Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 13, 2024
Friday, September 13, 2024

స్వాతంత్య్ర పరిరక్షణకు పునరంకితం కావాలి!

‘‘జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసీ’’ అంటే కన్నతల్లీ, పుట్టిన దేశం ముందు స్వర్గం కూడా దిగదుడుపేనని అర్థం. పరాయి దేశస్థులు కన్నతల్లి వంటి పుట్టిన భూమిని చెరపట్టి 200 ఏళ్లపాటు బానిస సంకెళ్లతో ప్రజలను పాలించారు. స్వేచ్ఛా వాయువుల కోసం తపించిన భారతీయులు ఒక్కటిగా విజయమో వీరస్వర్గమో అంటూ ఆసేతుహిమాచల పర్యంతం ఎన్నో కష్టాలను, కన్నీళ్లను, బాధలను అనుభవించారు. లాఠీలకు, తూటాలకు ఎదురొడ్డి నిలిచారు. విజయమో, వీరస్వర్గమో అంటూ అడుగడుగున రక్తతర్పణ చేశారు. బ్రిటీష్‌ ముష్కర లాఠీలకు శరీరాలు అంకితం చేశారు. దీర్ఘకాల ప్రవాస శిక్షలను అనుభవించారు. చేత తుపాకులు, బాంబులుపట్టి రహస్య జీవితం గడిపారు. బ్రిటీషు పాలకుల ఉరితాళ్లకు తమ శిరస్సులను కానుకగా సమర్పించారు. మతం, కులం పక్కనపెట్టి ఒకే జాతిగా హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిక్కులందరూ ఏకమై పోరాడారు. దేశాభిమానము మాకు కద్దంటూ స్వరాజ్య సాధనాకాంక్షతో ఉద్యమం సాగించారు. సంఘ సంస్కరణ, మత సంస్కరణ, జాతీయ పునరుజ్జీవనం ముప్పేటగా ఒక్కటై దేశభక్తియుత ఉద్యమం సాగింది. 1857 మీరట్‌ తిరుగుబాటుతో ప్రారంభమై 1947లో స్వాతంత్య్రం సిద్ధించే వరకు వివిధ రూపాలలో అప్రతిహతంగా స్వాతంత్య్ర సమరం సాగింది. వేరువేరు పాయలగా ఉద్యమ ప్రస్థానం బ్రిటీష్‌ పాలకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. 90 ఏళ్లపాటు సాగిన స్వాతంత్య్ర సమరంలో ఎంతో రక్త ం చిందింది. కన్నీరు వరదలా పారింది. త్యాగధనులు ఎందరో ఆత్మ బలిదానం చేశారు. 1757 జూన్‌ 23 న ప్లాసీ యుద్ధంలో బెంగాలు నవాబు సిరాజుద్దౌలా ఓటమితో ప్రారంభమైన బానిస అధ్యాయం నూరేళ్లపాటు బ్రిటీష్‌ దోపిడీ ఎదురులేకుండా సాగింది. 1857 మీరట్‌ తిరుగుబాటులో 10 వేలమందిని బ్రిటీష్‌ వాళ్లు ఉరితీశారు లేదా అగ్ని వర్షానికి ఆహుతి చేశారు. దీనితో ఈస్టిండియా కంపెనీ పాలనకు చరమగీతం పాడి బ్రిటీష్‌ రాణి స్వయంపాలన ప్రారంభమైంది. 1885 డిసెంబరు 28 న బొంబాయిలో గోకుల్‌దాస్‌ తేజ్‌పాల్‌ కళాశాలలో ‘అలాన్‌ ఆక్టోవియన్‌ హ్యూమ్‌’ అనే ఆంగ్లేయుని నేతృత్వంలో ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ ఏర్పడిరది. 