విశాలాంధ్ర,సీతానగరం: మండలంలోని జోగంపేట గ్రామానికి చెందిన బొమ్మినాయిని లక్ష్మణరావు-గంగమ్మల పెద్దకుమారుడు బొమ్మినాయిని ప్రశాంత్ కు వికలాంగ పెన్షన్ డబ్బులను ఆన్లైన్ ద్వారా ఈనెల4నచెల్లించి పెన్షన్ రద్దు కాకుండా నిలిపిన రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కు పెన్షన్ దారుడు కుటుంబసభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు. మూడునెలలపాటు వరుసగా పెన్షన్ తీసుకోకపోతే రద్దవుతుందన్న దృష్ట్యా తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చినపల్లిలో ఎంబిఎ మొదటి సంవత్సరం చదువుతున్న ప్రశాంత్ చదువురీత్యా ఇంటికి దూరంగా ఉండటంతో మూడు నెలల నుండి పెన్షన్ తీసుకోలేదు.తన పెన్షన్ పై రాష్ట్రమంత్రి కొండపల్లి శ్రీనివాస్ కు వివరించగా ఆయన తక్షణమే స్పందించి తన సమస్యను పరిష్కారం చేస్తానని వెంటనే వాట్సాప్ ద్వారా తనకు తెలిపారన్నారు. మంత్రి ఇచ్చినమాటప్రకారంస్పందించి రాష్ట్ర అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో వారు మెమో జారీచేసి తనకు పెన్షన్ ఆన్లైన్ ద్వారా అందించే చర్యలు తీసుకున్నారన్నారు. గతంలో కరెంట్ షాక్ తో కూడా కుడిచేయి పోగొట్టుకున్న తనకు వచ్చే పెన్షన్ నిలుపుదల కాకుండా ఎన్డిఏ ప్రభుత్వం తగుచర్యలు తీసుకోవడం పట్ల ప్రశాంత్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు, రాష్ట్ర విద్యాశాఖమంత్రి నారాలోకేష్ కు, రాష్ట్ర సెర్ప్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కు, పార్వతీపురం బొబ్బిలి ఎమ్మెల్యేలు బోనెలవిజయ్ చంద్రకు ,బేబీనాయనలకు ప్రశాంత్ తోపాటు అతని కుటుంబ సభ్యులు లక్ష్మణరావు, గంగమ్మ, మనోహర్ వెంకటరమణలు, జోగంపేట గ్రామ పెద్దలు ధన్యవాదాలు తెలియజేశారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఇటువంటి సమస్య పరిష్కారం జరుగుతుందన్న నమ్మకాన్ని ఒమ్ము చేశారని తెలిపారు.