా సామాన్య ప్రజలు అప్పులు తీసుకుని గడువు లోపల చెల్లించకపోతే వారి ఇళ్లకు వెళ్లి నానా గందరగోళం చేసి ఇంట్లో ఉన్న వస్తువులను బయట విసిరివేస్తారు. కార్పొరేట్ల జోలికి ప్రభుత్వాలు వెళ్లవని చెప్పడానికి బ్యాంకులకు చెల్లించవలసిన బకాయిలే స్పష్టం చేస్తున్నాయి. గత సంవత్సరం కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి భగవత్‌కరాద్‌ లోక్‌సభలో రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో, షెడ్యూల్డు వాణిజ్య బ్యాంకులకు 201415 వ సంవత్సరం నుంచి 14.56 లక్షల కోట్లు రద్దు చేసినట్టు తెలిపారు. మొత్తం రద్దు చేసిన బకాయిలలో 7.40 లక్షల కోట్లు భారీ పరిశ్రమలు, సర్వీసు సంస్ధల బకాయిలు ఉన్నాయి. 202324 సంవత్సరంలో వసూలు చేసిన మొత్తం కేవలం 46 వేల 36 కోట్ల రూపాయలు మాత్రమే. అలాగే 201415 నుంచి 202223 వరకు వసూలు చేసిన బకాయిల మొత్తం 2.04 లక్షల కోట్లు మాత్రమే. అంటే గత సంవత్సరం వరకు కేవలం 2.50 లక్షల కోట్లు మాత్రమే వసూలైంది. దీని అర్థం 201415 నుంచి మోదీ పాలనా కాలంలో 13.76 లక్షల కోట్లు బడా బాబులకు రద్దు చేశారు. మోదీ ఎవరి కోసం పరిపాలిస్తున్నట్టు? కార్పొరేట్ల కోసమా! ఓట్లు వేసే ప్రజలను ఏమాత్రం పట్టించుకోవడంలేదని ఈ విషయం స్పష్టం చేస్తోంది.
అధికారంలో ఉన్న రాజకీయనాయకులు, ప్రభుత్వ అధికారులు, కార్పొరేట్లు బడా వాణిజ్యవేత్తలు, పారిశ్రామికవేత్తలు కుమ్మక్కై షెడ్యూల్డు వాణిజ్యబ్యాంకులలో ఉన్న డిపాజిట్లను కైంకర్యం చేస్తున్నారు. ప్రస్తుత కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ ఇటీవల నూతన విధానాలను అమలు చేయడం ద్వారా ప్రజల నుంచి డిపాజిట్లు సమీకరించాలని, తద్వారా డిపాజిట్లు, రుణాలు ఇవ్వటం మధ్య ఉన్న అంతరాన్ని అధిగమించేందుకు ఉపయోగపడాలని కోరారు. ఎన్నో ఆశలతో, అవసరాలకు ఉపయోగపడతాయని బ్యాంకుల్లో కష్టార్జితాన్ని డిపాజిట్లు చేసుకున్న వారి డబ్బును కార్పొరేట్లకు, బడా పారిశ్రామికవేత్తలకు, వాణిజ్యవేత్తలకు కట్టబెడుతున్న మోదీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని డిపాజిట్‌దారులు భావించడంలో ఎలాంటి తప్పులేదు. ఆగస్టు 10 వ తేదీన రిజర్వుబ్యాంకు సెంట్రల్‌బోర్డు డైరెక్టర్ల సమావేశంలో ఆర్థికమంత్రి సీతారామన్‌ మాట్లాడుతూ నూతన, ఆకర్షణీయమైన పథకాలను రూపొందించి ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించాలని కోరారు. ఆగస్టు 8 వ తేదీన ఆర్బీఐ గవర్నరు శక్తికాంతదాస్‌ మాట్లాడుతూ డిపాజిట్లు` ఇస్తున్న రుణాలకు మధ్య అంతరం పెరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ఇతర సమస్యలను కూడా ప్రస్తావిస్తూ ఈ పరిస్థితి బ్యాంకుల వ్యవస్థ నిర్మాణమే దెబ్బతింటుందని అన్నారు. అందువల్ల బ్యాంకులు డబ్బు పొదుపు చేసుకోవాలని ప్రజల్లో ప్రచారం చేస్తూ డిపాజిట్‌లు పెంచాలని కోరారు. బ్యాంకింగ్‌ వ్యవస్థ సంక్షోభంలో పడిరదని కేంద్ర ఆర్థికమంత్రి, ఆర్బీఐ గవర్నరు బ్యాంకులకు చేసిన విజ్ఞప్తులే రుజువు చేస్తున్నాయి.
