భారతదేశ వ్యవసాయ కుటుంబాల సగటు నెలసరి ఆదాయం (2019లో) రూ. 10,212లు కాగా దీనిని బట్టి చూస్తే దినసరి కుటుంబ సగటు ఆదాయం కేవలం రూ.336లు మాత్రమే. మనదేశంలో రైతులు, రైతు కుటుంబాల దీనస్థితిని ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా వ్యవసాయ కుటుంబాల సగటు రుణాలు 2013లో రూ.47,000 ఉండగా, 2019లో ఇవి రూ.74,121 లకు పెరిగాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో సగటు కుటుంబ రుణ భారం ఒక లక్ష కన్న అధికంగా ఉంది. భూమి లేని అభాగ్యులతో పాటు చిన్న సన్నకారు రైతు కుటుంబాలు 82.9 శాతం అప్పుల బాధల్లో కూరుకుపోయి ఉన్నాయి. ‘వ్యవసాయ కుటుంబాల సాగు భూమి, పశుసంపద – గ్రామీణ కుటుంబాల స్థితిగతుల’పై జరిగిన సర్వే ఫలితాలివి. జాతీయ గణాంక కార్యాలయం ఇటీవల విడుదల చేసిన ఈ 77వ సర్వే ఫలితాల్లో ఒక్కటీ ఆశాజనకమైన విషయం లేదు. అన్నీ ఆవేదన కలిగించేవే. గ్రామీణ కుటుంబాల్లో 35 శాతం, పట్టణ కుటుంబాల్లో 4 శాతం రుణ భారం మోస్తున్నట్టు ఈ సర్వే వెల్లడిరచింది. గ్రామీణ వ్యవసాయ గృహాల్లో 57.5 శాతం రుణాలు వ్యవసాయం కోసం తీసుకున్నవే. 2019లో 69.6 శాతం రుణాలను ప్రభుత్వరంగ బ్యాంకులు, సహకార సంఘాలు, ప్రభుత్వ సంస్థల నుంచి తీసుకున్నారు. గ్రామీణ రైతు కుటుంబాల్లో 20.5 శాతం మంది ప్రైవేటు వ్యక్తుల నుంచి అధిక వడ్డీకి రుణాలు పొందారు. 2019లో (జనవరి నుంచి డిసెంబర్ మధ్యకాలంలో) నిర్వహించిన ఈ సర్వేలో భూ యజమానులు, కౌలుదారులు, పశు సంపద కలిగిన వారి (బర్రెలు, ఆవులు, మేకలు, గొర్రెలు లాంటివి) ఇతర వేతనాలు/ఉపాధులు చేసే కుటుంబాల ఆదాయాలను పరిగణలోకి తీసుకున్నారు. సాగు పద్ధతులు, సాగులో సాంకేతిక పరిజ్ఞాన వినియోగాలు, వ్యవసాయేతర ఆదాయాలు (పువ్వులు, చేపలు, పందులు, తేనెటీగలు, వానవాముల వ్యాపారం, పట్టు పరుగులు లాంటివి) కూడా అధ్యయనంలో భాగం అయ్యాయి. మన (దేశవ్యాప్తంగా) నేలలపై అధికంగా పండిరచే 25 పంటలను (వడ్లు, జొన్నలు, మక్కులు, రాగులు, గోధుమలు, బార్లీ, పప్పు ధాన్యాలు, చెరుకు, పొటాటో, పశుగ్రాసాల పంటలు, ఫౌల్ట్రీ, ఉల్లి గడ్డలు, పల్లీలు, కొబ్బరి, పొద్దు తిరుగుడు, సోయా బీన్, పత్తి, జూట్ లాంటివి) ఈ సర్వేలో జోడిరచారు. దేశవ్యాప్తంగా వరి (38 శాతం), గోధుమ పంటలను అత్యధికంగా పండిస్తున్న రైతులు కొంచెం మంచి ఆదాయాలను గడిస్తున్నారు.
