విశాలాంధ్ర, పార్వతీపురం:పార్వతీపురం మన్యంజిల్లా కేంద్రంలోగల ప్రభుత్వ ఎస్వీడిగ్రీ కళాశాల విద్యార్థులు,అధ్యాపకులు కలిసికట్టుగార ఎనిమిది వేలరూపాయల విరాళంను ఎస్ఎఫ్ఐ నేత పడాల రాజశేఖర్ కు అందజేసారు. ఈడబ్బులను వరదప్రాంతాల్లోని పిల్లల పుస్తకాలు కోసం వినియోగించాలని ప్రిన్సిపాల్ డాక్టర్ చింతల చలపతిరావు తెలిపారు.విజయవాడ వరద భాదితులను మానవతా దృక్పథంతో అంతా ఆదుకోవాలని కోరారు.ఈకార్యక్రమంలో ఇంగ్లీష్ లెక్చరర్ శాంతాకుమారి, ఎన్ సి సి కెప్టెన్ గుప్తా,అధ్యాపకులు ఎల్లం నాయుడు,శ్రీనివాసరావు, కిషోర్ తదితరులు పాల్గొన్నారు