ఇప్పుడు నాగపూర్‌లో ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయం చెప్పినట్లు వినవలసిందే. మోదీ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం హిందు ఉద్యోగులు ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరవచ్చు. ముస్లిం ఉద్యోగులు ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరడానికి వీలులేదు. ఈ వివక్ష అన్ని రంగాలలో ఉంది. ఇప్పటికే మోదీ ప్రభుత్వం ముస్లింలపై వివక్షచూపడం, విద్వేషం ప్రచారం చేయడం చాలా ఎక్కువగా ఉంది. తాము ఆ పనిచేయడంలేదని మోదీ అబద్ధాలు చెప్పడం బాగా అలవాటైంది.
అరుణ్ శ్రీవత్సవ
ప్రభుత్వ ఉద్యోగులు ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరకూడదని 44ఏళ్లక్రితం విధించిన నిషేధాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉపసంహరించింది. ఇకపైన ప్రభుత్వ ఉద్యోగులు ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాలలో పాల్గొనవచ్చు. మహాత్మాగాంధీని ఆర్‌ఎస్‌ఎస్ సభ్యుడు గాడ్సే కాల్చి చంపిన తర్వాత మొదటిసారి 1948 ఫిబ్రవరి 4న అప్పటి హోం మంత్రి వల్లభాయ్ పటేల్ నిషేధం విధించారు. ఇప్పుడు ఆర్‌ఎస్‌ఎస్‌ను, దాని అధినేత మోహన్ భగవత్‌ను మచ్చిక చేసుకుని ఎన్నికల్లో తమకు సహకరించడం కోసమే నిషేధాన్ని ఉపసంహరించినట్లు భావిస్తున్నారు. ఇంతేకాదు, మరింత ప్రమాదరకమైన స్థానాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌కు కట్టబెడుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపేందుకు, జోక్యం చేసేందుకు, నిర్ణయాలు తీసుకునేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌పై నిషేధం ఎత్తివేశారు. మోదీ ప్రభుత్వ వ్యూహాల్లో మరిన్ని ప్రమాదకరమైన ఆలోచనలు ఉండవచ్చు. వారంలో మోదీ తీసుకున్న కీలక నిర్ణయంలో ఇది రెండవది. భగవత్‌ను తనకనుకూలంగా మార్చుకునేందుకు, ఆర్‌ఎస్‌ఎస్‌కు అత్యంత దుర్భేద్యమైన ప్రభుత్వం యంత్రాంగంలో చొరబడేందుకు అవకాశం కల్పించడం రెండో అంశం. 1980లో ఇందిరాగాంధీ ప్రభుత్వం విధించిన నిషేధాన్ని తొలగిస్తూ 2024 జులై 9న మోదీ ప్రభుత్వం నోటిఫికేషన్‌ను జారీచేసింది. ఈ చర్య పరిపాలనా మౌలిక లక్షణాన్ని సమూలంగా మారుస్తుంది. నిర్ణయం తీసుకునే క్రమం తీవ్ర ముప్పునకు గురవుతుంది. ఇప్పుడు పాలనా నిర్ణయాలు రూపొందించడం, వివిధ కార్యకలాపాల విషయంలో ఆర్‌ఎస్‌ఎస్ మాట చెల్లుతుంది. హిందూ మహాసభతో అనుబంధం గలిగిన ఆర్‌ఎస్‌ఎస్ ‘‘తీవ్రవాద సంస్థ’’గా నిర్థారించి నిషేధం విధించారు. దేశానికి, ప్రభుత్వానికి ఇది అత్యంత ప్రమాదకరమైందని పటేల్ నిర్ణయించుకొని నిషేధం పెట్టారు. ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు, నాయకుల ప్రసంగాలు ‘‘పూర్తి మతపూరిత విషం’’ అని పేర్కొంటూ ఆ సంస్థ అధినేత గోల్వాల్కర్‌కు పటేల్ లేఖ రాశారు. ఈ కారణం వల్లనే నిషేధం విధించినట్లు తెలిపారు. రాజ్యాంగానికి, జాతీయ పతాకానికి కట్టుబడి ఉంటామని, రాజకీయాలకు దూరంగా ఉంటామని, సామాజిక, సాంస్కృతిక సంస్థగా ఉంటామని గోల్వాల్కర్ వాగ్దానం చేశారు. దీంతో 1949 జులై 11న నిషేధాన్ని తొలగించారు.
