విశాలాంధ్ర, పార్వతీపురం: ప్రజాసమస్యలను పరిష్కార కోసమే ప్రజాదర్బార్ ప్రతిరోజు ఉదయం, సాయంత్రం పూట నిర్వహిస్తున్నట్లు పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర తెలిపారు.ప్రజా దర్బార్ కు మంచి స్పందనకూడా లభిస్తున్నట్లు తెలిపారు.వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలు, నిరుద్యోగ యువత ,పెద్దలు అధిక సంఖ్యలో హాజరై వినతులు ఇస్తుండగా సంబంధిత అధికారులు దృష్టికి సమస్యను తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే విజయ్ చంద్ర తెలిపారు.కొన్ని సమస్యలను వెంట వెంటనే కూడా పరిష్కారం చేస్తున్నట్లు తెలిపారు.