ప్రజల దగ్గర బ్యాంకుల్లో డిపాజిట్లు చేయడానికి మిగులు ధనం ఉండటంలేదు. అందువల్లనే డిపాజిట్లు తక్కువగా వస్తున్నాయి. బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లను డిపాజిట్లపై చెల్లిస్తున్నాయి. ఎక్కువగా ఉన్న ద్రవ్యోల్బణం రేటు తగ్గకపోవటానికి బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లను ఇవ్వడమే ప్రధాన కారణం. బడా బాబులకి ఇచ్చే రుణాలు తిరిగి రాకపోవటం వల్ల ప్రజలు తమ డిపాజిట్లను కోల్పోతున్నారు. ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ ఒక సమావేశంలో మాట్లాడుతూ డిపాజిట్లపై వడ్డీరేట్లను బ్యాంకులే నిర్ణయించటానికి స్వేచ్ఛ ఉంది, 2019 నవంబరులో పెద్ద నోట్లను రద్దు చేసిన నాటి నుంచి ప్రజలు బ్యాంకింగ్‌ వ్యవస్థ మీద గణనీయంగా విశ్వాసాన్ని కోల్పోయారని చెప్పారు. డిపాజిట్‌దార్లకు అవసరమైనప్పుడు తిరిగి చెల్లించకపోతే బ్యాంకులపై విశ్వాసం ఉంటుందని ఎలా భావిస్తారు? అపర ధనవంతులు తమ డబ్బుకు భద్రత ఉండటం కోసం అనేక మార్గాలు వెతుకుతారు. భూములు, బంగారం కొనుగోలు చేస్తారు. పేదలు, సామాన్యులు తప్పించుకోలేని ఖర్చు వచ్చి నప్పుడు తీవ్ర ఇబ్బందులకు లోనవుతారు. ప్రత్యేకించి ఆరోగ్యం, ఆహారం కోసం అధికంగా మన దేశంలో ఖర్చుపెడుతున్నారు. ప్రభుత్వం ఆరోగ్యం, ఆహార భద్రతను కల్పించడంలో ప్రభుత్వం విఫలం కావడం వల్లనే ప్రజలు ఎనలేని ఇబ్బందులు పడుతున్నారు.
ప్రజలు తమకు అవసరమైనప్పుడు బ్యాంకులనుంచి డబ్బు తీసుకునేందుకు ఎకౌంట్లలో పెద్దగా ఉండటంలేదు. అయినప్పటికీ మోదీ ప్రభుత్వం తమనుఏమాత్రం పట్టించుకోవటంలేదని ప్రజలు భావిస్తున్నారు. జనాన్ని పట్టించుకోకుండా మోదీ ప్రభుత్వం డిపాజిట్లను దుర్వినియోగం చేస్తున్నది. బ్యాంకులలో ఉన్న డిపాజిట్ల డబ్బు ఎక్కువ భాగం కార్పొరేట్లు, బడా వాణిజ్యవేత్తలు, పారిశ్రామికవేత్తలు రుణాలుగా తీసుకుని తిరిగి చెల్లించటం లేదు. వారు చెల్లించకపోయినా ఆ డబ్బును కొంతకాలానికి కేంద్రప్రభుత్వం రిజర్వుబ్యాంకు ద్వారా రద్దు చేస్తున్నది. అంటే డిపాజిట్‌ దార్ల పట్ల మోదీ ప్రభుత్వానికి ఏమాత్రం కనికరం కూడా ఉండటంలేదు. షెడ్యూల్డు వాణిజ్య బ్యాంకులలో నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు) చాలా ఎక్కువగా ఉంటున్నాయి. 2024 మార్చి 31 నాటికి ఈ నిరర్థక ఆస్తులు షెడ్యూలు వాణిజ్య బ్యాంకులలో 4.80 లక్షల కోట్లు ఉన్నాయని ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్‌చౌదరి రాజ్యసభలో వెల్లడిరచారు. ఇదే కాలంలో 1.70 లక్షల కోట్లు రద్దు చేసినట్టు చెప్పారు. అయితే గత ఐదేళ్లలో షెడ్యూల్డు వాణిజ్య బ్యాంకులలో ఎన్‌పీఏలు క్రమంగా తగ్గుతున్నాయని ఆయన తెలిపారు. గత ఐదేళ్ల కాలంలో 9.9 లక్షల కోట్లు రద్దు చేశారని కేవలం 1.84 లక్షల కోట్లు మాత్రమే వసూలు చేశారని తెలిపారు. ఈ విషయాలేవీ సామాన్య ప్రజలకు తెలియకుండా దాచిపెట్టటమేకాక మోదీ ప్రభుత్వం అబద్ధాలమారిగా తయారయ్యింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img