నిషేధం విధించడం ఇది తొలిసారి కాదు. చివరిసారి కాదు. ఆ తర్వాత మూడుసార్లు ఆర్‌ఎస్‌ఎస్‌పై నిషేధం విధించారు. నిషేధం ఎత్తివేసిన ప్రతిసారి ‘‘మంచి బాలుడి’’గా ఉంటామని వాగ్దానం చేస్తున్నారు. హామీలను ఉల్లంఘించడం మామూలే అయింది. తాజాగా తీసుకున్న నిషేధం ఎత్తివేత అనేక ప్రమాదకరమైన పరిణామాలకు దారి తీస్తుంది. ప్రభుత్వ విధానాలను సైతం రూపొందించడానికి అనుమతి ఇచ్చినందున దేశానికి ఎంతటి ప్రమాదరక పరిణామాలు చోటుచేసుకుంటాయోనని భీతిల్లచేస్తోంది. ఇకపై ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా ఆర్‌ఎస్‌ఎస్‌ను సంప్రదించి అనుమతి తీసుకోవలసిన అవకాశం ఉండవచ్చు. ఈ పదేళ్లలో ఆర్‌ఎస్‌ఎస్ చెప్పినట్టు వినడానికి అధికారులు ఇబ్బంది పడేవాళ్లు. ఇప్పుడు నాగపూర్‌లో ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయం చెప్పినట్లు వినవలసిందే. మోదీ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం హిందు ఉద్యోగులు ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరవచ్చు. ముస్లిం ఉద్యోగులు ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరడానికి వీలులేదు. ఈ వివక్ష అన్ని రంగాలలో ఉంది. ఇప్పటికే మోదీ ప్రభుత్వం ముస్లింలపై వివక్షచూపడం, విద్వేషం ప్రచారం చేయడం చాలా ఎక్కువగా ఉంది. తాము ఆ పనిచేయడంలేదని మోదీ అబద్ధాలు చెప్పడం బాగా అలవాటైంది. తమది అతి పెద్ద సాంస్కృతిక సంస్థ అని సంఫ్‌ుపరివార్ చెప్పుకుంటోంది. భవిష్యత్‌లో ఎన్నికల్లో గెలవడానికి, హిందురాష్ట్ర ఏర్పాటుకు ఇప్పటినుంచే ఈ వ్యూహం పన్నారు. సెక్యులర్ ప్రభుత్వం అనేమాట మరిచిపోవలసిందే. ప్రభుత్వ యంత్రాంగం, మిలిటరీ విభాగాలు ఆర్‌ఎస్‌ఎస్‌కు అడ్డంకులుగా నిలిచాయి. ఈ రెండు ఇప్పుడు ఆర్‌ఎస్‌ఎస్ ఆదేశాలను పాటించవలసిందేనని మోదీ ఉత్తర్వులు తెలియజేస్తున్నాయి. హిందూ రాష్ట్ర ఏర్పాటు తేలిక అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. హిందూ జాతీయతకు దారి తీస్తుంది. రాజ్యాంగంలో పొందుపరచిన ఇండియా జాతీయతకు హిందూ జాతీయత పూర్తి విరుద్ధమైంది. ఇంతవరకు ప్రభుత్వ ఉద్యోగులు ఆర్‌ఎస్‌ఎస్‌కు సహకరించేవారు కాదు.
ఇప్పుడు ఉద్యోగులు ఆర్‌ఎస్‌ఎస్ చెప్పినట్లు వినకపోతే ‘ఫలితం’ అనుభవించవలసిందే. ఇప్పటికే ఆర్‌ఎస్‌ఎస్ ప్రయోజనాలు నెరవేర్చేందుకు ఆ సంస్థకు అంకితమైన గ్రూపులు ఉద్యోగులలో ఉన్నాయి. ఈ గ్రూపులు ఆర్‌ఎస్‌ఎస్‌కు అవసరమైన రహస్యాలను మోసేందుకు సిద్ధంగా ఉన్నారు. అధికార సమాచారాన్ని ఆర్‌ఎస్‌ఎస్ అందచేస్తూ వచ్చారు.
