విశాలాంధ్ర, పార్వతీపురం: ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా పార్వతీపురం మన్యంజిల్లా గిరిజన సహకార సంస్థ ఏర్పాటుచేసిన స్టాల్ ను జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ ,జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక, ఐటిడిఏ ప్రాజెక్టు ఆఫీసర్ సేధు మాధవన్, రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకర్రావు, పార్వతీపురం ,కురుపాం ఎమ్మెల్యేలు విజయ్ చంద్ర, జగదీశ్వరిలతోపాటుజిల్లా అధికారులు సందర్శించి వాటిగూర్చి అడిగి తెలుసుకున్నారు. గిరిజన సహకార సంస్థ అమ్మే వస్తువులను వారు కొనుగోలు చేశారు. గిరిజనులు తయారు చేస్తున్న వస్తువులను కొనుగోలు చేస్తూ వాటిని జిసిసి ద్వారా అమ్మకాలు చేయడం జరుగుతుంది జిసిసి డివిజనల్ మేనేజర్ మహేంద్ర కుమార్ తెలిపారు. జిసిసి ఉత్పత్తులకు మంచి గిరాకి కూడా ఉంటుందన్నారు. ఈకార్యక్రమంలో జిసిసి ఉద్యోగులు పాల్గొన్నారు.