భారతదేశ వ్యవసాయ కుటుంబాల సగటు నెలసరి ఆదాయం 2019లో రూ.10,212లుగా ఈ సర్వేలో అంచనా వేశారు. అంటే రోజుకి ఈ కుటుంబాల సగటు ఆదాయం రూ. 336లు మాత్రమే. 2013లో నిర్వహించిన సర్వే ప్రకారం కుటుంబాల సగటు నెలసరి ఆదాయం రూ. 6,442లు ఉంది. ఈ నెలసరి ఆదాయంలో వ్యవసాయ ఉత్పత్తుల నుంచి రూ.3,798, ఇతర వేతనాలు/ఉపాధుల రూపంలో రూ. 4,063, పాడి పశు సంపద నుంచి రూ.1,582, ఇతర ఆదాయం రూ.641, భూమి కౌలు నుంచి రూ. 134లు వస్తున్నట్టు తేల్చారు. కుటుంబ వ్యవసాయ ఆదాయం సగటున 52.65 శాతం ఉండగా, అందులో 37.17 శాతం పంటల ఆదాయం, 15.48 శాతం పశు సంపద ఆదాయం వస్తున్నది. దేశంలోని 9.3 కోట్ల వ్యవసాయ కుటుంబాల్లో 45.8 శాతం ఓబిసిలు, 15.9 శాతం యస్‌సిలు, 14.2 శాతం యస్‌టీలు, 24.1 శాతం ఇతరులు ఉన్నారు. గ్రామీణుల్లో 5 శాతం కుటుంబాలకు ఒక హెక్టార్ కన్న తక్కువ భూమి ఉందని, 0.2 శాతం గృహాలకు 10 హెక్టార్ల కన్న ఎక్కువ సాగు భూమి ఉందని వెల్లడిరచింది. గ్రామీణ కుటుంబాల్లో 10 ఎకరాల పైగా భూమి కలిగిన కుటుంబాల వారి ఆదాయం రూ. 30,000 ఉండగా, 1-2.5 ఎకరాల భూమి కలిగిన చిన్న సన్నకారు రైతు కుటుంబాల నెలసరి ఆదాయం రూ. 8,571గా నమోదైంది. 2013 నుంచి 2019 వరకు రైతు కుటుంబాల ఆదాయం 59 శాతం వృద్ధి చెందినట్టు ఈ సర్వే ఫలితాల్లో పేర్కొన్నారు.
మేఘాలయ, పంజాబ్, హర్యానా లాంటి రాష్ట్రాల్లో రైతు కుటుంబాల ఆదాయం అత్యధికంగా ఉండగా రaార్ఖండ్, బీహార్, ఒడిసా, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్‌లాంటి రాష్ట్రాల్లో కుటుంబఆదాయాలు అతితక్కువగా ఉండడం గమనించారు. తెలుగురాష్ట్రాల రైతుకుటుంబాలు అధికంగా రుణాలు తీసు కుంటూ సాగుబడిని సాగిస్తున్నారు. పంజాబ్ రైతుకుటుంబాల సగటు నెలసరి ఆదాయం రూ.26,701లుకాగా, మేఘాలయలో రూ.29,348, హర్యానాలో రూ.22,841లుగా నమోదైంది. రaార్ఖండ్‌లో నెలసరి ఆదాయం రూ.4,895, బీహార్‌లో రూ.7,542, ఒడిసాలో రూ.5,112, పశ్చిమబెంగాల్‌లో రూ.6,762, యూపీలోరూ.8,061లు ఆదాయం పొందు తున్నారు. గత సర్వే ఫలితాలతో పోల్చితే రాష్టాల సగటు ఆదాయ అభివృద్ధి బీహార్ (13.34 శాతం), ఉత్తరాఖండ్ (19.3 శాతం) రాష్ట్రాల్లో అభివృద్ధి రేటు అత్యధికంగా నమోదు కాగా రaార్ఖండ్ (0.61 శాతం), ఒడిసా (0.45 శాతం), పంజాబ్ (6.73 శాతం)లలో అభివృద్ధి రేటు తక్కువగా కనబడిరది.
నేడు అధికంగా ఉన్న చిన్న సన్నకారు రైతులకు ప్రభుత్వ చేయూత అవసరమైనంతగా అందడం లేదు. ఈ విషయంలో ప్రభుత్వాలు మెరుగైన చర్యలు తీసుకోవాలి. భూ పట్టాలను అర్హలందరికీ ఇవ్వాలి. రైతులతో పాటు కూలీలకు కూడా ప్రభుత్వాలు ప్రత్యేక కార్డులను జారీ చేసి, ఆర్థిక వెలుసుబాటు పథకాలను మరింత వేగంగా అందించాలి.
డా. బుర్ర మధుసూదన్ రెడ్డి, 9949700037