చాలా కాలంగా మిలిటరీలో చొరబడేందుకు ఆర్‌ఎస్‌ఎస్ ప్రయత్నిస్తోంది. ఇప్పటివరకు మిలిటరీ బహుళత్వానికి చిహ్నం. మోదీ పాలనలో బహుళత్వం అనేక విధాలుగా ఉల్లంఘనకు గురవుతోంది. మిలిటరీ అధికారులకు శిక్షణనిచ్చే పాఠ్యాంశాలలో రామాయణం, భారతం, భాగవతంలను బోధించాలని ‘‘సెంటర్‌ఫర్ లాండ్ వార్ ఫేర్’’ పత్రికలో 2016లో వ్యాసం ప్రచురితమైంది. ఇప్పటి సైనిక నాయకత్వానికి మనుస్మృతి నాయకత్వ భావజాలాన్ని సూత్రాలను ఇప్పుడు అనుసరించాలని ఆ పత్రిక ప్రచురించిన వ్యాసం కోరింది. కార్గిల్ యుద్ధం తర్వాత జరిగిన ఎన్నికల ప్రచారంలో బీజేపీ త్రివిధదళాల ఉన్నతాధికారుల ఫొటోలను వినియోగించింది. అప్పుడు సైనిక సర్వాధికారి మాలిక్ దీన్నిగట్టిగా వ్యతిరేకించారు. ఎన్నికల్లో ప్రయోజనం పొందడానికి ఫొటోలను వినియోగించడంపై త్రివిధ సైనిక దళాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అప్పుడు మోదీ త్రివిధ దళాల సర్వాధికారిగా ఒక్కరినే నియమించారు. 2016లో వేయిమంది సైనికులను రామ్‌దేవ్‌యోగా కేంద్రంలో యోగా నేర్చుకునేందుకు పంపారు. 2018లో ఆర్‌ఎస్‌ఎస్ దళాలు యోగాను మూడు రోజుల్లో నేర్చుకుంటారని, సైనిక దళాలకు నెలలు పడుతుందని ఆర్‌ఎస్‌ఎస్ సర్వసంఫ్‌ు చాలక్ భగవత్ వ్యాఖ్యానించారు. రాజ్యాంగం అనుమతిస్తే ఆర్‌ఎస్‌ఎస్‌కు దేశ సరిహద్దులో పోరాడేందుకు మూడురోజులు సరిపోతుందని కూడా వ్యాఖ్యానించారు. అగ్నివీర్ పథకాన్ని మోదీ ఏర్పాటు చేయడంలో రహస్యవ్యూహం ఉండవచ్చు. అనేక మంది ప్రభుత్వ సీనియర్ అధికారులకు ఇలాంటి భావనలున్నాయి. ఇప్పుడు వాళ్లు బహిరంగంగా మాట్లాడే అవకాశం ఉంది. ఇప్పటికే వీరు బీజేపీ అనుకూల సేవలు అందిస్తున్నారు. అత్యధిక ఉన్నతాధికారులు పాలిస్తున్న పార్టీకి మద్దతుగా పనిచేస్తున్నారు. ఇందుకు ఉదాహరణ వివాదాస్పదమైన ఇప్పటి ప్రధాన ఎన్నికల కమిషర్ సంజయ్ మిశ్రా ప్రభుత్వ నియమనిబంధనలు, రాజ్యాంగ అంశాలను ఉల్లంఘించి తన గురువు నరేంద్ర మోదీకి అవసరమైన రాజకీయ ప్రయోజనాలు కల్పించారన్న ఆరోపణలు వచ్చాయి. గత సంవత్సరం జూన్ 11న సత్నాలో జరిగిన ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమంలో ఇద్దరు అధికారులు పాల్గొన్నారు. వీరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రానున్న ప్రమాదాన్ని గుర్తించి తగిన విధంగా స్పందించాలి.