1905 బెంగాల్‌ విభజన వ్యతిరేక ఉద్యమం ప్రజలలో స్వాతంత్య్ర కాంక్షను తట్టిలేపింది. ప్రజలలో జాతీయ చైతన్యం వెల్లివిరిసింది. ఈ కాలంలోనే అతివాద ఉద్యమ బీజాలు మొలకెత్తి అనేక రహస్య విప్లవ సంఘాల నిర్మాణం జరిగింది. ఖుదీరాంబోసు, ప్రపుల్లచాకీ వంటి ధీరోదాత్తులు ఆత్మ బలిదానం చేశారు. 1908లో అరవిందఘోష్‌ వంటి విప్లవ కార్యకర్తలు ఆలీపూర్‌ కుట్రకేసును ఎదుర్కొన్నారు. 1914, 15లో లాలా హరదయాళ్‌ గదర్‌ పత్రికను, పార్టీని అమెరికా గడ్డపై స్థాపించి స్వదేశ విముక్తికై కార్యకర్తలను, ఆయుధాలను సమీకరించాడు. సొహన్‌సింగ్‌ బాక్నా, జితేంద్రనాథ్‌ లహరి, దర్శి చెంచయ్యలతో ‘కామాగాటా మారు’ అనే నౌకలో హాంకాంగ్‌, కెనడా నుంచి బయలుదేరి సయాం కొండల మీదుగా సైన్యంతో బర్మా వెళ్లి బ్రిటీష్‌ వారితో యుద్ధంచేసి దేశ విముక్తి చేయాలని ప్రయత్నించారు. వీరు అరెస్టయి చిత్రహింసలు అనుభవించారు. ఈ క్రమంలో తెలుగువాడు దర్శి చెంచయ్య చైనా జాతీయ నాయకుడు ‘సన్‌యెట్‌సేన్‌’ ను కలిశారు. తెలుగువారు భాగవతుల సోమయాజి శర్మ, పి.జె.వెంకయ్య గదర్‌ ఉద్యమంలో పాల్గొన్నారు. 1914 మొదటి ప్రపంచ యుద్ధంలో 8 లక్షల మంది భారత సైనికులు బ్రిటీష్‌ వారి తరపున యుద్ధంలో పాల్గొన్నారు. అక్కడి విజయాలు భారతీయులలో ఆత్మవిశ్వాసం పెంపొందించాయి. భారత స్వాతంత్య్రం కోసం పోరాడాలనే కాంక్షను పెంచాయి. 1919 జలియన్‌వాలాబాగ్‌ దురంతం భారతీయులలో క్రోధావేశాలను పెంచింది.
1915 లోనే మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుంచి భారత దేశం వచ్చారు. 7 నెలలపాటు దేశమంతా పర్యటించి సహాయ నిరాకరణ ఉద్యమానికి పిలుపునిచ్చారు. 1917 రష్యన్‌ విప్లవం ప్రపంచమంతా కమ్యూనిస్టు భావ చైతన్యాన్ని వెల్లువలా వ్యాప్తిచేసింది. సామ్రాజ్యవాదానికి, పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా కార్మికవర్గం, కష్టజీవులు సంఘటితమై పోరాడారు. 1920లో ఏఐటీయూసీ, 1925 లో భారత కమ్యూనిస్టుపార్టీ స్థాపనతో దేశంలో శ్రామికవర్గ చైతన్యం వెల్లివిరిసి అనేక సమ్మెలు, పోరాటాలు జరిగాయి. సమ్మెలపై ప్రభుత్వం ఉక్కు పాదం మోపింది. పోలీసు కాల్పులు, ప్రాణ త్యాగాలు జరిగాయి. బొంబాయి నగర వీధులు కార్మికుల రక్తంతో ఎరుపెక్కాయి. కమ్యూనిస్టు భావాలను తుంచివేసే ప్రయత్నంలో 1920లో పెషావర్‌ కుట్ర కేసు, 1924లో కాన్పూరు కుట్రకేసు, 1925లో కాకోరీ కుట్రకేసులను ప్రభుత్వం బనాయించింది. అనేకమంది కమ్యూనిస్టులను జైలు పాలుచేసింది. ఉరికంబాలు ఎక్కించింది. చంద్రశేఖర్‌ అజాద్‌, శచీంద్రనాథ్‌ బక్షి, అసఫాకుల్లా ఖాన్‌, రాజేంద్రనాథ్‌ó్‌్‌ లహరి, రాంప్రసాద్‌ బిస్మల్‌, రోషన్‌సింగ్‌, శచీంద్రనాథ్‌్‌ సన్యాల్‌, మన్మధ గుప్తా వంటివారు ఉరిశిక్షలు, యావజ్జీవ ద్వీపాంతరవాస శిక్షలు అనుభవించారు. 