డా.జ్ఞాన్‌పాఠక్
తయారీ రంగంపై దృష్టి కేంద్రీకరించే దిశగా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం పది సంవత్సరాలు పూర్తి చేసుకుంది. భారత్‌ను అంతర్జాతీయ తయారీ కేంద్రంగా అభివృద్ధి చేయడమే దీని ఉద్దేశం. భారత్‌కు వచ్చి ఉత్పత్తులు చేపట్టాలని ఈ కార్యక్రమం ద్వారా ప్రధాని మోడీ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. అయితే 2014 సెప్టెంబరులో చేపట్టిన ఈ కార్యక్రమం గత దశాబ్ద కాలంలో విఫలమైంది. లక్ష్యానికి చాలా దూరంగా ఉంది. అనుకూలంగా ఉన్న అంతర్జాతీయ పరిస్థితులను కూడా తనకు అనుకూలంగా మలుచుకోలేకపోయింది. తయారీ రంగంలో పెట్టుబడులను పెంచలేకపోయింది. దేశంలో సరళతరమైన వాణజ్యం పెంపుదలకు మేకిన్ ఇండియా పథకాన్ని ప్రవేశపెట్టినప్పటికీ నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ విషయంలో విఫలమైంది.సరళతరమైన వాణిజ్య కేంద్రంగా దేశాన్ని అభివృద్ధి చేస్తానని ప్రధాని మోదీ ప్రకటించినప్పటికీ అది ఇంతవరకు నెరవేరలేదు. దేశంలో సరళతర వాణిజ్యం కిందకు అనేక పథకాలను ప్రవేశపెట్టారు. వివిధ రకాల చొరవలను సమన్వయపరచి పెంపొందిచడానికి పరిశ్రమల ఇంటర్నల్ ట్రేడ్ ప్రమోషన్ డిపార్ట్‌మెంట్‌ను (డీపీిఐఐటీి) నోడల్ డిపార్టుమెంటుగా ఏర్పాటు చేశారు. ఇది కొన్ని ఫలితాలను సాధించింది. ప్రపంచ బ్యాంకు వాణిజ్య నివేదిక (డీబీఆర్) ప్రకారం ఇండియా రాంక్ పెరిగింది. 2014లో సరళతర వాణిజ్యంలో 142వ ర్యాంక్‌కు భారతదేశం చేరింది. అనంతరం స్వల్పంగా పెరుగుతూ వచ్చినప్పటికీ లక్ష్యసాథóనకు దూరంగా ఉండిపోయింది.
201415లో విదేశీ పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) 45.15 బిలియన్లు ఉండగా, 2019
20 నాటికి 74.39బిలయన్ల డాలర్లకు చేరింది. సరళతర వాణిజ్యాన్ని పెంపొందించడానికి అనేక చర్యలు తీసుకున్నది. సులభతరం, ఇప్పుడున్న కార్యక్రమం నియంత్రణ, వాణిజ్యం ప్రారంభంలో సంస్కరణలు, పన్నుల చెల్లింపు, ఇతర దేశాలలో వాణిజ్యం, దివాలాను పరిష్కరించడం లాంటి చర్యలు తీసుకున్నది.
