విశాలాంధ్ర, పార్వతీపురం/సీతానగరం:ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలవైద్యులు జి ఓ 85కి వ్యతిరేకంగా తమ ఆందోళనను వ్యక్తం చేస్తూ సోమవారం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, గొల్లపూడికి అధికారిక నోటీసు అందజేసి ఈజీవోను అన్యాయంగా పరిగణించి మంగళవారం నుండినుండి సమ్మె ప్రారంభించామని పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలవైద్యులు తెలిపారు.
వైద్యుల మాటల ప్రకారం ఈజిఓ ద్వారాతమ మూడేళ్ల సర్వీసు అర్ధం లేకుండా పోయిందన్నారు.ఇలా అకస్మాత్తుగా జీవోను మార్చడం అన్యాయమని, తమ వృత్తి ప్రగతికి తీవ్ర నష్టం వాటిల్లుతోందన్నారు. గత రెండు నెలలుగా జీవో 85 రద్దు చేయమని అందరి అధికారులకు, శాసనసభ్యులకు అర్జీలు సమర్పించినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి సమాధానం రాలేదని వైద్యులు నిరాశ వ్యక్తం చేశారు. కొవిడ్ -19సమయంలో మా జీవితాలను ప్రమాదంలో పెట్టి సేవలు అందించినప్పటికీ, ఇప్పుడు జిఓ 85 ద్వారా పీజీ అవకాశాలు తగ్గించడం అన్యాయమని, ఇది ముఖ్యంగా గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో సేవలను ప్రభావితం చేస్తుందని అన్నారు.
ఆందోళన ప్రణాళికలు ఇలా…
మొదటి రోజు మంగళవారం విధులు నిర్వహిస్తూ, నిరసనగా వైద్యులు నల్ల బ్యాడ్జీలను ధరిస్తామని తెలిపారు.
ఈనెల 11, 12తేదీల్లో సేవలలో అంతరాయం లేకుండా నిరసన కొనసాగుతుందన్నారు. ఈరెండు రోజుల ప్రభుత్వ చర్చల కోసం ఎదురు చూస్తామని తెలిపారు.ప్రభుత్వం చర్చలకు ఆహ్వానిoచనిచో ఈనెల 13న పి హెచ్ సి వైద్యులు అత్యవసర సర్వీసులను మినహాయించి, అన్ని రిపోర్టింగ్‌లు, విసి, టి సి మరియు అధికారిక కమ్యూనికేషన్‌లు నిలిపివేస్తామని తెలిపారు. ఈనెల 14న పి హెచ్ సి సేవలు కేవలం అత్యవసర వైద్య సేవలకు మాత్రమే పరిమితం చేయబడతాయన్నారు. ఈనెల 15న “చలో విజయవాడ” ర్యాలీ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయం వద్ద జరుగుతుందన్నారు. ఈనెల 16నుండి జిఓ 85రద్దు చేసేవరకు నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభం అవుతుందన్నారు.
ఇంతకాలం నిరసనలు, అర్జీలు ఇచ్చినా ప్రభుత్వం స్పందించకపోవడంతో మంగళ వారం విడుదలైన నీట్ పీజీ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ తరువాత వైద్యులు ఇలానే కొనసాగడం సాధ్యం కాక సమ్మెకు దిగవలసిన పరిస్థితి ఏర్పడిందని పలువురు వైద్యులు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జిఓ 85ని రద్దు చేయాలని, వైద్యుల సమస్యలను పరిష్కరించ డానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యుల సంఘం వైద్యులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా సీతానగరం, పెదంకలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు ఉషారాణి పావని రాధాకాంత్ లు నల్ల బ్యాడ్జీలు ధరించి వైద్య సేవలు అందించారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇదేవిధంగా నల్ల బ్యాడ్జీలు ధరించి సేవలు అందించినట్లు తెలిపారు.