1931 ప్రాంతంలో భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖదేవ్‌ను లాహోర్‌ కుట్రకేసులో ఉరితీశారు. జైలులో జతిన్‌దాస్‌ నిరాహారదీక్షతో ప్రాణత్యాగం చేశాడు. 1931 ఫిబ్రవరిలో చంద్రశేఖర్‌ అజాద్‌ బొంబాయిలో పోలీసులతో హోరాహోరీ పోరులో తనకు తాను కాల్చుకుని చనిపోయాడు. 1930 లో చిట్టగాంగ్‌ ఆయుధాగారాన్ని విప్లవకారులు ముట్టడిరచటమే గాకుండా చిట్టగాంగ్‌ అడవులలో సూర్యసేన్‌, కల్పనాదత్‌, ప్రీతిలత వడ్డేదార్‌ నేతృత్వంలో సుదీర్ఘకాలం సాయుధపోరాటం సాగింది. 1940లో సుభాస్‌చంద్రబోస్‌ ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీని స్థాపించి బర్మా అడవులలో బ్రిటీష్‌వారితో పోరాడారు. 1946లో బొంబాయిలో భారత నావికుల తిరుగుబాటు జరిగింది. బొంబాయి కార్మికవర్గం, కమ్యూనిస్టులు సైనికులతో కలిసి బ్రిటీష్‌ ముష్కరులతో పోరాడారు. బొంబాయి వీధులు కార్మికుల, కమ్యూనిస్టుల, సైనికుల రక్తంతో తడిసి ముద్దయ్యాయి. విప్లవకారులు, కమ్యూనిస్టుల పోరాటాలు, వీటికి తోడు మహాత్మాగాంధీ అహింసాయుత పోరాటం ఫలితంగా 1947 ఆగస్టు 15 న దేశం స్వాతంత్య్రం పొందింది. స్వాతంత్య్రానంతరం సంస్థానాల విలీనం కొరకు జరిగిన పోరాటంలో కమ్యూనిస్టులు చారిత్రక పాత్ర వహించారు. కశ్మీర్‌, మైసూరు, తిరువాన్కూరు, కుచ్‌బిహారీ, త్రిపుర, మయూర్‌గంజ్‌, మణిపూర్‌, భోపాల్‌ సంస్థానాల విలీనం జరిగింది. హైదరాబాద్‌ సంస్థాన విలీన సాయుధ పోరాటంలో 4 వేల కమ్యూనిస్టులు వీర మరణం చెందారు.
స్వాతంత్య్రానంతరం దేశం స్వయం స్వావలంబన కోసం కమ్యూనిస్టులు పోరాడారు. దున్నేవానికే భూమి నినాదాన్ని ముందుకు తెచ్చి భూమి పంపిణీ చేశారు. సామాజిక అణచివేతకు వ్యతిరేకంగా, భూస్వామ్య, పెత్తందారీ విధానానికి వ్యతిరేకంగా సుదీర్ఘపోరాటంచేసి అశేష త్యాగాలు చేశారు. వర్ణ వివక్ష, సామాజిక పీడనలను అంతంచేసి, ఆర్థిక సమానత్వంకోసం దోపిడీ శక్తులకు వ్యతిరేకంగా సమరశీల పోరాటాలు నిర్వహించారు. భూ సంస్కరణల చట్టం, బ్యాంకుల జాతీయకరణ, రాజభరణాల రద్దు వంటి చర్యలకు ఉద్యమించి విజయాలు సాధించారు. ఆర్థిక అసమానతలు అంతంచేసి సోషలిజం కోసం, దోపిడీ రహిత నూతన సమాజం కోసం పోరాడారు. నేటికి దేశ వ్యాపితంగా కార్పొరేట్‌ వర్గాల దోపిడీని అడుగడుగునా ప్రతిఘటిస్తూ శ్రామిక వర్గం, కష్టజీవులను ఐక్యంచేసి పోరాడుతున్నారు. సోషలిస్టు సమాజ స్థాపనకు అంకితమై పని చేస్తున్నారు.
స్వాతంత్య్ర పోరాటంలో ఇసుమంత పాత్రలేనివారు, బ్రిటీష్‌ దొరలకు దాసోహం అని క్షమాభిక్ష కోరినవారు, శాంతిదూత మహాత్మాగాంధీని హత్యచేసిన వారి వారసులు నేడు తాము దేశ భక్తులమని చెప్పుకుంటూ అధికారం పీఠంఎక్కి చరిత్రకు వక్ర భాష్యాలు చెబుతున్నారు. తామే నిజమైన దేశ భక్తులమని ప్రచారం చేస్తున్నారు. ప్రథమ ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూని దేశద్రోహిగా చిత్రించే ప్రయత్నం చేస్తున్నారు. గుజరాతీ జాతీయభావాన్ని దేశమంతా విస్తరించే ప్రయత్నం చేస్తున్నారు. భారతదేశ సెక్యులర్‌ రాజ్యాంగాన్ని ధ్వంసంచేసి దాని స్థానంలో మనుస్మృతిని తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. స్వాతంత్య్రం ముందు ఉన్న సాంస్కృతిక వారసత్వ స్మారక చిహ్నాలను తొలగించాలని యోచిస్తున్నారు. ముస్లిం, క్రైస్తవ మతాలను వ్యతిరేకిస్తూ హిందూమత దురహంకారాన్ని రెచ్చగొడుతున్నారు. దేశ స్వాతంత్య్ర పోరాటం ద్వారా సంక్రమించిన దేశభక్తి, త్యాగం స్థానంలో స్వార్థపరత్వం, స్వీయ మానసిక ధోరణితో కూడిన చర్యలకు ఉపక్రమిస్తున్నారు. 77 ఏళ్ల స్వాతంత్య్రకాలంలో దేశం సాధించిన విజయాలను, ఆనాటి కాలమాన పరిస్థితులలో జరిగిన అనేక నిర్ణయాలను తిరగదోడి దేశంలో వివిధ వర్గాల ప్రజల మధ్య అనైక్యతను సృష్టిస్తున్నారు. కోట్లాది సాధారణ ప్రజల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దేశ స్వాతంత్య్రం కోసం నిస్వార్థంగా పోరాడిన గాంధేయవాదులను, జాతీయ నాయకులను, దేశం కోసం తృణప్రాయంగా ప్రాణాలర్పించిన విప్లవకారులను, స్వాతంత్య్రంకోసం రక్తం చిందించి, దీర్ఘకాలం క్రూర నిర్బంధం ఎదుర్కొన్న కమ్యూనిస్టులను తక్కువచేసి బ్రిటీష్‌ వారికి పాదాక్రాంతమై క్షమాభిక్ష కోరిన దేశ ద్రోహులకు పెద్ద పీట వేస్తున్నారు.
నేడు బీజేపీ, మతోన్మాదుల పాలనలో దేశం అన్ని రంగాలలో వెనుకబడిరది. అవినీతి, ఆశ్రిత పక్షపాతం రాజ్యమేలుతున్నాయి. నిరుద్యోగం పెరిగిపోయింది. మహిళల మానప్రాణాలకు రక్షణలేదు. విద్యా వ్యవస్థ కాషాయీకరణ జరుగుతోంది. శాస్త్రీయ విద్యా బోధన స్థానంలో మూఢ విశ్వాసాలు, జ్యోతిష్యం, వేదాధ్యయనం వంటి వాటిని చొప్పిస్తున్నారు. కార్మికుల హక్కులు హరించి వేశారు. వ్యవసాయం రైతుల చేతుల నుంచి కార్పొరేట్ల హస్తగతమౌతోంది. దేశ అలీనవిధానం స్థానంలో సామ్రాజ్యవాద శక్తుల ఒత్తిడికి లొంగిపోతున్నారు. పారిశ్రామిక రంగం సంక్షోభంలో ఉంది. ఆకలి, దారిద్య్రం, ద్రవ్యోల్బణం అదుపు తప్పాయి. దేశ స్వాతంత్య్రం, స్వేచ్ఛ, సమానత్వం ప్రమాదంలోపడ్డాయి. దేశ స్వాతంత్య్ర పరిరక్షణ ప్రధాన కర్తవ్యంగా నూతన సామాజిక వ్యవస్థ నిర్మాణానికి ప్రజలు పునరంకితం కావాలి. అదే నేటి కర్తవ్యం. త్యాగధనుల స్ఫూర్తితో స్వాతంత్య్ర పరిరక్షణకు ప్రజలందరు కర్తవ్యోన్ముఖులు కావాలి.

సీపీఐ రాష్ట్రసమితి సభ్యులు
సెల్‌: 94909 52093

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img