విశాలాంధ్ర,సీతానగరం: స్టానిక జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారంనాడు మండల స్థాయి చెకుముకి పోటీలను నిర్వహించారు.మండలంలోని ఏడు ఉన్నత పాఠశాలలనుంచి విద్యార్దులు హాజరుకాగా, నిడగల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు మండలంలోని ప్రథమ స్థానాన్ని కైవశం చేసుకున్నారు.సీతానగరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ద్వితీయ స్థానాన్ని, జోగమ్మపేట కేజీబీవీ విద్యార్థులు తృతీయ స్థానాన్ని సాధించారని నిర్వాహకులు తెలిపారు.వారందరికీ మెమోంటోలు, ప్రశంసా పత్రాలను అందజేశారు.అక్టోబరు 27న జిల్లా స్థాయి చెకుముకి పోటీలలో వీరు పాల్గొంటారని ఉన్నత పాఠశాల హెచ్ ఎం ఇళ్లా ప్రసన్న లక్ష్మి తెలిపారు.
ఈకార్యక్రమంలో జెవివి జిల్లా ఉపాధ్యక్షులు రేవళ్ల సతీష్ రాజు, మండల ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ గంట, జిల్లా సైన్స్ కోఆర్డినేటర్ పెంట రామకృష్ణలు పాల్గొని కార్యక్రమం గూర్చి వివరించారు. సమాజంలో మూఢనమ్మకాలపై ప్రచారం చేయడం జరుగుతుందన్నారు. విజేతలను సీతానగరం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రసన్న లక్ష్మి ఉపాధ్యాయులు సిబ్బంది అభినందించారు. నిడగల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మనోజ్ కుమార్ సిబ్బంది, కేజీబీవీ ప్రిన్సిపాల్ సంధ్య ఉపాధ్యాయ సిబ్బంది అభినందించారు.