పెట్టుబడులు పెట్టగలిగినవారిని గుర్తించి తగిన సౌకర్యాలను కేంద్ర ప్రభుత్వం కల్పిస్తూనేఉంది. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు అనేక ఈవెంట్లను నిర్వహిస్తున్నాయి. అలాగే రోడ్‌షోలు, ఇతర కార్యకలాపాలను మేకిన్ ఇండియా పథకం కింద నిర్వహిస్తున్నారు. ఎఫ్‌డీఐలను పెంపొందించడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. అయినప్పటికీ మేకిన్ ఇండియా పథకాలు పెద్దగా వృద్ధి చెందలేదు. వివిధ మంత్రిత్వశాఖల పరిధిలో జీఎస్‌టీ, ఆర్థిక మార్కెట్‌లలో సంస్కరణలు, ప్రభుత్వరంగ బ్యాంకులలో చర్యలు, నాలుగు కార్మిక కోడ్‌ల ఏర్పాటు, వివిధ రంగాలలో సంస్కరణలు తదితర చర్యలు ప్రభుత్వం చేపట్టింది. కోవిడ్19 సంక్షోభం తలెత్తిన కాలంలో ఇవన్నీ ఎందుకు ఉపయోగపడలేదు. అప్పుడు ఉత్పత్తి అనుసంధాన పథకాలు, ఆత్మనిర్భర్ ప్యాకేజీల కింద ప్రవేశపెట్టారు. సింగిల్ విండో వ్యవస్థ తదితరాలను ప్రభుత్వం ప్రారంభించినప్పటికీ ఎఫ్‌డీఐలు పెద్దగా పెరగలేదు. 2020
21 ఆర్థిక సంవత్సరంలో 81.97 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు మాత్రమే దేశంలోకి వచ్చాయి. 2022 సెప్టెంబరు నాటికి విదేశీ పెట్టుబడులు అత్యంత తక్కువగా వచ్చాయి. ప్రభుత్వం మాత్రం మేకిన్ ఇండియా మంచి ఫలితాలను తెచ్చిపెట్టిందని బొంకుతోంది. ఏ మాత్రం నిజంలేని ఈ అంశాన్ని విస్త్రతంగా ప్రచారం చేస్తోంది. ఆర్థికవృద్ధి పెంపొందించాలని ప్రభుత్వం తలపెట్టింది. ఈ మార్గంలో యువతకు భారీగా ఉద్యోగాలు సృష్టిస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ అది ఏమాత్రం సాధ్యంకాలేదు. విదేశీ పెట్టుబడులు 2021`22 నాటికి కేవలం 83.57 బిలియన్ డాలర్లకు మాత్రమే చేరింది. ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విదేశీ పెట్టుబడులు రానేలేదు. విదేశీ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు భారంగా తయారవుతున్నాయని భావించాయి.
కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పియూష్‌గోయెల్ మాట్లాడుతూ, మేడిన్ ఇండియా పథకం కింద మరో మూడువందల న్యాయపరమైన అంశాలను, ఉత్పత్తి రంగాలను మరింతగా పెంపొందించడానికి జనవిశ్వాస్ 2.10 పథకాన్ని ప్రవేశపెట్టినట్టు చెప్పారు. విద్యుత్, ఇంటర్నెట్, తరచుగా ఆగిపోతున్నాయి. హింసాకాండ పెరగడం, ఇంటర్నెట్ తరచుగా నిలిపివేయడం, హింసాకాండ పెరగకుండా ఇంటర్నెట్ సౌకర్యాన్ని నిలిపివేయడం, ఆన్‌లైన్ పరీక్షాపత్రాలలో ప్రశ్నలు లీకవడం, పరిశ్రమలు, మార్కెట్ల మూసివేత తదితర ఆటంకాలు ఉత్పత్తిని పెరగకుండా చేస్తున్నాయి. తగిన చట్టాలను తీసుకురావడం, వాటిని న్యాయంగా అమలుచేయడం తదితర కార్యక్రమాలను అమలుచేయడం పాలకవర్గాల బాధ్యత. ఈ విషయంలో ప్రతిపక్షాలుచేస్తున్న డిమాండ్‌లను ప్రభుత్వం పెద్దగా పట్టించుకోకపోవడం కూడా మేకిన్ ఇండియా లాంటి పథకాలు వృద్ధి చెందడం లేదు. నాలుగు లేబర్‌కోడ్‌లను తీసుకువచ్చేముందు ట్రేడ్ యూనియన్లతో అవసరమైన విధంగా చర్చలు జరపలేదు. మేలైన పారిశ్రామిక సంబంధాలు, శాంతియుతమైన సామాజిక వాతావరణం ఉన్నట్లయితే దేశంలో అభివృద్ధి వేగంగా జరుగుతుంది. ఇందుకు భిన్నంగా జరుగుతున్పప్పుడు వాణిజ్యం, పరిశ్రమలు దెబ్బతింటాయి. కార్మికవర్గానికి సామాజిక భద్రత లేనప్పుడు సామాన్య ప్రజలు ఏ విషయంలోనూ విజయం సాధించలేరు. సరళతర వాణిజ్యం కేవలం లాభాలను సంపాదించడానికి మాత్రమేకాదు, ఇందులో సామాజిక భద్రత, మానవ సంక్షేమ కార్యకలాపాలు ఉన్నప్పుడే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది.